- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- దానియేలు 9:23సుమారు క్రీ.పూ. 538
నీవు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన వెంటనే, ఒక మాట బయటకు వెళ్లింది, అది నేను నీతో చెప్పాలని వచ్చాను, ఎందుకంటే నీవు ఎంతో విలువగలవాడివి. కాబట్టి, వాక్కును పరిగణించి, దర్శనాన్ని గ్రహించు:
- దానియేలు 9:24సుమారు క్రీ.పూ. 538
“దోషం ముగించడానికి, పాపం తుదముట్టించడానికి, దుష్టత్వానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, శాశ్వత నీతిని చేకూర్చడానికి, దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి, నీ ప్రజలకు, నీ పరిశుద్ధ పట్టణానికి డెబ్బై ‘ఏడులు’ నిర్ణయించబడ్డాయి.
- దానియేలు 9:25సుమారు క్రీ.పూ. 538
“దీనిని తెలుసుకొని, గ్రహించు: యెరూషలేము పునరుద్ధరణ, పునర్నిర్మాణం కోసం ఆజ్ఞ ఇయ్యబడింది మొదలుకొని, అభిషిక్తుడైన అధిపతి వచ్చేవరకు ఏడు ‘వారాలు,’ అరవై రెండు ‘వారాలు’ పడుతుంది. అయితే కష్టకాలంలో యెరూషలేము నడి వీధులతో, కాలువతో పునర్నిర్మించబడుతుంది.
- దానియేలు 9:26సుమారు క్రీ.పూ. 538
అరవై రెండు ‘సంవత్సరాల’ తర్వాత అభిషిక్తుడు హతం చేయబడతాడు, ఆయన స్వాధీనంలో ఏమీ ఉండదు. ఆ తర్వాత వచ్చే పరిపాలకుని ప్రజలు పట్టణాన్ని, పరిశుద్ధాలయాన్ని నాశనం చేస్తారు. అంతం వరదలా వస్తుంది: యుద్ధం అంతం వరకు కొనసాగుతుంది, వినాశనం జరగాలని నిర్ణయంచబడింది.
- దానియేలు 9:27సుమారు క్రీ.పూ. 538
ఆ పరిపాలకుడు ఒక ‘ఏడు’ కోసం చాలా మందితో నిబంధన నెలకొల్పుతాడు. అయితే ఆ ‘ఏడు’ సగం గడిచాక, బలిని, నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అతని మీద శాసించబడిన అంతం కుమ్మరించబడేవరకు, మందిరం దగ్గర వినాశనం కలిగించే హేయమైన దానిని నిలుపుతాడు.”
- దానియేలు 10:1సుమారు క్రీ.పూ. 534
పర్షియా రాజైన కోరెషు పరిపాలన యొక్క మూడవ సంవత్సరంలో, దానియేలుకు (బెల్తెషాజరు అని పిలువబడేవాడు) ఒక ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆ ప్రత్యక్షత యొక్క సందేశం నిజం, అది మహా యుద్ధం గురించిన విషయము. అతనికి ఆ వార్త యొక్క గ్రహింపు దర్శనంలో వచ్చింది.
- దానియేలు 10:2సుమారు క్రీ.పూ. 534
ఆ సమయంలో దానియేలు అనే నేను మూడు వారాలు విలపిస్తూ ఉన్నాను.
- దానియేలు 10:3సుమారు క్రీ.పూ. 534
నేను శ్రేష్ఠమైన ఆహారం తినలేదు; మాంసం కాని, ద్రాక్షరసం కాని నా పెదవులను తాకలేదు; మూడు వారాలు గడిచేవరకు సువాసనగల నూనె రాసుకోలేదు.
- దానియేలు 10:4సుమారు క్రీ.పూ. 534
మొదటి నెల ఇరవై నాలుగవ రోజున నేను మహా నది టైగ్రీసు ఒడ్డున నిలబడి ఉన్నాను,
- దానియేలు 10:5సుమారు క్రీ.పూ. 534
నేను తేరిచూడగా, నా ఎదుట సన్నని నారబట్టలు ధరించి నడుముకు ఊఫజు నుండి తెప్పించబడిన మేలిమి బంగారు నడికట్టు నడుముకు కట్టుకున్న మనిషి కనిపించాడు.
- దానియేలు 10:6సుమారు క్రీ.పూ. 534
అతని శరీరం గోమేధికంలా, అతని ముఖం మెరుపులా, అతని కళ్లు మండే దివిటీలలా, అతని కాళ్లు చేతులు మెరుగుపెట్టిన ఇత్తడిలా తళతళలాడుతూ ఉన్నాయి. అతని కంఠస్వరం గుంపు చేసే ధ్వనిలా ఉంది.
- దానియేలు 10:7సుమారు క్రీ.పూ. 534
దానియేలు అనే మాత్రమే ఆ దర్శనాన్ని చూసింది; నాతో ఉన్నవారు దానిని చూడలేదు, కాని వారు ఎంతో భయాబ్రాంతులై పారిపోయి దాక్కున్నారు.
- దానియేలు 10:8సుమారు క్రీ.పూ. 534
కాబట్టి నేనొక్కడినే ఈ గొప్ప దర్శనాన్ని చూస్తూ ఉండిపోయాను, ఈ గొప్ప దర్శనం చూశాను; నాలో బలం ఏమి లేదు, నా ముఖం ఎంతో పాలిపోయింది, నేను పూర్తిగా నీరసించిపోయాను.
- దానియేలు 10:9సుమారు క్రీ.పూ. 534
అప్పుడు అతడు మాట్లాడడం నేను విన్నాను, నేను వింటూ ఉండగా, సాష్టాంగపడి గాఢ నిద్రలోకి వెళ్లాను.
- దానియేలు 10:10సుమారు క్రీ.పూ. 534
ఒక చేయి నన్ను తాకి వణుకుతున్న నా మోకాళ్లు, అరచేతుల మీద నిలబెట్టింది.
- దానియేలు 10:11సుమారు క్రీ.పూ. 534
అతడు, “దానియేలూ! నీవు ఎంతో విలువైనవాడవు, నేను నీతో మాట్లాడే మాటలు శ్రద్ధగా ఆలోచించి, లేచి నిలబడు, ఎందుకంటే నేను నీ దగ్గరకు పంపబడ్డాను” అన్నాడు. అతడు ఇది చెప్పిన తర్వాత, నేను వణకుతూ లేచి నిలబడ్డాను.
- దానియేలు 10:12సుమారు క్రీ.పూ. 534
అప్పుడతడు అన్నాడు, “దానియేలూ, భయపడకు. నీవు గ్రహింపు కోసం నీ మనస్సును సిద్ధపరచుకుని, నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకున్న మొదటి రోజు నుండే నీ ప్రార్థనలు ఆలకించబడ్డాయి, వాటికి జవాబుగా నేను వచ్చాను.
- దానియేలు 10:13సుమారు క్రీ.పూ. 534
అయితే, పర్షియా రాజ్యాధిపతి ఇరవై ఒక రోజులు నన్ను ఎదిరించాడు. నేను పర్షియా రాజు ఎదుట ఉండిపోవలసి వచ్చింది కాబట్టి ప్రముఖ దేవదూతల్లో ఒకడైన మిఖాయేలు నాకు సహాయం చేయడానికి వచ్చాడు.
- దానియేలు 10:14సుమారు క్రీ.పూ. 534
ఇప్పుడు నీ ప్రజలకు భవిష్యత్తులో జరుగబోయే వాటిని నీకు వివరించడానికి వచ్చాను, ఎందుకంటే దర్శనం రాబోయే కాలం గురించి వచ్చింది.”
- దానియేలు 10:15సుమారు క్రీ.పూ. 534
అతడు ఇది నాకు చెప్తుండగా, నేను నా ముఖాన్ని నేల వైపుకు వంచుకొని ఏమి మాట్లాడలేకపోయాను.
- దానియేలు 10:16సుమారు క్రీ.పూ. 534
అప్పుడు మనిషిని పోలిన ఒక వ్యక్తి నా పెదవులు ముట్టాడు, నేను నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాను. నా ఎదుట నిలుచున్న వ్యక్తితో అన్నాను, “నా ప్రభువా! ఈ దర్శనాన్ని బట్టి నేను వేదన చెందాను, నేను ఎంతో బలహీనంగా అయ్యాను.
- దానియేలు 10:17సుమారు క్రీ.పూ. 534
నా ప్రభువా, మీ దాసుడనైన నేను మీతో ఎలా మాట్లాడగలను? నా బలం పోయింది, కష్టంగా ఊపిరి తీసుకుంటున్నాను.”
- దానియేలు 10:18సుమారు క్రీ.పూ. 534
మనిషిని పోలిన ఆ వ్యక్తి మరలా నన్ను తాకి, నన్ను బలపరిచాడు.
- దానియేలు 10:19సుమారు క్రీ.పూ. 534
“నీవు ఎంతో విలువైనవాడవు, భయపడకు, సమాధానం! ఇప్పుడు ధైర్యం తెచ్చుకో! ధైర్యం తెచ్చుకో!” అని అతడు అన్నాడు. అతడు నాతో మాట్లాడినప్పుడు నేను బలపరచబడ్డాను, “నా ప్రభువా, మీరు నాకు బలం కలిగించారు, కాబట్టి మాట్లాడండి” అని అన్నాను.
- దానియేలు 10:20సుమారు క్రీ.పూ. 534
కాబట్టి అతడు అన్నాడు, “నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? త్వరలో నేను పర్షియా రాజ్యాధిపతితో పోరాడడానికి తిరిగి వస్తాను, నేను వెళ్లిన తర్వాత, గ్రీసు అధిపతి వస్తాడు;