- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- దానియేలు 6:6సుమారు క్రీ.పూ. 538
కాబట్టి ఈ నిర్వాహకులు, అధిపతులు గుంపుగా రాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు, “రాజైన దర్యావేషు చిరకాలం జీవించు గాక!
- దానియేలు 6:7సుమారు క్రీ.పూ. 538
రానున్న ముప్పై రోజుల్లో ఎవరైనా మీకు తప్ప ఏ దేవునికైనా, మనిషికైనా ప్రార్థిస్తే వారు సింహాల గుహలో పడవేయబడాలని రాజు ఒక ఆదేశం జారీ చేసి, దానిని అమల్లోకి తీసుకురావాలని రాజ్య నిర్వాహకులు, ప్రముఖులు, అధిపతులు, సలహాదారులు, రాష్ట్ర అధికారులు అందరం ఏకీభవించి కోరుతున్నాము.
- దానియేలు 6:8సుమారు క్రీ.పూ. 538
రాజా! ఈ శాసనాన్ని ఇచ్చి, అది మాదీయుల పర్షియా చట్టం ప్రకారం అది రద్దు కాకుండా, మార్చబడకుండా ఉండేందుకు దానిని వ్రాతపూర్వకంగా ఇవ్వండి.”
- దానియేలు 6:9సుమారు క్రీ.పూ. 538
కాబట్టి రాజైన దర్యావేషు శాసనాన్ని రాయించి, సంతకం చేశాడు.
- దానియేలు 6:10సుమారు క్రీ.పూ. 538
అయితే ఈ శాసనం ఇవ్వబడిందని దానియేలు తెలిసినప్పటికీ అతడు ఇంటికి వెళ్లి యెరూషలేము వైపు తెరచిన కిటికీలు ఉన్న తన పైగదికి వెళ్లాడు. అతడు గతంలో చేసినట్టు, రోజుకు మూడుసార్లు మోకరించి ప్రార్థన చేస్తూ, తన దేవునికి స్తుతులు చెల్లించాడు.
- దానియేలు 6:11సుమారు క్రీ.పూ. 538
అప్పుడు ఈ మనుష్యులు గుంపుగా వెళ్లి, దానియేలు ప్రార్థన చేస్తూ, దేవుని సహాయం కోసం వేడుకోవడం చూశారు.
- దానియేలు 6:12సుమారు క్రీ.పూ. 538
కాబట్టి వారు రాజు దగ్గరకు వెళ్లి, తన రాజ శాసనం గురించి చెప్తూ, “రాజా! వచ్చే ముప్పై రోజుల వరకు మీకు తప్పా ఏ దేవునికి గాని మనిషికి గాని ప్రార్థన గాని చేయకూడదని, అలా చేస్తే వారు సింహాల గుహలో పడవేయబడాలని శాసనం ఇచ్చారు కదా?” అన్నారు. రాజు జవాబిస్తూ, “ఆ శాసనం అమలు చేయబడుతుంది. మాదీయుల పర్షియా వారి చట్టం ప్రకారం అది రద్దు చేయబడదు” అన్నాడు.
- దానియేలు 6:13సుమారు క్రీ.పూ. 538
అప్పుడు వారు రాజుతో అన్నారు, “రాజా! యూదా నుండి వచ్చిన బందీలలో ఒకడైన దానియేలు మిమ్మల్ని కాని మీరు సంతకం చేసిన శాసనాన్ని గాని లెక్క చేయట్లేదు. అతడు ఇంకా మూడుసార్లు ప్రార్థన చేస్తున్నాడు.”
- దానియేలు 6:14సుమారు క్రీ.పూ. 538
ఇది విని రాజు చాల బాధపడ్డాడు; ఎలాగైనా దానియేలును కాపాడాలని, సూర్యాస్తమయం వరకు అతన్ని విడిపించాలని ఎంతో ప్రయత్నించాడు.
- దానియేలు 6:15సుమారు క్రీ.పూ. 538
అప్పుడు ఆ మనుష్యులు రాజైన దర్యావేషు దగ్గరకు గుంపుగా వెళ్లి, “రాజా! మాదీయ పర్షియా వారి చట్టం ప్రకారం రాజు చేసిన శాసనాన్ని గాని తీర్మానాన్ని గాని ఎవరు మార్చకూడదనే విషయాన్ని మీరు గుర్తుచేసుకోవాలి” అన్నారు.
