కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 12:5సుమారు క్రీ.పూ. 712

    యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన మహిమగల కార్యాలు చేశారు; లోకమంతటికి ఇది తెలియాలి.

  2. యెషయా 12:6సుమారు క్రీ.పూ. 712

    సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి, ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”

  3. యెషయా 13:1సుమారు క్రీ.పూ. 712

    బబులోను గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన ప్రవచనం:

  4. యెషయా 13:2సుమారు క్రీ.పూ. 712

    చెట్లులేని కొండ శిఖరం మీద జెండా నిలబెట్టండి, కేకలు వేసి వారిని పిలువండి; ప్రజల ప్రధానులను గుమ్మాల్లో చేతులతో సైగ చేయండి.

  5. యెషయా 13:3సుమారు క్రీ.పూ. 712

    నేను యుద్ధానికి ప్రతిష్ఠించిన వారికి ఆజ్ఞ ఇచ్చాను; నా కోపం తీర్చుకోవాలని నా వీరులను పిలిపించాను, నా విజయాన్ని బట్టి సంతోషించేవారిని పిలిపించాను.

  6. యెషయా 13:4సుమారు క్రీ.పూ. 712

    పెద్ద జనసమూహం ఉన్నట్లుగా కొండల్లో వస్తున్న శబ్దం వినండి! దేశాలు ఒక్కటిగా చేరుతునట్లు రాజ్యాల మధ్య అల్లరి శబ్దం వినండి! సైన్యాల యెహోవా యుద్ధానికి సైన్యాన్ని సమకూరుస్తున్నారు.

  7. యెషయా 13:5సుమారు క్రీ.పూ. 712

    దేశాన్ని మొత్తం పాడుచేయడానికి, యెహోవా కోపాన్ని తీర్చే ఆయుధాలుగా, వారు దూరదేశం నుండి, ఆకాశపు అంచుల నుండి వస్తున్నారు.

  8. యెషయా 13:6సుమారు క్రీ.పూ. 712

    యెహోవా దినం దగ్గరలో ఉందని రోదించండి; అది సర్వశక్తుడు దేవుని దగ్గర నుండి వచ్చే నాశనంలా వస్తుంది.

  9. యెషయా 13:7సుమారు క్రీ.పూ. 712

    దీనిని బట్టి, చేతులన్నీ బలహీనపడతాయి, ప్రతి హృదయం భయంతో కరిగిపోతుంది.

  10. యెషయా 13:8సుమారు క్రీ.పూ. 712

    భయం వారిని పట్టుకుంటుంది, వేదన బాధలు వారిని గట్టిగా పట్టుకుంటాయి; స్త్రీ ప్రసవ వేదన పడినట్లు వారు వేదన పడతారు. వారు ఒకరిపట్ల ఒకరు విసుగుతో చూసుకుంటారు, వారి ముఖాలు అగ్నిజ్వాలల్లా ఉంటాయి.

  11. యెషయా 13:9సుమారు క్రీ.పూ. 712

    చూడండి, యెహోవా దినం వస్తుంది. దేశాన్ని పాడుచేయడానికి దానిలో ఉన్న పాపులను పూర్తిగా నాశనం చేయడానికి క్రూరమైన ఉగ్రతతో తీవ్రమైన కోపంతో ఆ రోజు వస్తుంది.

  12. యెషయా 13:10సుమారు క్రీ.పూ. 712

    ఆకాశ నక్షత్రాలు వాటి నక్షత్రరాసులు తమ వెలుగు ఇవ్వవు. ఉదయించే సూర్యుడు చీకటిగా మారుతాడు చంద్రుడు తన వెలుగునివ్వడు.

  13. యెషయా 13:11సుమారు క్రీ.పూ. 712

    దాని చెడుతనం బట్టి లోకాన్ని వారి పాపాన్ని బట్టి దుర్మార్గులను నేను శిక్షిస్తాను. గర్విష్ఠుల అహంకారాన్ని అంతం చేస్తాను. క్రూరుల గర్వాన్ని అణచివేస్తాను.

