కంటెంట్‌కు వెళ్లండి

Solomon గురించి బైబిల్ వచనాలు: Builds for Pharaoh's daughter

8 వచనాలు · 46 కోణాలు

Builds for Pharaoh's daughter గురించి వచనాలు

  1. దాని లోపలి ఆవరణంలో అతడు నివసించే రాజభవనాన్ని ఆ విధంగానే కట్టించాడు. సొలొమోను తాను పెళ్ళి చేసుకున్న ఫరో కుమార్తెకు కూడా ఇలాంటి భవనాన్నే కట్టించాడు.

  2. ఈ నిర్మాణాలన్ని, బయట నుండి గొప్ప ఆవరణం వరకు, పునాది నుండి పైకప్పు వరకు, లోపల బయట సరియైన కొలతలతో ఇనుప పనిముట్లతో చెక్కిన విలువైన రాళ్లతో చేశారు.

  3. పునాదిని నాణ్యమైన పెద్ద రాళ్లతో వేశారు. వాటిలో కొన్ని పది మూరలు, కొన్ని ఎనిమిది మూరల రాళ్లు ఉన్నాయి.

  4. పైభాగంలో చెక్కబడిన విలువైన రాళ్లు, దేవదారు దూలాలు ఉన్నాయి.

  5. గొప్ప ఆవరణానికి చుట్టూ మూడు వరుసల చెక్కిన రాళ్లు, ఒక వరుస దేవదారు దూలాలు ఉన్నాయి. యెహోవా మందిరపు లోపలి ఆవరణం కట్టినట్లే రాజభవనపు మండపం కూడా కట్టారు.

  6. ఫరో కుమార్తె దావీదు పట్టణం నుండి సొలొమోను తన కోసం కట్టించిన భవనానికి వచ్చిన తర్వాత సొలొమోను మేడలను కట్టించాడు.

  7. సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి ఆమె కోసం కట్టించిన భవనానికి తీసుకువచ్చాడు. ఎందుకంటే, ఆయన, “ఇశ్రాయేలీయుల రాజైన దావీదు భవనంలో నా భార్య నివసించకూడదు. ఎందుకంటే యెహోవా మందసం ప్రవేశించిన స్థలాలు పరిశుద్ధమైనవి” అనుకున్నాడు.

  8. నేను గొప్ప పనులు మొదలుపెట్టాను: నా కోసం భవనాలు కట్టించుకున్నాను ద్రాక్షతోటలు నాటించాను.