- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- లేవీయకాండము 11:26సుమారు క్రీ.పూ. 1490
“ ‘చీలిన డెక్కలు లేని నెమరువేయని ప్రతి జంతువు మీకు అపవిత్రం; వాటిలో దేని కళేబరాన్నైనా ఎవరైనా తాకితే వారు అపవిత్రులవుతారు.
- లేవీయకాండము 11:27సుమారు క్రీ.పూ. 1490
నాలుగు కాళ్ల జంతువులన్నిటిలో తమ పంజాలతో నడిచేవన్నీ అపవిత్రమైనవి; వాటిలో దేని కళేబరాన్నైనా ఎవరైనా తాకితే వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
- లేవీయకాండము 11:28సుమారు క్రీ.పూ. 1490
వీటి కళేబరాలలో దేనినైన ఎవరైనా మోస్తే, వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు. ఈ జంతువులు మీకు అపవిత్రమైనవి.
- లేవీయకాండము 11:29సుమారు క్రీ.పూ. 1490
“ ‘నేల మీద ప్రాకే జంతువుల్లో, మీకు అపవిత్రమైనవి ఇవే: ముంగీస, ఎలుక, ప్రతి రకమైన పెద్ద బల్లి,
- లేవీయకాండము 11:30సుమారు క్రీ.పూ. 1490
తొండ, మచ్చల బల్లి, గోడ తొండ, ఉడుము, ఊసరవెల్లి.
- లేవీయకాండము 11:31సుమారు క్రీ.పూ. 1490
భూమి మీద కదిలే వాటన్నిటిలో, ఇవి మీకు నిషేధమైనవి. అవి చనిపోయిన తర్వాత వాటి కళేబరాన్ని తాకినవారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
- లేవీయకాండము 11:32సుమారు క్రీ.పూ. 1490
అవి చనిపోయిన తర్వాత వాటి కళేబరం దేని పైననైన పడితే, అది చెక్క గాని, వస్త్రం గాని, చర్మం గాని గోనెసంచి గాని దేనితో చేసినదైనా, దాని ఉపయోగం ఏదైనా దానిని నీటిలో పెట్టండి; అది సాయంత్రం వరకు అపవిత్రం, తర్వాత అది పవిత్రమవుతుంది.
- లేవీయకాండము 11:33సుమారు క్రీ.పూ. 1490
వాటిలో ఏదైనా మట్టికుండలో పడితే, దానిలో ఉన్నదంతా అపవిత్రమవుతుంది, మీరు తప్పనిసరిగా ఆ కుండను పగులగొట్టాలి.
- లేవీయకాండము 11:34సుమారు క్రీ.పూ. 1490
మీరు తినదగిన ఏ ఆహారమైనా అలాంటి కుండలోని నీరు తగిలితే అది అపవిత్రమవుతుంది, ఎటువంటి పానీయమైనా సరే అలాంటి కుండలో నుండి త్రాగితే అది అపవిత్రము.
- లేవీయకాండము 11:35సుమారు క్రీ.పూ. 1490
వాటి కళేబరాలలో కొంచెమైనా ఒకటి దేనిపైనైనా పడితే అది అపవిత్రమవుతుంది; అది పొయ్యి గాని లేదా వంటచేసే కుండ గాని తప్పకుండ పగులగొట్టబడాలి. అవి అపవిత్రమైనవి, మీరు వాటిని అపవిత్రమైనవిగా భావించాలి.
- లేవీయకాండము 11:36సుమారు క్రీ.పూ. 1490
ఏదేమైనా, ఒక ఊటలో గాని లేదా నీటి తొట్టిలో గాని పవిత్రంగా ఉంటుంది, కానీ వీటిలో ఏదైన ఒకటి ఈ కళేబరాన్ని తాకితే వారు అపవిత్రమవుతారు.
- లేవీయకాండము 11:37సుమారు క్రీ.పూ. 1490
ఒకవేళ నాటబడవలసిన విత్తనాలపై కళేబరం పడితే, అవి పవిత్రంగా ఉంటాయి.
- లేవీయకాండము 11:38సుమారు క్రీ.పూ. 1490
కానీ ఒకవేళ విత్తనాలకు నీరు పెట్టిన తర్వాత, వాటిపై పడితే, అది మీకు అపవిత్రమవుతాయి.
- లేవీయకాండము 11:39సుమారు క్రీ.పూ. 1490
“ ‘ఒకవేళ మీరు తినదగిన జంతువుల్లో ఏదైనా చనిపోతే, దాని కళేబరాన్ని తాకిన ఎవరైనా సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
- లేవీయకాండము 11:40సుమారు క్రీ.పూ. 1490
దాని కళేబరంలో ఎవరైనా ఏదైనా తింటే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు. కళేబరాన్ని ఎవరైనా మోస్తే వారు బట్టలు ఉతుక్కోవాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
- లేవీయకాండము 11:41సుమారు క్రీ.పూ. 1490
“ ‘నేలపై ప్రాకే జీవులన్నీ అపవిత్రమైనవి; దానిని తినకూడదు.
- లేవీయకాండము 11:42సుమారు క్రీ.పూ. 1490
నేలమీద ప్రాకే జీవులలో పొట్ట మీద ప్రాకేవైనా లేదా నాలుగు కాళ్లతో లేదా అంతకన్నా ఎక్కువ కాళ్లతో నడిచేవైనా అవి మీకు అపవిత్రమైనవి.
- లేవీయకాండము 11:43సుమారు క్రీ.పూ. 1490
ప్రాకే జీవులను తిని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు. వాటిని బట్టి గాని వాటి ద్వారా గాని మీరు అపవిత్రం కాకూడదు.
- లేవీయకాండము 11:44సుమారు క్రీ.పూ. 1490
నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను కాబట్టి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని పరిశుద్ధంగా ఉండండి. నేలపై ప్రాకే ఏ జీవిని బట్టి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు.
- లేవీయకాండము 11:45సుమారు క్రీ.పూ. 1490
మీకు దేవునిగా ఉండాలని ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు తెచ్చిన యెహోవాను నేనే; నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి.
- లేవీయకాండము 11:46సుమారు క్రీ.పూ. 1490
“ ‘జంతువులు, పక్షులు, నీటిలో నివసించే ప్రతి జీవి, నేలపైన ప్రాకే జీవులకు సంబంధించిన నియమాలు ఇవే.
- లేవీయకాండము 11:47సుమారు క్రీ.పూ. 1490
అపవిత్రమైన వాటికి పవిత్రమైన వాటికి మధ్య తేడాను, తినదగిన జీవులకు తినకూడని జీవులకు మధ్య తేడాను మీరు గుర్తించాలి.’ ”
- లేవీయకాండము 12:1సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేతో ఇలా అన్నారు,
- లేవీయకాండము 12:2సుమారు క్రీ.పూ. 1490
“ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ఒక స్త్రీ గర్భవతియై ఒక మగశిశువుకు జన్మనిస్తే నెలసరి సమయంలో ఉన్నట్లే ఆచారరీత్య ఆమె ఏడు రోజులు అపవిత్రురాలిగా ఉంటుంది.
- లేవీయకాండము 12:3సుమారు క్రీ.పూ. 1490
ఆ మగశిశువుకు ఎనిమిదవ రోజున సున్నతి చేయించాలి.