Skip to content

Prayer గురించి బైబిల్ వచనాలు

720 వచనాలు · 120 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మేల్కొనండి, నన్ను రక్షించడానికి లేవండి! నా దేవా, నా ప్రభువా, నా పక్షాన వాదించండి.

  2. నా బాధను చూసి ఆనందిస్తున్న వారందరు అవమానంతో సిగ్గుపడాలి; నా మీద గర్వించే వారందరు సిగ్గుతో అపకీర్తి పాలవుదురు గాక.

  3. యెహోవాయందు ఆనందించు, ఆయన నీ హృదయ కోరికలు తీరుస్తారు.

  4. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించండి; ఆయనపై నమ్మకం ఉంచితే ఆయన నీకు సహాయం చేస్తారు.

  5. నా దోషం భరించలేని భారంలా నన్ను ముంచెత్తింది.

  6. నా బుద్ధిహీనతతో చేసిన పాపాల వల్ల నా గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి.

  7. నేను చాలా క్రుంగిపోయాను; దినమంతా దుఃఖంలోనే ఉన్నాను.

  8. నా వీపు తీవ్రమైన బాధతో ఉంది నా శరీరం అనారోగ్యంతో క్షీణించింది,

  9. నేను బలహీనంగా ఉన్నాను పూర్తిగా నలిగిపోయాను; నేను హృదయ వేదనతో మూలుగుతున్నాను.

  10. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా బలం క్షీణిస్తూ ఉంది; నా కంటి చూపు తగ్గిపోతుంది.

  11. యెహోవా, నేను మీ కోసం ఎదురుచూస్తున్నాను; ప్రభువా నా దేవా, మీరు జవాబిస్తారు.

  12. నేను, “నా కాలు జారితే వారు సంతోషించవద్దు వారు నాపై రెచ్చిపోవద్దు” అని ప్రార్థించాను.

  13. నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను; నా పాపాన్ని గురించి బాధపడుతున్నాను.

  14. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. యెహోవా కోసం ఓర్పుతో ఎదురుచూశాను; ఆయన నా వైపు తిరిగి నా మొరను ఆలకించారు.

  15. లెక్కలేనన్ని ఆపదలు నన్ను చుట్టి ఉన్నాయి; నా పాపాలు నన్ను పట్టుకున్నాయి, నేనేమి చూడలేని స్థితిలో ఉన్నాను. అవి నా తలవెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి, నా గుండె చెదిరిపోతుంది.

  16. నా ప్రాణం తీయాలని కోరేవారందరు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.

  17. నన్ను చూసి, “ఆహా! ఆహా!” అనేవారు వారికి కలిగే అవమానానికి ఆశ్చర్యానికి గురి కావాలి.

  18. ఒకప్పుడు జనసమూహంతో కలిసి పెద్ద ఊరేగింపుగా, ఆనందోత్సాహాలతో స్తుతులు చెల్లిస్తూ దేవుని మందిరానికి ఎలా వెళ్లేవాడినో జ్ఞాపకం చేసుకుని నా ప్రాణం నాలో క్రుంగిపోతుంది.

  19. “దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించాలి మహోన్నతునికి మీ మ్రొక్కుబడులు చెల్లించండి.

  20. ఆపద్దినాన నన్ను పిలువండి; నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నన్ను ఘనపరుస్తారు.”

  21. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. దావీదు బత్షెబతో వ్యభిచరించిన తర్వాత నాతాను ప్రవక్త తన దగ్గరకు వచ్చిన సందర్భంలో వ్రాశాడు. ఓ దేవా, మీ మారని ప్రేమను బట్టి నన్ను కరుణించండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి, నా పాపాలను తుడిచివేయండి.

  22. నా అతిక్రమాలు నాకు తెలుసు నా పాపం ఎల్లప్పుడు నా కళ్లెదుటే ఉంది.

  23. కేవలం మీకు, మీకే విరోధంగా నేను పాపం చేశాను, మీ దృష్టికి చెడు చేశాను; మీ తీర్పులో మీరు సరిగ్గా ఉంటారు మీరు తీర్పు తీర్చునప్పుడు న్యాయసమ్మతంగా ఉంటుంది.

  24. నన్ను దూషించే వారు భయంతో వెనుకకు మరలి వెళ్లిపోవాలి; మీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నిర్మూలం చేయండి.

  25. సంగీత దర్శకునికి.తంతివాద్యాలతో పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. ఓ దేవా! నా ప్రార్థన ఆలకించండి, నా విజ్ఞప్తిని విస్మరించకండి;