- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యెషయా 9:1సుమారు క్రీ.పూ. 740
అయినప్పటికీ బాధలో ఉన్నవారికి ఇక చీకటి ఉండదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలను అవమానపరిచారు కాని రాబోయే కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని అనగా యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతాన్ని ఘనపరుస్తారు.
- యెషయా 9:2సుమారు క్రీ.పూ. 740
చీకటిలో జీవిస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు; చిమ్మచీకటిగల దేశంలో నివసించేవారి మీద ఒక వెలుగు ప్రకాశించింది.
- యెషయా 9:3సుమారు క్రీ.పూ. 740
మీరు దేశాన్ని విస్తరింపజేశారు వారి సంతోషాన్ని అధికం చేశారు; కోతకాలంలో ప్రజలు సంతోషించినట్లు దోపుడుసొమ్ము పంచుకుంటున్నప్పుడు యుద్ధవీరులు సంతోషించినట్లు వారు మీ ఎదుట సంతోషిస్తున్నారు.
- యెషయా 9:4సుమారు క్రీ.పూ. 740
మిద్యాను ఓడిపోయిన రోజు జరిగినట్లు, వారికి భారం కలిగించే కాడిని వారి భుజాలమీద ఉన్న కర్రను, వారిని హింసించేవాని కర్రను మీరు విరిచివేశారు.
- యెషయా 9:5సుమారు క్రీ.పూ. 740
యుద్ధంలో వాడిన వీరుల చెప్పులు రక్తంలో చుట్టబడిన బట్టలు మంటలో వేయబడతాయి అగ్నికి ఇంధనంగా అవుతాయి.
- యెషయా 9:6సుమారు క్రీ.పూ. 740
ఎందుకంటే మన కోసం ఒక శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన అద్భుతమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి, సమాధానాధిపతి అని పిలువబడతాడు.
- యెషయా 9:7సుమారు క్రీ.పూ. 740
ఆయన ప్రభుత్వానికి, సమాధానానికి గొప్పతనానికి ముగింపు ఉండదు. ఆయన అప్పటినుండి ఎల్లకాలం వరకు దావీదు సింహాసనం మీద, అతని రాజ్యాన్ని ఏలుతూ, న్యాయంతోను నీతితోను రాజ్యాన్ని స్థాపించి స్థిరంగా ఉంచుతారు. సైన్యాలకు అధిపతియైన యెహోవా ఆసక్తి దీనిని నెరవేరుస్తుంది.
- యెషయా 9:8సుమారు క్రీ.పూ. 740
ప్రభువు యాకోబుకు వ్యతిరేకంగా ఒక సందేశం పంపారు; అది ఇశ్రాయేలు మీద పడుతుంది.
- యెషయా 9:9సుమారు క్రీ.పూ. 740
గర్వం, అహంకారంతో నిండిన హృదయం కలిగిన ప్రజలందరు అనగా ఎఫ్రాయిం, సమరయ వాసులు దానిని తెలుసుకుంటారు.
- యెషయా 9:10సుమారు క్రీ.పూ. 740
“ఇటుకలు పడిపోయాయి, కాని మనం చెక్కిన రాళ్లతో మళ్ళీ కడదాము; రావి చెట్లు నరకబడ్డాయి, వాటికి బదులుగా దేవదారులను వేద్దాం” అని అంటారు.
- యెషయా 9:11సుమారు క్రీ.పూ. 740
అయితే యెహోవా వారి మీదికి రెజీను విరోధులను లేపారు వారి శత్రువులను పురికొల్పారు.
- యెషయా 9:12సుమారు క్రీ.పూ. 740
తూర్పు నుండి అరామీయులు, పడమర నుండి ఫిలిష్తీయులు నోరు తెరచి ఇశ్రాయేలును మ్రింగివేశారు. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
- యెషయా 9:13సుమారు క్రీ.పూ. 740
అయితే ప్రజలు తమను కొట్టినవాడి వైపు తిరుగలేదు, సైన్యాల యెహోవాను వారు వెదకలేదు.
- యెషయా 9:14సుమారు క్రీ.పూ. 740
కాబట్టి యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, తాటికొమ్మను, జమ్ము రెల్లును ఒకేరోజున తొలగిస్తారు.
- యెషయా 9:15సుమారు క్రీ.పూ. 740
పెద్దలు ప్రముఖులు తల అయితే, అబద్ధాలు చెప్పే ప్రవక్తలు తోక.
- యెషయా 9:16సుమారు క్రీ.పూ. 740
ఈ ప్రజలను నడిపించేవారు వారిని తప్పుదారి పట్టిస్తారు; వారిని వెంబడించేవారు చెదిరిపోతారు.
- యెషయా 9:17సుమారు క్రీ.పూ. 740
కాబట్టి ప్రభువు యువకులను చూసి సంతోషించరు తండ్రిలేనివారి పట్ల, విధవరాండ్ర పట్ల జాలి చూపరు. ఎందుకంటే, ప్రతి ఒక్కరు భక్తిహీనులుగా దుర్మార్గులుగా ఉన్నారు, ప్రతి నోరు మూర్ఖంగా మాట్లాడుతుంది. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
- యెషయా 9:18సుమారు క్రీ.పూ. 740
ఖచ్చితంగా దుష్టత్వం అగ్నిలా మండుతుంది అది గచ్చపొదలను, ముళ్ళచెట్లను కాల్చివేస్తుంది; అడవి పొదలను దహనం చేసి దట్టమైన పొగలా పైకి లేస్తుంది.
- యెషయా 9:19సుమారు క్రీ.పూ. 740
సైన్యాల యెహోవా ఉగ్రత వలన భూమి కాలిపోతుంది ప్రజలు అగ్నికి ఇంధనం అవుతారు; వారిలో ఒకరిపై మరొకరికి కనికరం ఉండదు.
- యెషయా 9:20సుమారు క్రీ.పూ. 740
కుడి ప్రక్కన దానిని వారు మ్రింగుతారు కాని ఇంకా ఆకలితోనే ఉంటారు. ఎడమ ప్రక్కన దానిని తింటారు కాని తృప్తి పొందరు. వారిలో ప్రతిఒక్కరు తన సంతానం యొక్క మాంసాన్ని తింటారు.
- యెషయా 9:21సుమారు క్రీ.పూ. 740
మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిం మనష్షేను తింటారు. వీరిద్దరు కలిసి యూదా మీద పడతారు. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
- యెషయా 10:1సుమారు క్రీ.పూ. 713
అన్యాయపు చట్టాలు చేసేవారికి, చెడు శాసనాలు చేసేవారికి శ్రమ.
- యెషయా 10:2సుమారు క్రీ.పూ. 713
వారు పేదల హక్కులను హరిస్తారు, నా ప్రజల్లో అణచివేయబడిన వారికి న్యాయం చేరనివ్వరు వారు విధవరాండ్రను తమ దోపుడు సొమ్ముగా చేసుకుంటూ తండ్రిలేనివారిని దోచుకుంటారు.
- యెషయా 10:3సుమారు క్రీ.పూ. 713
తీర్పు తీర్చే రోజున, దూరం నుండి విపత్తు వచ్చినప్పుడు మీరేమి చేస్తారు? సహాయం కోసం ఎవరి దగ్గరకు పరుగెత్తుతారు? మీ సంపదను ఎక్కడ వదిలివేస్తారు?
- యెషయా 10:4సుమారు క్రీ.పూ. 713
బంధించబడిన వారి మధ్య మోకరిల్లడం చనిపోయినవారి మధ్య పడిపోవడం తప్ప మరేమీ మిగలదు. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.