కంటెంట్‌కు వెళ్లండి

Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు

759 వచనాలు · 177 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మనష్షే సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.

  2. మనష్షే గోత్రం నుండి లెక్కించబడినవారు 32,200.

  3. బెన్యామీను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.

  4. బెన్యామీను గోత్రం నుండి లెక్కించబడినవారు 35,400.

  5. దాను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.

  6. దాను గోత్రం నుండి లెక్కించబడినవారు 62,700.

  7. ఆషేరు సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.

  8. ఆషేరు గోత్రం నుండి లెక్కించబడినవారు 41,500.

  9. నఫ్తాలి సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.

  10. నఫ్తాలి గోత్రం నుండి లెక్కించబడినవారు 53,400.

  11. వీరంతా ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల నాయకులతో కలిసి మోషే అహరోనులచేత లెక్కించబడినవారు.

  12. ఇశ్రాయేలీయులందరిలో ఇరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సుండి ఇశ్రాయేలు సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

  13. వీరి మొత్తం సంఖ్య 6,03,550.

  14. యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు:

  15. “ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం చుట్టూ దానికి కొంత దూరంలో, వారిలో ప్రతి ఒక్కరు తమ తమ స్థలంలో తమ గోత్రపు జెండాలను పట్టుకుని శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలి.”

  16. తూర్పున, సూర్యుడు ఉదయించే వైపు: యూదా శిబిరానికి చెందిన దళాలవారు తమ జెండాల దగ్గర దిగాలి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా ప్రజల నాయకుడు.

  17. అతని దళంలో ఉన్నవారు 74,600.

  18. వారి ప్రక్కన ఇశ్శాఖారు గోత్రం వారు దిగాలి. సూయరు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు ప్రజల నాయకుడు.

  19. అతని దళంలో ఉన్నవారు 54,400.

  20. వారి ప్రక్కన జెబూలూను గోత్రము. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూను ప్రజల నాయకుడు.

  21. అతని విభజనలో ఉన్నవారు 57,400.

  22. యూదా శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన పురుషులందరు, 1,86,400. వారు ముందుగా వెళ్తారు.

  23. దక్షిణం వైపు: రూబేను గోత్రం వారు వారి జెండా క్రింద ఉండాలి. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను ప్రజల నాయకుడు.

  24. అతని దళంలో ఉన్నవారు 46,500.

  25. వారి ప్రక్కన షిమ్యోను గోత్రం వారు దిగాలి. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను ప్రజల నాయకుడు.