Skip to content

Prayer గురించి బైబిల్ వచనాలు

720 వచనాలు · 120 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆ రోజు చీకటి అగును గాక; పైనున్న దేవుడు దాన్ని లెక్కచేయకుండును గాక; దాని మీద వెలుగు ప్రకాశించకూడదు.

  2. చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరకు తీసుకొనును గాక; మేఘం దాన్ని కమ్మును గాక; పగటిని కమ్మే అంధకారం దాన్ని భయపెట్టును గాక.

  3. కటిక చీకటి ఆ రాత్రిని పట్టుకొనును గాక; సంవత్సరపు రోజుల్లో ఒకరోజుగా అది లెక్కించబడకపోవును గాక, ఏ నెలలోను అది చేర్చబడకపోవును గాక.

  4. ఆ రాత్రి గొడ్రాలిగా ఉండును గాక; దానిలో సంతోష ధ్వని వినిపించకపోవును గాక.

  5. రోజులను శపించేవారు, లెవియాథన్ రెచ్చగొట్టే అనుభవం గలవారు ఆ రోజును శపించుదురు గాక.

  6. దాని అరుణోదయ నక్షత్రాలు చీకటిమయం అగును గాక; వెలుగు కోసం అది ఎదురుచూడడం వృధా అవ్వాలి, ఉదయ కిరణాలు దానికి కనపడకూడదు.

  7. ఎందుకంటే అది నా కళ్ళ నుండి బాధను దాచిపెట్టడానికి నా తల్లి గర్భద్వారాలను మూయలేదు.

  8. మనుష్యులను గమనించేవాడా, నేను పాపం చేస్తే, మీకు నేను ఏమి చేశాను? మీరెందుకు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు? మీకు నేనే భారమైపోయానా?

  9. కాని నీవు జాగ్రత్తగా దేవుని వెదికితే, సర్వశక్తిమంతుడైన దేవుని వేడుకుంటే,

  10. నీవు పవిత్రంగా యథార్థంగా ఉంటే, ఇప్పుడే ఆయన నీ పక్షాన లేస్తారు, నీ సంపన్న స్థితిని తిరిగి ఇస్తారు.

  11. “నీవు నీ హృదయాన్ని సమర్పించుకొని, నీ చేతులు ఆయన వైపు చాపితే,

  12. నేను దేవునికి ప్రార్థించగా ఆయన సమాధానం ఇచ్చినప్పటికీ, నా స్నేహితుల ముందు నేను నవ్వులపాలయ్యాను, నీతిగా నిందారహితంగా ఉన్న నేను నవ్వులపాలయ్యాను.

  13. మేము ఆయనను సేవించడానికి సర్వశక్తిమంతుడు ఎవరు? మేము ఆయనకు ప్రార్థిస్తే మాకే లాభం కలుగుతుంది?’ అంటారు.

  14. నీవు ఆయనకు ప్రార్థన చేస్తావు, ఆయన నీ మనవి వింటారు, నీవు నీ మ్రొక్కుబడులను చెల్లిస్తావు.

  15. “నా శత్రువు దుష్టునిలా, నా విరోధి అన్యాయస్థునిలా ఉండును గాక!

  16. అప్పుడు వారు దేవునికి ప్రార్థించి ఆయన దయను పొందవచ్చు, వారు దేవుని ముఖం చూసి ఆనందంతో కేకలు వేస్తారు; ఆయన వారి నీతిని వారికి తిరిగి ఇస్తారు.

  17. బీదలు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టేలా వారు చేశారు; అవసరతలో ఉన్న వారి మొరను ఆయన ఆలకిస్తారు.

  18. “నేను అయోగ్యుడను, మీకెలా జవాబు చెప్పగలను? నా చేతితో నా నోరు మూసుకుంటాను.

  19. ఒకసారి మాట్లాడాను, కాని నా దగ్గర జవాబు లేదు; రెండు సార్లు, ఇక నేను ఏమి చెప్పను.”

  20. నేను యెహోవాకు మొరపెడతాను, ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తారు. సెలా

  21. సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. నీతిమంతుడవైన నా దేవా, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు నాకు జవాబు ఇవ్వండి. నా బాధ నుండి నాకు ఉపశమనం ఇవ్వండి; నాపై దయచూపి నా ప్రార్థన వినండి.

  22. సంగీత దర్శకునికి. పిల్లన గ్రోవులతో పాడదగినది.దావీదు కీర్తన. యెహోవా, నా మాటలు ఆలకించండి, నా నిట్టూర్పు గురించి ఆలోచించండి.

  23. నా రాజా నా దేవా, సాయం కోసం నేను చేసే మొరను వినండి, మీకే నేను ప్రార్థిస్తున్నాను.

  24. యెహోవా, ఉదయాన మీరు నా స్వరం వింటారు; ఉదయాన నేను నా మనవులు మీ ముందుంచి ఆశతో వేచి ఉంటాను.

  25. ఓ దేవా! వారిని దోషులుగా ప్రకటించండి, వారి పన్నాగాలే వారి పతనానికి కారణం అవ్వాలి. వారు చేసిన అనేక పాపాలను బట్టి వారిని వెళ్లగొట్టండి, వారు మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.