కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లేవీయకాండము 11:1సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు,

  2. లేవీయకాండము 11:2సుమారు క్రీ.పూ. 1490

    “ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పండి: ‘భూమి మీద జీవించే జంతువులన్నిటిలో మీరు తినదగిన జంతువులు:

  3. లేవీయకాండము 11:3సుమారు క్రీ.పూ. 1490

    చీలిన డెక్కలు కలిగి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు.

  4. లేవీయకాండము 11:4సుమారు క్రీ.పూ. 1490

    “ ‘కొన్ని కేవలం నెమరువేస్తాయి కొన్ని చీలిన డెక్కలు మాత్రమే కలిగి ఉంటాయి, వాటిని మీరు తినకూడదు. ఒంటెలు నెమరువేస్తాయి కానీ వాటికి చీలిన డెక్కలు లేవు; ఇవి మీకు ఆచారరీత్య అపవిత్రమైనవి.

  5. లేవీయకాండము 11:5సుమారు క్రీ.పూ. 1490

    అలాగే పొట్టి కుందేలు కూడా నెమరువేస్తుంది కాని దానికి చీలిన డెక్కలు లేవు; ఇది మీకు అపవిత్రమైనది.

  6. లేవీయకాండము 11:6సుమారు క్రీ.పూ. 1490

    అలాగే కుందేలు నెమరువేస్తుంది గాని దానికి చీలిన డెక్కలు లేవు; ఇది మీకు అపవిత్రమైనది.

  7. లేవీయకాండము 11:7సుమారు క్రీ.పూ. 1490

    పందికి చీలిన డెక్కలు ఉంటాయి కాని అది నెమరువేయదు; ఇది మీకు అపవిత్రమైనది.

  8. లేవీయకాండము 11:8సుమారు క్రీ.పూ. 1490

    వాటి మాంసం తినవద్దు వాటి కళేబరాలు ముట్టుకోవద్దు; అవి మీకు అపవిత్రమైనవి.

  9. లేవీయకాండము 11:9సుమారు క్రీ.పూ. 1490

    “ ‘సముద్రాల్లో నదులలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు.

  10. లేవీయకాండము 11:10సుమారు క్రీ.పూ. 1490

    సముద్రంలో గాని, నదిలో గాని నీటిలో కదిలే అన్ని రకాల జీవుల్లోను, నీటి ప్రాణుల్లోను రెక్కలు, పొలుసులు లేనివాటిని మీరు అపవిత్రమైనవిగా చూడాలి.

  11. లేవీయకాండము 11:11సుమారు క్రీ.పూ. 1490

    అవి అపవిత్రమైనవి కాబట్టి వాటి మాంసం మీరు తినకూడదు; వాటి కళేబరాలను మీరు అసహ్యించుకోవాలి.

  12. లేవీయకాండము 11:12సుమారు క్రీ.పూ. 1490

    రెక్కలు, పొలుసులు లేని జలచరాలేవైనా అపవిత్రమైనవిగా చూడాలి.

  13. లేవీయకాండము 11:13సుమారు క్రీ.పూ. 1490

    “ ‘మీకు అపవిత్రమైనవిగా భావించి మీరు తినకూడని పక్షులు ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,

  14. లేవీయకాండము 11:14సుమారు క్రీ.పూ. 1490

    ఎర్ర గ్రద్ద, ప్రతి రకమైన నల్ల గ్రద్ద,

  15. లేవీయకాండము 11:15సుమారు క్రీ.పూ. 1490

    ప్రతి రకమైన కాకి,

  16. లేవీయకాండము 11:16సుమారు క్రీ.పూ. 1490

    కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ,

  17. లేవీయకాండము 11:17సుమారు క్రీ.పూ. 1490

    పైడికంటే, చెరువు కాకి, గుడ్లగూబ,

  18. లేవీయకాండము 11:18సుమారు క్రీ.పూ. 1490

    హంస, గూడబాతు, నల్లబోరువ,

  19. లేవీయకాండము 11:19సుమారు క్రీ.పూ. 1490

    సంకు బుడ్డి కొంగ, ప్రతి రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము.

  20. లేవీయకాండము 11:20సుమారు క్రీ.పూ. 1490

    “ ‘నాలుగు కాళ్లతో నడిచే ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవిగా మీరు భావించాలి.

  21. లేవీయకాండము 11:21సుమారు క్రీ.పూ. 1490

    అయితే, నాలుగు కాళ్లతో నడుస్తూ నేలమీద గెంతడానికి కాళ్లకు కీళ్ళున్న ఎగిరే కీటకాలను మీరు తినవచ్చు.

  22. లేవీయకాండము 11:22సుమారు క్రీ.పూ. 1490

    వీటిలో నేత మిడత గాని చిన్న మిడత గాని ఆకు మిడత గాని ప్రతి రకమైన మిడతను తినవచ్చు.

  23. లేవీయకాండము 11:23సుమారు క్రీ.పూ. 1490

    కాని నాలుగు కాళ్లు ఉండి ఎగిరే ఇతర పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి.

  24. లేవీయకాండము 11:24సుమారు క్రీ.పూ. 1490

    “ ‘వీటి ద్వార మీరు అపవిత్రులవుతారు; వాటి కళేబరాలను ఎవరైనా తాకితే వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.

  25. లేవీయకాండము 11:25సుమారు క్రీ.పూ. 1490

    వీటి కళేబరాలలో దేనినైన ఎవరైనా మోస్తే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు.