Skip to content

Throne గురించి బైబిల్ వచనాలు

31 వచనాలు · 8 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నా రాజభవన అధికారిగా నీవు ఉంటావు, నా ప్రజలంతా నీ ఆదేశాలకు లోబడతారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీ పైవాడిగా ఉంటాను” అని అన్నాడు.

  2. అప్పుడు ఈజిప్టులోని ప్రతి మొదటి సంతానం చస్తారు, సింహాసనం మీద కూర్చునే ఫరో మొదటి సంతానం మొదలుకొని తిరగలి విసిరే దాసి మొదటి సంతానం వరకు, పశువుల్లో కూడా మొదట పుట్టినవి చస్తాయి.

  3. రాజైన దావీదు, “యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలువండి” అన్నాడు. వారు రాజు దగ్గరకు వచ్చినప్పుడు,

  4. రాజు వారితో, “మీ ప్రభు సేవకులను మీతో తీసుకెళ్లి, నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి దిగువనున్న గిహోనుకు తీసుకెళ్లండి.

  5. అక్కడ యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను అతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకిస్తారు. అప్పుడు బూర ఊది, ‘రాజైన సొలొమోను చిరకాలం జీవించు గాక!’ అని బిగ్గరగా కేకలు వేయండి.

  6. అప్పుడు మీరు అతని వెంట వెళ్లాలి, అతడు వచ్చి నా సింహాసనం మీద ఆసీనుడై నా స్థానంలో పరిపాలిస్తాడు. ఇశ్రాయేలు మీద యూదా మీద నేను అతన్ని పాలకునిగా నియమించాను” అని అన్నాడు.

  7. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుతో, “ఆమేన్! నా ప్రభువు దేవుడైన యెహోవా దానిని స్థిరపరచును గాక!

  8. యెహోవా రాజైన నా ప్రభువుతో ఉన్నట్లు సొలొమోనుతో ఉండి, అతని సింహాసనాన్ని నా ప్రభువును రాజునైన దావీదు సింహాసనం కంటే గొప్ప దానిగా చేయును గాక!” అన్నాడు.

  9. కాబట్టి యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను, యెహోయాదా కుమారుడైన బెనాయా, వ్యక్తిగత సేవకులుగా ఉన్నా కెరేతీయులు, పెలేతీయులు రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనుకు తీసుకెళ్లారు.

  10. యాజకుడైన సాదోకు పరిశుద్ధ గుడారంలో నుండి కొమ్ముతో నూనె తెచ్చి సొలొమోనును అభిషేకించాడు. అప్పుడు వారు బూర ఊదగా ప్రజలందరు, “రాజైన సొలొమోను చిరకాలం జీవించును గాక!” అని అంటూ కేకలు వేశారు.

  11. ప్రజలందరు పిల్లన గ్రోవులు ఊదుతూ ఎంతో ఆనందిస్తూ అతని వెంట వెళ్లారు. ఆ శబ్దానికి భూమి అదిరింది.

  12. అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని పాలనాధికారం స్థిరపరచబడింది.

  13. బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకు అదోనియా తరుపున మాట్లాడడానికి వెళ్లినప్పుడు, రాజు ఆమెను కలుసుకోడానికి లేచి ఆమెకు నమస్కారం చేసి తన సింహాసనం మీద కూర్చున్నాడు. రాజు తల్లి కోసం సింహాసనం ఒకటి తెప్పించాడు, ఆమె అతని కుడి ప్రక్కన కూర్చుంది.

  14. నన్ను స్థిరపరచి, నా తండ్రియైన దావీదు సింహాసనం మీద నన్ను ఆసీనుడిగా చేసి, తన వాగ్దానం ప్రకారం నా కోసం రాజవంశాన్ని స్థాపించిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అదోనియా ఈ రోజు చనిపోవలసిందే!”

  15. “యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకున్నారు; యెహోవా వాగ్దానం చేసినట్లే, నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇశ్రాయేలు రాజ సింహాసనం ఎక్కాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరాన్ని కట్టించాను.

  16. మీలో ఆనందిస్తూ, మిమ్మల్ని ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టిన మీ దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక! ఇశ్రాయేలు పట్ల ఆయనకున్న నిత్యమైన ప్రేమను బట్టి నీతిన్యాయాల ప్రకారం కార్యాలు జరిగించడానికి యెహోవా మిమ్మల్ని రాజుగా చేశారు” అని అభినందించింది.

  17. తర్వాత రాజు దంతంతో పెద్ద సింహాసనం చేయించి మేలిమి బంగారంతో పొదిగించాడు.

  18. సింహాసనానికి ఆరు మెట్లున్నాయి, దాని వెనుక భాగం గుండ్రంగా ఉంటుంది. సింహాసనానికి రెండు వైపులా చేతులు పెట్టుకోవడానికి ఉన్నాయి. వాటి దగ్గర రెండు సింహాలు నిలబడి ఉన్నాయి.

  19. ఆరు మెట్లమీద మెట్టుకు రెండు చొప్పున పన్నెండు సింహాలు ఇరువైపుల నిలబడి ఉన్నాయి. అలాంటిది మరే రాజ్యంలో తయారుచేయబడలేదు.

  20. కాబట్టి సొలొమోను రాజుగా తన తండ్రియైన దావీదు స్థానంలో యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు. అతడు అన్నిటిలో వృద్ధి చెందాడు, ఇశ్రాయేలీయులందరు అతనికి విధేయులయ్యారు.

  21. “యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకున్నారు; యెహోవా వాగ్దానం చేసినట్లే, నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇశ్రాయేలు రాజ సింహాసనం ఎక్కాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరాన్ని కట్టించాను.

  22. తర్వాత రాజు దంతంతో పెద్ద సింహాసనం చేయించి మేలిమి బంగారంతో పొదిగించాడు.

  23. సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. దానికి ఒక బంగారు పాదపీఠం కట్టి ఉంది. సింహాసనానికి రెండు వైపులా చేతులు పెట్టుకోవడానికి ఉన్నాయి. వాటి దగ్గర రెండు సింహాలు నిలబడి ఉన్నాయి.

  24. ఆరు మెట్లమీద మెట్టుకు రెండు చొప్పున పన్నెండు సింహాలు ఇరువైపుల నిలబడి ఉన్నాయి. అలాంటిది మరే రాజ్యంలో తయారుచేయబడలేదు.

  25. యెహోవా దావీదుకు ఇలా ప్రమాణం చేశారు, అది నమ్మదగింది, ఆయన మాట తప్పనివారు: “మీ సంతానంలో ఒకనిని మీ సింహాసనం మీద కూర్చోబెడతాను.