- దానియేలు 6:16సుమారు క్రీ.పూ. 538
అప్పుడు రాజు ఆదేశం ఇవ్వగా, వారు దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలో పడవేశారు. రాజు దానియేలుతో, “నీవు నిత్యం సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని అన్నాడు.
- దానియేలు 6:17సుమారు క్రీ.పూ. 538
ఒక రాయి తీసుకువచ్చి దానితో గుహ ద్వారాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో నిర్ణయాన్ని మార్చుకోకుండ రాజు తన రాజ ముద్రను, ప్రముఖుల ముద్రలను రాతి మీద వేశాడు.
- దానియేలు 6:18సుమారు క్రీ.పూ. 538
తర్వాత రాజు భవనానికి వెళ్లి రాత్రంతా ఉపవాసం ఉండి వినోదాలను జరగనియ్యలేదు. అతనికి నిద్రపట్టలేదు.
- దానియేలు 6:19సుమారు క్రీ.పూ. 538
తెల్లవారే సమయంలో రాజు లేచి, సింహాల గుహ దగ్గరకు త్వరగా వెళ్లాడు.
- దానియేలు 6:20సుమారు క్రీ.పూ. 538
రాజు సింహాల గుహ దగ్గరకు చేరుకుని దుఃఖ స్వరంతో, “దానియేలూ! సజీవ దేవుని సేవకుడా! నిత్యం నీవు సేవించే నీ దేవుడు సింహాల బారి నుండి నిన్ను రక్షించగలిగారా?” అని అన్నాడు.
- దానియేలు 6:21సుమారు క్రీ.పూ. 538
దానియేలు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక!
- దానియేలు 6:22సుమారు క్రీ.పూ. 538
నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్ళు మూయించారు. అవి నాకు హాని చేయలేదు, ఎందుకంటే ఆయన దృష్టిలో నేను నిర్దోషిని. రాజా! మీ ఎదుట కూడా నేను ఏ తప్పు చేయలేదు” అన్నాడు.
- దానియేలు 6:23సుమారు క్రీ.పూ. 538
రాజు ఎంతో సంతోషించి దానియేలును గుహలో నుండి బయటకు తీసుకురమ్మని ఆదేశించాడు. దానియేలు తన దేవున్ని నమ్మాడు కాబట్టి అతడు బయటకు వచ్చినప్పుడు, అతని మీద ఏ గాయం లేదు.
- దానియేలు 6:24సుమారు క్రీ.పూ. 538
రాజు ఆజ్ఞమేరకు, దానియేలు మీద తప్పుడు నేరం మోపిన వ్యక్తులను వారి భార్య పిల్లలతో పాటు సింహాల గుహలో పడవేశారు. వారు ఇంకా గుహ నేలను తాకకముందే సింహాలు వారిని చీల్చి, వారి ఎముకలన్నిటిని నలుగగొట్టాయి.
- దానియేలు 6:25సుమారు క్రీ.పూ. 538
అప్పుడు రాజైన దర్యావేషు భూమిపై ఉన్న దేశాలన్నిటికి, వివిధ భాషల ప్రజలందరికి: “మీరు గొప్పగా వృద్ధి పొందుదురు గాక!
- దానియేలు 6:26సుమారు క్రీ.పూ. 538
“నా రాజ్యంలో ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలంతా దానియేలు దేవునికి భయపడాలి ఆయనను గౌరవించాలని నేను ఆదేశిస్తున్నాను.
- దానియేలు 6:27సుమారు క్రీ.పూ. 538
ఆయన రక్షిస్తారు, కాపాడతారు;
- దానియేలు 6:28సుమారు క్రీ.పూ. 538
కాబట్టి దానియేలు దర్యావేషు రాజు పరిపాలనలోను పర్షియా వాడైన కోరెషు రాజు పరిపాలనలోను వృద్ధి చెందాడు.
- దానియేలు 7:1సుమారు క్రీ.పూ. 555
బబులోను రాజైన బెల్షస్సరు పరిపాలనలోని మొదటి సంవత్సరంలో, దానియేలు తన పడక మీద పడుకుని ఉన్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది, దర్శనాలు తన మనస్సులో కలిగాయి. అతడు తన కలను ఇలా సంక్షిప్తంగా వ్రాశాడు.
- దానియేలు 7:2సుమారు క్రీ.పూ. 555
దానియేలు, “రాత్రివేళ నా దర్శనంలో నేను తేరిచూడగా నా ఎదుట ఆకాశం నాలుగు వైపుల నుండి గాలులు వీచి మహా సముద్రాన్ని కదిలించాయి.