కంటెంట్‌కు వెళ్లండి

Prayer గురించి బైబిల్ వచనాలు

720 వచనాలు · 120 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా, మీ ప్రేమలోని మంచితనంతో నాకు జవాబు ఇవ్వండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి నా వైపు తిరగండి.

  2. వారు చూడకుండ వారి కళ్లకు చీకటి కమ్మును గాక, వారి నడుములు శాశ్వతంగా వంగిపోవును గాక.

  3. మీ ఉగ్రతను వారి మీద కుమ్మరించండి; మీ కోపాగ్ని వారిని తాకనివ్వండి.

  4. నేరం మీద నేరం వారిపై మోపండి; మీ నీతిలో వారిని పాలు పంచుకోనివ్వకండి.

  5. జీవగ్రంథంలో నుండి వారు తుడిచివేయబడుదురు గాక, నీతిమంతుల జాబితాలో వారి నమోదు చేయబడకుండును గాక.

  6. అవసరత ఉన్నవారి మొర యెహోవా వింటారు, బందీగా ఉన్న తన ప్రజలను ఆయన అలక్ష్యం చేయరు.

  7. నా ప్రాణం తీయాలని కోరేవారు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.

  8. నన్ను చూసి, “ఆహా! ఆహా!” అని నాతో అనేవారు సిగ్గుపడి ఆశాభంగం పొందాలి.

  9. కాని నా మట్టుకైతే, నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను; దేవా! నా దగ్గరకు త్వరగా రండి, మీరే నా సహాయం, నా విమోచకుడు; యెహోవా, ఆలస్యం చేయకండి.

  10. నాపై నేరం మోపేవారు సిగ్గుతో నశించుదురు గాక; నాకు హాని చేయాలని కోరేవారు ఎగతాళిచేయబడి అవమానపరచబడుదురు గాక.

  11. నేను వృద్ధుడనై తల నెరసినప్పటికి, నా దేవా, తర్వాత తరానికి మీ శక్తిని, రాబోయే వారందరికి మీ గొప్ప కార్యాలను ప్రకటించే వరకు నన్ను విడిచిపెట్టకండి.

  12. కాని నా మట్టుకైతే, నేను దేవునికి సమీపంగా ఉంటాను. నేను ప్రభువైన యెహోవాను ఆశ్రయంగా చేసుకున్నాను; మీ క్రియలన్నిటిని గురించి నేను ప్రకటిస్తాను.

  13. దేవా, ఎంతకాలం శత్రువు మిమ్మల్ని వెక్కిరిస్తాడు? శత్రువు శాశ్వతంగా మీ పేరును దూషిస్తాడా?

  14. మీరు ఎందుకు మీ కుడిచేతిని వెనక్కి తీసుకున్నారు? జీవబల ప్రభావాలను ఎందుకు ఉపసంహరించుకున్నారు? పిడికిలి బిగించి, చేయి చాచి వారిని దెబ్బకొట్టు. నాశనం చేయి!

  15. దేవా! ఈ శత్రువులు నిన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారో చూడు. ఓ యెహోవా దేవా! ఈ మూర్ఖపు జనం మీ నామాన్ని దూషించారు జ్ఞాపకం తెచ్చుకోండి.

  16. మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, దేశమంతా చీకటితో నిండి ఉంది. క్రూరులతో నిండి ఉంది.

  17. నలిగినవారిని మరల అపకీర్తి పాలు కానివ్వకండి. బీదలు అవసరతలో ఉన్న ఈ ప్రజలు మీ నామం స్తుతించుదురు గాక.

  18. దేవా, లేచి, మీ కారణాన్ని సమర్థించండి; బుద్ధిహీనులు రోజంతా మిమ్మల్ని ఎగతాళి చేసేది జ్ఞాపకముంచుకోండి.

  19. మీ విరోధుల గొడవను, నిరంతరం పెరిగే మీ శత్రువుల గందరగోళాన్ని విస్మరించవద్దు.

  20. సంగీత దర్శకుడైన యెదూతూనుకు. ఒక ఆసాపు కీర్తన. నేను సహాయం కోసం దేవునికి మొరపెట్టాను; ఆయన వింటాడని నేను దేవునికి మొరపెట్టాను.

  21. నేను బాధలో ఉన్నప్పుడు నేను ప్రభువును ఆశ్రయించాను; అలసిపోకుండా రాత్రంతా నేను చేతులు చాచాను, నాకు ఆదరణ కలుగలేదు.

  22. “వారి దేవుడు ఎక్కడ?” అని ఇతర దేశాలు ఎందుకు అనాలి? మీ సేవకుల రక్తానికి మీరు ప్రతీకారం తీర్చుకుంటారని మా కళ్ళెదుట ఇతర దేశాల వారికి తెలియజేయండి.

  23. ఖైదీల నిట్టూర్పులు మీ ఎదుటకు వచ్చును గాక; మీ బలమైన చేతితో మరణశిక్ష విధించబడిన వారిని కాపాడండి.

  24. ప్రభువా, మా పొరుగువారు మీమీద చూపిన ధిక్కారణకు ప్రతిగా వారి ఒడిలోకి ఏడంతలు తిరిగి చెల్లించండి.

  25. సైన్యాల యెహోవా దేవా, ఎంతకాలం మీ ప్రజల ప్రార్థనలకు వ్యతిరేకంగా మీ కోపం మండుతుంది?