  14. యెషయా 13:12సుమారు క్రీ.పూ. 712

    నేను మనుష్యులను స్వచ్ఛమైన బంగారం కంటే కొరతగా, ఓఫీరు దేశ బంగారం కంటే అరుదుగా ఉండేలా చేస్తాను.

  15. యెషయా 13:13సుమారు క్రీ.పూ. 712

    సైన్యాల యెహోవా ఉగ్రత కారణంగా ఆయన కోపం రగులుకున్న రోజున ఆకాశం వణికేలా చేస్తాను; భూమి తన స్థానం నుండి తప్పుకునేలా చేస్తాను.

  16. యెషయా 13:14సుమారు క్రీ.పూ. 712

    తరుమబడుతున్న జింకలా, కాపరి లేని గొర్రెలా, వారు తమ సొంత ప్రజల వైపు తిరుగుతారు, వారు తమ స్వదేశాలకు పారిపోతారు.

  17. యెషయా 13:15సుమారు క్రీ.పూ. 712

    పట్టబడిన ప్రతిఒక్కరు కత్తిపోటుకు గురవుతారు; బందీగా పట్టబడిన వారందరు ఖడ్గానికి చస్తారు.

  18. యెషయా 13:16సుమారు క్రీ.పూ. 712

    వారి కళ్లముందే వారి పసిపిల్లలు ముక్కలుగా నలుగ కొట్టబడతారు; వారి ఇల్లు దోచుకోబడతాయి వారి భార్యలు అత్యాచారం చేయబడతారు.

  19. యెషయా 13:17సుమారు క్రీ.పూ. 712

    చూడండి, వారి మీద దాడి చేయడానికి నేను మెదీయ వారిని రేపుతాను. వారు వెండిని లెక్కచేయరు. బంగారం మీద వారికి ఆసక్తి లేదు.

  20. యెషయా 13:18సుమారు క్రీ.పూ. 712

    వారి విల్లులు యవ్వనస్థులను నలగ్గొడతాయి; పసిపిల్లలపై వారు జాలిపడరు. పిల్లలపై వారు దయ చూపరు.

  21. యెషయా 13:19సుమారు క్రీ.పూ. 712

    అప్పుడు రాజ్యాలకు వైభవంగా, బబులోనీయుల గర్వానికి ఘనతకు కారణంగా ఉన్న బబులోనును సొదొమ గొమొర్రాల వలె దేవుడు పడగొడతారు.

  22. యెషయా 13:20సుమారు క్రీ.పూ. 712

    ఇకపై దానిలో ఎవరూ నివసించరు తరతరాలకు దానిలో ఎవరూ కాపురముండరు; అరబీయులు అక్కడ తమ డేరాలు వేసుకోరు, గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ విశ్రాంతి తీసుకోనివ్వరు.

  23. యెషయా 13:21సుమారు క్రీ.పూ. 712

    ఎడారి జీవులు అక్కడ పడుకుంటాయి, వారి ఇళ్ళ నిండ నక్కలు ఉంటాయి; గుడ్లగూబలు అక్కడ నివసిస్తాయి కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి.

  24. యెషయా 13:22సుమారు క్రీ.పూ. 712

    దాని కోటలలో హైనాలు, దాని విలాసవంతమైన భవనాలలో నక్కలు నివసిస్తాయి. దాని కాలం ముగిసిపోతుంది దాని రోజులు పొడిగించబడవు.

  25. యెహోవా యాకోబుపై జాలి చూపుతారు; ఆయన మరలా ఇశ్రాయేలును ఏర్పరచుకొని వారిని వారి స్వదేశంలో స్థిరపరుస్తారు. విదేశీయులు వారిని కలుసుకుంటారు యాకోబు వారసులతో ఏకమై ఉంటారు.