- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యెషయా 7:23సుమారు క్రీ.పూ. 741
ఆ రోజున వెయ్యి వెండి షెకెళ్ళు విలువ కలిగిన వెయ్యి ద్రాక్షతీగెలు ఉన్న ప్రతిచోట గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటాయి.
- యెషయా 7:24సుమారు క్రీ.పూ. 741
ఆ దేశమంతా గచ్చపొదలు ముళ్ళతో నిండి ఉంటుంది కాబట్టి బాణాలు విల్లులు పట్టుకుని వేటగాళ్లు అక్కడికి వెళ్తారు.
- యెషయా 7:25సుమారు క్రీ.పూ. 741
గచ్చపొదలకు, ముళ్ళకు భయపడి పారతో సాగుచేసిన కొండలన్నిటికి మీరు దూరంగా ఉంటారు; ఆ స్థలాలు పశువులు తిరగడానికి, గొర్రెలు త్రొక్కడానికి ఉపయోగపడతాయి.
యెహోవా నాతో ఇలా అన్నారు, “నీవు పెద్ద పలక తీసుకుని దానిపై మహేర్-షాలాల్-హాష్-బజ్ అని సామాన్యమైన అక్షరాలతో వ్రాయి.
నా కోసం నమ్మకమైన సాక్షులుగా ఉండడానికి యాజకుడైన ఊరియాను, యేబెరెక్యా కుమారుడైన జెకర్యాను పిలిచాను.
తర్వాత నేను ప్రవక్త్రితో శయనించగా ఆమె గర్భవతియై కుమారునికి జన్మనిచ్చింది. అప్పుడు యెహోవా, ‘అతనికి మహేర్-షాలాల్-హాష్-బజ్ అని పేరు పెట్టు’ అని నాతో చెప్పారు.
ఆ పిల్లవాడు నాన్న అమ్మ అని పిలువకముందే, అష్షూరు రాజు దమస్కు సంపదని సమరయ దోపుడుసొమ్మును ఎత్తుకుని పోతాడు.”
- యెషయా 8:5సుమారు క్రీ.పూ. 741
యెహోవా నాతో మరలా ఇలా మాట్లాడారు:
- యెషయా 8:6సుమారు క్రీ.పూ. 741
“ఈ ప్రజలు మెల్లగా పారే షిలోహు నీటిని వద్దు అని, రెజీను గురించి, రెమల్యా కుమారుని గురించి సంతోషిస్తున్నారు,
- యెషయా 8:7సుమారు క్రీ.పూ. 741
కాబట్టి ప్రభువు భయంకరమైన యూఫ్రటీసు నది వరద నీటిని అనగా అష్షూరు రాజును, అతని బలగమంతటిని వారి మీదికి రప్పించబోతున్నారు. అవి దాని కాలువలన్నిటి నుండి ఉప్పొంగి దాని ఒడ్డులన్నిటి మీది నుండి ప్రవహిస్తాయి.
- యెషయా 8:8సుమారు క్రీ.పూ. 741
అవి యూదాలోకి వచ్చి పొంగిపొర్లి ప్రవహిస్తూ, గొంతు లోతు వరకు చేరుతాయి. ఇమ్మానుయేలూ, దాని చాచిన రెక్కలు నీ దేశమంతట వ్యాపిస్తాయి.”
- యెషయా 8:9సుమారు క్రీ.పూ. 741
దేశాల్లారా, మీరు ముక్కలై నాశనమైపోతారు! దూర దేశాల్లారా! మీరందరూ వినండి. యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి! అవును, యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి!
- యెషయా 8:10సుమారు క్రీ.పూ. 741
మీరు వ్యూహం రచించండి, అది విఫలమవుతుంది; మీ ప్రణాళికను ప్రతిపాదించండి, అది నిలబడదు, ఎందుకంటే దేవుడు మాతో ఉన్నారు.
- యెషయా 8:11సుమారు క్రీ.పూ. 741
ఈ ప్రజల మార్గాన్ని అనుసరించకూడదని యెహోవా నన్ను హెచ్చరించి నాతో ఖచ్చితంగా చెప్పిన మాట ఇదే:
- యెషయా 8:12సుమారు క్రీ.పూ. 741
“ఈ ప్రజలు కుట్ర అని చెప్పే ప్రతిదాన్ని కుట్ర అనకండి. వారు భయపడే దానికి భయపడకండి. దానికి బెదిరిపోకండి.
- యెషయా 8:13సుమారు క్రీ.పూ. 741
సైన్యాల యెహోవాయే పరిశుద్ధుడని మీరు గుర్తించాలి, ఆయనకే మీరు భయపడాలి, ఆయనకే మీరు భయపడాలి.
- యెషయా 8:14సుమారు క్రీ.పూ. 741
ఆయన పరిశుద్ధ స్థలంగా ఉంటారు; అయితే ఆయన ఇశ్రాయేలుకు, యూదాకు ప్రజలను తడబడేలా చేసే రాయిలా వారిని పడిపోయేలా చేసే బండలా ఉంటారు. ఆయన యెరూషలేము ప్రజలకు బోనుగా, ఉచ్చుగా ఉంటారు.
- యెషయా 8:15సుమారు క్రీ.పూ. 741
వారిలో అనేకమంది తడబడతారు; వారు పడిపోతారు, గాయపరచబడతారు వారు ఉచ్చులో చిక్కుకుని పట్టబడతారు.”
- యెషయా 8:16సుమారు క్రీ.పూ. 741
ఈ హెచ్చరిక సాక్ష్యాన్ని కట్టండి దేవుని బోధను నా శిష్యుల మధ్యలో ముద్రించండి.
- యెషయా 8:17సుమారు క్రీ.పూ. 741
యాకోబు వారసుల నుండి తన ముఖాన్ని దాస్తున్న యెహోవా కోసం నేను ఎదురుచూస్తాను. ఆయనపై నా నమ్మకాన్ని ఉంచుతాను.
- యెషయా 8:18సుమారు క్రీ.పూ. 741
ఇదిగో నేను, యెహోవా నాకిచ్చిన పిల్లలు, సీయోను కొండమీద నివసించే సైన్యాల యెహోవా వలన సూచనలుగా, గుర్తులుగా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.
- యెషయా 8:19సుమారు క్రీ.పూ. 741
మీతో ఎవరైనా, గుసగుసలాడే గొణిగే మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించమని చెప్పినప్పుడు, ప్రజలు తమ దేవుని దగ్గరే విచారించాలి కదా? సజీవుల గురించి చచ్చిన వారిని ఎందుకు సంప్రదించాలి?
- యెషయా 8:20సుమారు క్రీ.పూ. 741
దేవుని బోధను, హెచ్చరిక సాక్ష్యాన్ని దృష్టి నిలపండి. ఈ వాక్యం ప్రకారం మాట్లాడని వారికి ఉదయపు వెలుగు ఉండదు.
- యెషయా 8:21సుమారు క్రీ.పూ. 741
వారు బాధపడుతూ ఆకలితో దేశమంతా తిరుగుతారు; వారు ఆకలితో ఉన్నప్పుడు వారు కోపంతో పైకి చూస్తూ తమ రాజును, తమ దేవుని శపిస్తారు.
- యెషయా 8:22సుమారు క్రీ.పూ. 741
వారు భూమివైపు చూడగా వారికి బాధ, చీకటి, భయంకరమైన దుఃఖం మాత్రమే కనబడతాయి. వారు దట్టమైన చీకటిలోకి త్రోయబడతారు.