Skip to content

Prayer గురించి బైబిల్ వచనాలు

720 వచనాలు · 120 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా నా మొర ఆలకించారు, కాబట్టి చెడు చేసేవారలారా, నా నుండి దూరంగా వెళ్లండి.

  2. కనికరం కోసం చేసిన నా మొరను యెహోవా ఆలకించారు; యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తారు.

  3. నా శత్రువులందరు సిగ్గుపడి అధిక వేదన పొందుతారు; వారు హఠాత్తుగా సిగ్గుపడి వెనుదిరుగుతారు.

  4. మీ నామం తెలిసిన వారు మీమీద నమ్మకం ఉంచుతారు, ఎందుకంటే యెహోవా, మిమ్మల్ని వెదికే వారిని మీరు ఎన్నడూ విడువరు.

  5. ఎందుకంటే రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు జ్ఞాపకముంచుకుంటాడు; బాధితుల మొరను ఆయన విస్మరించరు.

  6. యెహోవా, లెండి, మనుష్యులను గెలువనీయకండి; మీ సమక్షంలో రాజ్యాలకు తీర్పు తీర్చండి.

  7. యెహోవా, వారిని భయభ్రాంతులకు గురి చేయండి; తాము కేవలం మానవమాత్రులే అని దేశాలను తెలుసుకోనివ్వండి. సెలా

  8. దుష్టులు తమ అహంకారంలో దీనులను వేటాడతారు, వారు ఇతరుల కోసం పన్నిన కుట్రలో వారే చిక్కుకుంటారు.

  9. దుష్టుల చేతిని విరగ్గొట్టండి. కీడు చేసేవారిని వారి దుష్టత్వాన్ని బట్టి లెక్క అడగండి ఒక్కడు మిగులకుండ వారిని వెంటాడి నిర్మూలం చేయండి.

  10. యెహోవా, మీరు బాధపడేవారి కోరిక విన్నారు; మీరు వారి ప్రార్థనను ఆలకించి వారిని ప్రోత్సహిస్తారు.

  11. దావీదు ప్రార్థన. యెహోవా, న్యాయమైన నా మనవి వినండి; నా మొర ఆలకించండి. నా ప్రార్థన వినండి అది మోసపూరితమైన పెదవుల నుండి రాలేదు.

  12. నా దేవా! నేను మీకు మొరపెడతాను, మీరు నాకు జవాబిస్తారు; మీ చెవి నా వైపు త్రిప్పి నా ప్రార్థన ఆలకించండి.

  13. స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను, నా శత్రువుల నుండి నేను రక్షించబడ్డాను.

  14. నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; సహాయం కోసం నా దేవున్ని వేడుకున్నాను. తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; నా మొర ఆయన సన్నిధికి, ఆయన చెవులకు చేరింది.

  15. అతని హృదయ కోరికను మీరు తీర్చారు అతని పెదవుల నుండి వచ్చిన మనవిని మీరు ఇవ్వక మానలేదు. సెలా

  16. అతడు మిమ్మల్ని ఆయుష్షును అడుగగా, మీరు అతనికి శాశ్వతకాలం ఉండే దీర్ఘాయువును ఇచ్చారు.

  17. సంగీత దర్శకునికి. “ఉదయకాలపు జింక పిల్ల” అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన నా దేవా, నా దేవా! నన్ను ఎందుకు విడిచిపెట్టారు? నన్ను రక్షించకుండ ఎందుకంత దూరంగా ఉన్నారు, వేదనతో కూడిన నా మొరలకు ఎందుకు దూరంగా ఉన్నారు?

  18. నా దేవా, పగలు నేను మొరపెడుతున్నాను, కాని మీరు జవాబివ్వడం లేదు, రాత్రి నేను మౌనంగా ఉండడం లేదు.

  19. మా పూర్వికులు మిమ్మల్ని విశ్వసించారు; వారి నమ్మకాన్ని బట్టి మీరు వారిని విడిపించారు.

  20. వారు మీకు మొరపెట్టి విడుదల పొందారు; మీపట్ల వారు నమ్మకముంచి సిగ్గుపడలేదు.

  21. అయితే, యెహోవా మీరు నాకు దూరంగా ఉండకండి. మీరే నాకు బలం; నాకు సాయం చేయడానికి త్వరగా రండి.

  22. బాధితుల శ్రమను ఆయన తృణీకరించలేదు వారిని చూసి అసహ్యపడలేదు; ఆయన ముఖం వారి నుండి దాచలేదు. ఆయన వారి మొర ఆలకించారు.

  23. దావీదు కీర్తన. యెహోవా, నా దేవా, నేను మీపై నమ్మిక ఉంచాను.

  24. మీ కోసం ఎదురు చూసే వారెవరూ ఎన్నటికి సిగ్గుపరచబడరు; ఎన్నడూ ఆశాభంగం చెందరు, కారణం లేకుండ ద్రోహం చేసేవారి మీదకు అవమానం వస్తుంది.

  25. యెహోవా, మీ కరుణ, మీ మారని ప్రేమ జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే, అవి అనాది కాలంనాటి నుండి ఉన్నాయి.