కంటెంట్‌కు వెళ్లండి

Shimei గురించి బైబిల్ వచనాలు

53 వచనాలు · 19 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. షిమీ యెరూషలేము నుండి గాతుకు వెళ్లి, తిరిగివచ్చిన సంగతి సొలొమోనుకు తెలిసినప్పుడు,

  2. రాజు షిమీని పిలిపించి అతనితో, “ ‘నీవు ఉన్నచోట నుండి ఎక్కడికి వెళ్లినా నీవు ఖచ్చితంగా చస్తావు’ అని యెహోవా పేరిట ప్రమాణం చేయించి నిన్ను హెచ్చరించలేదా? అప్పుడు నీవు నాతో, ‘మీరు చెప్పింది మంచిది. నేను లోబడతాను’ అని అన్నావు.

  3. మరి ఎందుకు యెహోవా పేరిట నీవు చేసిన ప్రమాణాన్ని, నేను జారీ చేసిన ఆజ్ఞను పాటించలేదు?” అని అన్నాడు.

  4. రాజు షిమీతో ఇంకా మాట్లాడుతూ, “నీవు నా తండ్రియైన దావీదుకు చేసిన కీడు గురించి నీకు తెలుసు. ఇప్పుడు నీవు చేసిన చెడుకు యెహోవా నీకు తిరిగి చెల్లిస్తారు.

  5. కాని రాజైన సొలొమోను ఆశీర్వదించబడతాడు, దావీదు సింహాసనం యెహోవా ఎదుట నిరంతరం సుస్థిరంగా ఉంటుంది” అని అన్నాడు.

  6. తర్వాత రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు ఆజ్ఞ ఇవ్వగా అతడు బయటకు వెళ్లి షిమీని కొట్టాడు. అతడు చనిపోయాడు. రాజ్యం సొలొమోను చేతుల్లో సుస్థిరమైంది.

  7. బెన్యామీనుకు ఏలా కుమారుడైన షిమీ అధికారి;

  8. పెదాయా కుమారులు: జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కుమారులు: మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వారికి సోదరి.

  9. మిష్మా సంతానం: మిష్మా కుమారుడు హమ్మూయేలు, అతని కుమారుడు జక్కూరు, అతని కుమారుడు షిమీ.

  10. షిమీకి పదహారుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు కాని అతని సోదరులకు ఎక్కువ మంది పిల్లలు లేరు; కాబట్టి యూదా వారు వృద్ధి చెందినట్లుగా వారి వంశం మొత్తం వృద్ధి చెందలేదు.

  11. యోవేలు సంతానం: అతని కుమారుడు షెమయా, అతని కుమారుడు గోగు, అతని కుమారుడు షిమీ,

  12. గెర్షోను కుమారుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ.

  13. మెరారి సంతానం: మహలి, అతని కుమారుడు లిబ్నీ, అతని కుమారుడు షిమీ, అతని కుమారుడు ఉజ్జా,

  14. అతడు ఏతాను కుమారుడు, అతడు జిమ్మా కుమారుడు, అతడు షిమీ కుమారుడు,

  15. అదాయా, బెరాయా, షిమ్రాతు అనేవారు షిమీ కుమారులు.

  16. గెర్షోనీయులకు చెందినవారు: లద్దాను, షిమీ.

  17. షిమీ కుమారులు: షెలోమీతు, హజీయేలు, హారాను మొత్తం ముగ్గురు. (వీరు లద్దాను కుటుంబాల పెద్దలు.)

  18. షిమీ కుమారులు: యహతు, జీనా, యూషు, బెరీయా. వీరు షిమీ కుమారులు మొత్తం నలుగురు.

  19. పదవది షిమీ పేరట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  20. ద్రాక్షతోటల మీద రామతీయుడైన షిమీ అధికారి. ద్రాక్షతోటల నుండి ఉత్పత్తి అయ్యే ద్రాక్షరసాన్ని నిల్వజేసే తొట్టెల మీద షిప్మీయుడైన జబ్ది అధికారి.

  21. హేమాను సంతతి నుండి: యెహీయేలు, షిమీ, యెదూతూను సంతతి నుండి: షెమయా, ఉజ్జీయేలు.

  22. ఆ తర్వాత కానుకలను, పదవ భాగాలను, ప్రతిష్ఠచేసిన వస్తువులను నమ్మకంగా లోపలికి తెచ్చారు. వాటి మీద లేవీయుడైన కొనన్యా అధికారిగా ఉన్నాడు. అతని సోదరుడైన షిమీ అతని తర్వాత స్థానంలో ఉన్నాడు.

  23. కొనన్యా చేతి క్రింద, అతని సోదరుడు షిమీ చేతి క్రింద తనిఖీ చేసేవారిగా యెహీయేలు అజజ్యాహు, నహతు, అశాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మక్యాహు మహతు బెనాయా అనే వారున్నారు. వీరిని రాజైన హిజ్కియా, దేవుని మందిరానికి అధికారియైన అజర్యా నియమించారు.

  24. లేవీయుల నుండి: యోజాబాదు, షిమీ, కెలిథా అనే కెలాయా, పెతహయా, యూదా, ఎలీయెజెరు.

  25. హాషుము వారసుల నుండి: మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీఫెలెతు, యెరేమై, మనష్షే, షిమీ.