కంటెంట్‌కు వెళ్లండి

Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు

759 వచనాలు · 177 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మోషే సమావేశ గుడారంలో ఉత్తరం వైపున తెర బయట బల్లను ఉంచి,

  2. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దానిపైన రొట్టెను పెట్టాడు.

  3. అతడు సమావేశ గుడారంలో బల్లకు ఎదురుగా సమావేశ గుడారానికి దక్షిణ వైపు దీపస్తంభాన్ని ఉంచి,

  4. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దీపాలు వెలిగించాడు.

  5. మోషే సమావేశ గుడారంలో తెర ఎదుట బంగారు ధూపవేదిక ఉంచి,

  6. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, పరిమళ వాసనగల ధూపాన్ని దాని మీద కాల్చాడు.

  7. తర్వాత అతడు సమావేశ గుడారపు ప్రవేశ ద్వారానికి తెర వేశాడు.

  8. సమావేశ గుడారపు ద్వారానికి సమీపంగా దహనబలిపీఠాన్ని ఉంచి దాని మీద దహనబలి అర్పించి భోజనార్పణను సమర్పించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే ఇది చేశాడు.

  9. సమావేశ గుడారానికి బలిపీఠానికి మధ్యలో గంగాళాన్ని ఉంచి, కడుక్కోడానికి దానిలో నీళ్లు పోశాడు.

  10. మోషే అహరోను అతని కుమారులు తమ చేతులు కాళ్లు కడుక్కోడానికి దీనిని ఉపయోగించారు.

  11. వారు సమావేశ గుడారం లోనికి వెళ్లినప్పుడు బలిపీఠాన్ని సమీపించినప్పుడు కడుక్కునేవారు; యెహోవా మోషే ఆజ్ఞాపించిన ప్రకారం మోషే ఇది చేశాడు.

  12. తర్వాత మోషే సమావేశ గుడారానికి బలిపీఠానికి చుట్టూ ఆవరణాన్ని ఏర్పాటు చేసి ఆవరణ ద్వారానికి తెర వేశాడు. ఇలా మోషే పని ముగించాడు.

  13. అప్పుడు సమావేశ గుడారాన్ని మేఘం కమ్మింది, యెహోవా మహిమతో సమావేశ గుడారం నిండింది.

  14. ఆ మేఘం దాని మీద నిలిచి ఉండడం వల్ల, యెహోవా మహిమ సమావేశ గుడారాన్ని నింపివేసేది, కాబట్టి మోషే సమావేశ గుడారం లోనికి ప్రవేశించలేకపోయాడు.

  15. ఇశ్రాయేలీయుల ప్రయాణాలన్నిటిలో, సమావేశ గుడారం మీద నుండి మేఘం పైకి వెళ్లినప్పుడు వారు బయలుదేరేవారు.

  16. ఒకవేళ మేఘం పైకి వెళ్లకపోతే, అది పైకి వెళ్లేవరకు బయలుదేరేవారు కారు.

  17. ఇశ్రాయేలీయుల ప్రయాణాలన్నిటిలో ఇశ్రాయేలీయులంతా చూస్తూ ఉండగా పగటివేళ యెహోవా మేఘం సమావేశ గుడారం మీద ఉండేది, రాత్రివేళ ఆ మేఘంలో అగ్ని ఉండేది.

  18. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి రోజు సీనాయి ఎడారిలో ఉన్న సమావేశ గుడారంలో యెహోవా మోషేతో మాట్లాడారు. ఆయన ఇలా అన్నారు:

  19. మొత్తం సమాజంలోని ఇశ్రాయేలీయుల వంశాలు కుటుంబాల ప్రకారం వారి జనాభా లెక్కలు నమోదు చేయి.

  20. నీవూ అహరోను కలిసి ఇశ్రాయేలీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు గలవారు, సైన్యంలో సేవ చేయగలవారిని వారి వారి సేనల ప్రకారం లెక్కించాలి.

  21. ప్రతీ గోత్రం నుండి ఒకడు తన కుటుంబానికి పెద్దగా ఉన్న ప్రతీ ఒకడు మీకు సహాయం చేయాలి.

  22. “మీకు సహాయం చేయాల్సిన పురుషుల పేర్లు ఇవి: “రూబేను గోత్రం నుండి షెదేయూరు కుమారుడైన ఎలీసూరు;

  23. షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు;

  24. యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను;

  25. ఇశ్శాఖారు గోత్రం నుండి సూయరు కుమారుడైన నెతనేలు;