- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యెషయా 10:30సుమారు క్రీ.పూ. 713
గల్లీము కుమార్తె! కేకలు వేయి లాయిషా, విను! అయ్యయ్యో, అనాతోతు!
- యెషయా 10:31సుమారు క్రీ.పూ. 713
మద్మేనా ప్రజలు పారిపోతారు. గెబీము నివాసులు దాక్కుంటారు.
- యెషయా 10:32సుమారు క్రీ.పూ. 713
ఈ రోజే వారు నోబులో దిగుతారు; ఈ రోజే సీయోను కుమారి పర్వతం, యెరూషలేము కొండ వైపు వారు తమ పిడికిలి ఆడిస్తారు.
- యెషయా 10:33సుమారు క్రీ.పూ. 713
చూడండి, ప్రభువు, సైన్యాల అధిపతియైన యెహోవా మహాబలంతో కొమ్మలు నరుకుతారు. ఉన్నతమైన చెట్లు నరకబడతాయి, ఎత్తైనవి పడగొట్టబడతాయి.
- యెషయా 10:34సుమారు క్రీ.పూ. 713
ఆయన అడవి పొదలను గొడ్డలితో నరుకుతారు; బలవంతుని ఎదుట లెబానోను పడిపోతుంది.
- యెషయా 11:1సుమారు క్రీ.పూ. 713
యెష్షయి మొద్దు నుండి చిగురు పుడుతుంది; అతని వేరుల నుండి కొమ్మ ఫలిస్తుంది.
- యెషయా 11:2సుమారు క్రీ.పూ. 713
యెహోవా ఆత్మ జ్ఞానం వివేకం కలిగించే ఆత్మ, ఆలోచనను బలాన్ని ఇచ్చే ఆత్మ, తెలివిని, యెహోవా పట్ల భయం కలిగించే ఆత్మ, అతని మీద ఉంటుంది.
- యెషయా 11:3సుమారు క్రీ.పూ. 713
యెహోవాయందలి భయంతో అతడు సంతోషిస్తాడు. అతడు తన కళ్లతో చూసిన దానిని బట్టి తీర్పు తీర్చడు, తన చెవులతో విన్నదానిని బట్టి నిర్ణయం తీసుకోడు;
- యెషయా 11:4సుమారు క్రీ.పూ. 713
కాని నీతిగా పేదలకు తీర్పు తీరుస్తాడు, భూమిపై ఉన్న పేదల కోసం న్యాయంతో నిర్ణయాలు తీసుకుంటాడు. అతడు తన నోటి దండంతో భూమిని కొడతాడు; తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపుతాడు.
- యెషయా 11:5సుమారు క్రీ.పూ. 713
నీతి అతని నడికట్టుగా ఉంటుంది నమ్మకత్వం అతని తుంటికి నడికట్టుగా ఉంటుంది.
- యెషయా 11:6సుమారు క్రీ.పూ. 713
తోడేలు గొర్రెపిల్లతో నివసిస్తుంది, చిరుతపులి మేకతో పడుకుంటుంది, దూడ, కొదమసింహం, బలిపశువు కలిసి ఉంటాయి; చిన్న పిల్లవాడు వాటిని నడిపిస్తాడు.
- యెషయా 11:7సుమారు క్రీ.పూ. 713
ఆవు ఎలుగుబంటి కలిసి మేస్తాయి, వాటి పిల్లలు ఒక్క చోటే పడుకుంటాయి. ఎద్దు మేసినట్లు సింహం గడ్డిమేస్తుంది.
- యెషయా 11:8సుమారు క్రీ.పూ. 713
పసిపిల్ల నాగుపాము పుట్ట దగ్గర ఆటలాడుతుంది. విషసర్పం పుట్టలో చిన్న బిడ్డ తన చేయి పెడుతుంది.
- యెషయా 11:9సుమారు క్రీ.పూ. 713
నా పరిశుద్ధ పర్వతమంతటా అవి హాని చేయవు, నాశనం చేయవు. నీళ్లు సముద్రాన్ని కప్పినట్లు యెహోవా జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది.
- యెషయా 11:10సుమారు క్రీ.పూ. 713
ఆ రోజున యెష్షయి వేరు జనాంగాలకు ధ్వజంగా నిలుస్తుంది; దేశాలు అతనివైపు వస్తాయి, అతని విశ్రాంతి స్థలం మహిమగలదిగా ఉంటుంది.
- యెషయా 11:11సుమారు క్రీ.పూ. 713
ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు, ఏలాము, బబులోను, హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు.
- యెషయా 11:12సుమారు క్రీ.పూ. 713
దేశాల కోసం ఆయన ఒక జెండా పైకి ఎత్తుతారు చెరగొనిపోబడిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తారు; భూమి నలుదిక్కుల నుండి ఆయన చెదరిపోయిన యూదా ప్రజలను సమకూర్చుతారు.
- యెషయా 11:13సుమారు క్రీ.పూ. 713
ఎఫ్రాయిముకున్న అసూయ పోతుంది, యూదా శత్రువులు నశిస్తారు. ఎఫ్రాయిం యూదాపై అసూయపడదు, యూదా ఎఫ్రాయింతో విరోధంగా ఉండదు.
- యెషయా 11:14సుమారు క్రీ.పూ. 713
వారు పడమటి వైపు ఫిలిష్తీయ వాలుల మీద దూకుతారు; వారు కలిసి తూర్పు ప్రజలను దోచుకుంటారు. వారు ఎదోమును, మోయాబును లోబరచుకుంటారు, అమ్మోనీయులు వారికి లోబడతారు.
- యెషయా 11:15సుమారు క్రీ.పూ. 713
యెహోవా ఈజిప్టు సముద్రపు అగాధాన్ని నాశనం చేస్తారు; తన వేడి గాలితో యూఫ్రటీసు నది మీద తన చేయి ఆడిస్తారు. ఆయన ఏడు కాలువలుగా దానిని చీల్చుతారు చెప్పులు తడువకుండ మనుష్యులు దానిని దాటేలా చేస్తారు.
- యెషయా 11:16సుమారు క్రీ.పూ. 713
ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన రోజున వారికి దారి ఏర్పడినట్లు అష్షూరు నుండి వచ్చే ఆయన ప్రజల్లో మిగిలిన వారికి రాజమార్గం ఉంటుంది.
- యెషయా 12:1సుమారు క్రీ.పూ. 712
ఆ రోజున మీరు ఇలా అంటారు: “యెహోవా, నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మీరు నాపై కోప్పడినా కూడా మీ కోపం చల్లారింది మీరు నన్ను ఆదరించారు.
- యెషయా 12:2సుమారు క్రీ.పూ. 712
నిజంగా దేవుడే నా రక్షణ; నేను భయపడను ఆయనను నమ్ముతాను. యెహోవా యెహోవాయే నా బలం, నా ఆత్మరక్షణ; ఆయనే నా రక్షణ అయ్యారు.”
- యెషయా 12:3సుమారు క్రీ.పూ. 712
మీరు రక్షణ బావులలో నుండి ఆనందంతో నీళ్లు చేదుతారు.
- యెషయా 12:4సుమారు క్రీ.పూ. 712
ఆ రోజున మీరు ఇలా అంటారు: “యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి; దేశాల్లో ఆయన చేసిన కార్యాలను తెలియజేయండి, ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి.