కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దానియేలు 7:28సుమారు క్రీ.పూ. 555

    “ఇది ఆ విషయానికి ముగింపు. దానియేలు అనే నేను నా తలంపులలో ఆందోళన చెందాను, నా ముఖం పాలిపోయింది, కాని నేను ఈ విషయాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను.”

  2. దానియేలు 8:1సుమారు క్రీ.పూ. 553

    రాజైన బెల్షస్సరు పరిపాలనలోని మూడవ సంవత్సరంలో, దానియేలు అనే నాకు ముందు వచ్చిన దర్శనం కాకుండా మరో దర్శనం వచ్చింది.

  3. దానియేలు 8:2సుమారు క్రీ.పూ. 553

    నేను దర్శనం చూస్తూ ఉన్నప్పుడు ఏలాము సామ్రాజ్యంలోని షూషను కోటలో ఉన్న నేను, దర్శనంలో ఊలయి కాలువ దగ్గర ఉన్నట్లు చూశాను.

  4. దానియేలు 8:3సుమారు క్రీ.పూ. 553

    నేను కళ్ళెత్తి చూడగా ఆ కాలువ ప్రక్కన రెండు కొమ్ములున్న ఒక పొట్టేలు ఉంది, ఆ కొమ్ములు పొడువుగా ఉన్నాయి. ఆ కొమ్ములలో ఒకటి రెండవ దానికంటే పొడువుగా ఉంది కాని అది తర్వాత మొలిచింది.

  5. దానియేలు 8:4సుమారు క్రీ.పూ. 553

    నేను చూస్తుండగా ఆ పొట్టేలు పడమర, ఉత్తర, దక్షిణాల వైపు కొమ్ములతో పొడుస్తూ ఉంది. దాని ఎదుట ఏ జంతువు నిలబడలేక పోయింది, దాని శక్తి నుండి ఏది తప్పించుకోలేదు. అది తన ఇష్టానుసారంగా చేస్తూ గొప్పగా అయ్యింది.

  6. దానియేలు 8:5సుమారు క్రీ.పూ. 553

    నేను దాని గురించి ఆలోచిస్తుండగా, అకస్మాత్తుగా పడమటి నుండి కళ్ల మధ్యలో పెద్ద కొమ్ము ఉన్న ఒక మేకపోతు వచ్చి, కాళ్లు నేలను తాకించకుండా భూమంతా పరుగు పెట్టింది.

  7. దానియేలు 8:6సుమారు క్రీ.పూ. 553

    ఆ మేకపోతు కాలువ ఒడ్డున నేను చూసిన రెండు కొమ్ముల పొట్టేలు వైపు వచ్చి తీవ్రమైన కోపంతో బలంగా దానివైపు పరుగెత్తింది.

  8. దానియేలు 8:7సుమారు క్రీ.పూ. 553

    అది పొట్టేలుపై ఆవేశంగా దాడి చేసి, దాని రెండు కొమ్ములను విరగ్గొట్టింది. దాని ఎదుట పొట్టేలు నిలువలేకపోయింది; మేకపోతు దాన్ని క్రింద పడేసి త్రొక్కేసింది, దాని శక్తి నుండి పొట్టేలును ఎవరూ రక్షించలేకపోయారు.

  9. దానియేలు 8:8సుమారు క్రీ.పూ. 553

    మేకపోతు ఎంతో గొప్పగా అయ్యింది, కాని దాని అధికారం ఉన్నత స్థితిలో ఉండగా, దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది, దాని స్థానంలో నాలుగు పెద్ద కొమ్ములు పైకి వచ్చి ఆకాశం నాలుగు వైపులకు పెరిగాయి.

  10. దానియేలు 8:9సుమారు క్రీ.పూ. 553

    వాటిలో ఒకదాని నుండి మరో కొమ్ము వచ్చింది, అది చిన్నగా ప్రారంభమై దక్షిణం, తూర్పుకు, సుందరమైన దేశం వైపు బలంతో వ్యాపించింది.

  11. దానియేలు 8:10సుమారు క్రీ.పూ. 553

    అది ఆకాశ సమూహాన్ని చేరేవరకు పెరిగి కొన్ని నక్షత్ర సమూహాలను భూమిపై పడేసి, వాటిని త్రొక్కింది.

  12. దానియేలు 8:11సుమారు క్రీ.పూ. 553

    యెహోవా సైన్యం యొక్క అధిపతికి సమానంగా తనను తాను హెచ్చించుకుంది; యెహోవా నుండి అనుదిన అర్పణలను నిలిపివేసింది, ఆయన పరిశుద్ధాలయాన్ని పడద్రోసింది.

  13. దానియేలు 8:12సుమారు క్రీ.పూ. 553

    దాని తిరుగుబాటును బట్టి, యెహోవా ప్రజలు, అనుదిన అర్పణలు దానికి ఇవ్వబడ్డాయి. అది సత్యాన్ని నేలపాలు చేసి ఇష్టం వచ్చినట్లు చేస్తూ వర్థిల్లింది.

  14. దానియేలు 8:13సుమారు క్రీ.పూ. 553

    అప్పుడు ఒక పరిశుద్ధుడు మాట్లాడడం నేను చూశాను, మరో పరిశుద్ధుడు అతనితో, “అనుదిన అర్పణలు, నాశనానికి కారణమైన తిరుగుబాటు, పరిశుద్ధాలయాన్ని లోబరచుకోవడం, యెహోవా ప్రజలు పాదాల క్రింద త్రొక్కబడుతున్న ఈ దర్శనం నెరవేరడానికి ఎంతకాలం పడుతుంది?” అన్నాడు.

  15. దానియేలు 8:14సుమారు క్రీ.పూ. 553

    అతడు నాతో, “దానికి 2,300 ఉదయ సాయంత్రాలు పడుతుంది; తర్వాత పరిశుద్ధాలయం తిరిగి పవిత్రపరచబడుతుంది.”

  16. దానియేలు 8:15సుమారు క్రీ.పూ. 553

    దానియేలు అనే నేను ఆ దర్శనం చూసి దానిని గ్రహించుకునే ప్రయత్నం చేస్తుండగా, నా ఎదుట మనిషిలా ఉన్న ఒకడు నిలబడ్డాడు.

  17. దానియేలు 8:16సుమారు క్రీ.పూ. 553

    అప్పుడు ఊలయి కాలువ నుండి, “గబ్రియేలూ, ఆ దర్శనాన్ని గ్రహించేలా ఈ మనుష్యునికి చెప్పు” అని అంటూ ఒక స్వరం అనడం విన్నాను.

  18. దానియేలు 8:17సుమారు క్రీ.పూ. 553

    అతడు నేను నిలుచున్న చోటికి రాగానే, నేను భయపడి సాగిలపడ్డాను. “మనుష్యకుమారుడా, అంత్యకాలం గురించిన దర్శనాన్ని గ్రహించు” అని అతడు నాతో అన్నాడు.

  19. దానియేలు 8:18సుమారు క్రీ.పూ. 553

    అతడు నాతో మాట్లాడుతున్నప్పుడు, నేను గాఢనిద్రలో నేల మీద సాష్టాంగపడ్డాను. అప్పుడు అతడు నన్ను ముట్టి నన్ను నిలబెట్టాడు.

  20. దానియేలు 8:19సుమారు క్రీ.పూ. 553

    అతడు అన్నాడు: “ఉగ్రత కాలంలో ఏం జరగబోతుందో నీకు చెప్పబోతున్నాను, ఎందుకంటే, దర్శనం నిర్ణీతమైన అంత్య కాలానికి సంబంధించింది.

  21. దానియేలు 8:20సుమారు క్రీ.పూ. 553

    నీవు చూసిన రెండు కొమ్ముల పొట్టేలు మెదీయ, పర్షియా రాజులను సూచిస్తుంది.

  22. దానియేలు 8:21సుమారు క్రీ.పూ. 553

    బొచ్చుగల మేకపోతు గ్రీసు దేశపు రాజును, దాని కళ్ల మధ్య ఉన్న పెద్ద కొమ్ము దాని మొదటి రాజును సూచిస్తుంది.

  23. దానియేలు 8:22సుమారు క్రీ.పూ. 553

    ఆ కొమ్ము స్థానంలో వచ్చిన నాలుగు కొమ్ములు అతని దేశం నుండి లేచే నాలుగు రాజ్యాలను సూచిస్తుంది, కాని వాటికి మొదటి రాజుకు ఉన్నంత బలం ఉండదు.

  24. దానియేలు 8:23సుమారు క్రీ.పూ. 553

    “వారి పరిపాలనలోని చివరి భాగంలో, తిరుగుబాటుదారులు పూర్తిగా దుష్టులైనప్పుడు, భయంకరంగా కనిపించే రాజు, కుట్రలో ఆరితేరినవాడు లేస్తాడు.

  25. దానియేలు 8:24సుమారు క్రీ.పూ. 553

    అతడు ఎంతో బలవంతుడవుతాడు, కాని తన సొంత శక్తి ద్వారా కాదు. అతడు స్తంభింపజేసే విధ్వంసాలు చేస్తాడు, అతడు చేసే ప్రతీ దాంట్లో జయం పొందుతాడు.అతడు బలాఢ్యులను, పరిశుద్ధులను నాశనం చేస్తాడు.