కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లేవీయకాండము 12:4సుమారు క్రీ.పూ. 1490

    అప్పుడు స్త్రీ తన రక్తస్రావం నుండి శుద్ధి కావడానికి ముప్పై మూడు రోజులు వేచి ఉండాలి. శుద్ధీకరణ రోజులు పూర్తయే వరకు ఆమె పవిత్రమైన దేన్ని తాకకూడదు, పరిశుద్ధాలయానికి వెళ్లకూడదు.

  2. లేవీయకాండము 12:5సుమారు క్రీ.పూ. 1490

    ఒకవేళ ఆమె ఆడపిల్లకు జన్మనిస్తే, ఆమె రెండు వారాలు అపవిత్రురాలిగా ఉంటుంది. అప్పుడు ఆమె రక్తస్రావం నుండి శుద్ధి కావడానికి అరవై ఆరు రోజులు వేచి ఉండాలి.

  3. లేవీయకాండము 12:6సుమారు క్రీ.పూ. 1490

    “ ‘కుమారుని కోసం గాని కుమార్తె కోసం గాని ఆమె శుద్ధీకరణ రోజులు ముగిసిన తర్వాత ఆమె దహనబలి కోసం ఒక సంవత్సరపు గొర్రెపిల్లను, పాపపరిహారబలి కోసం ఒక చిన్న గువ్వను గాని పావురాన్ని గాని సమావేశ గుడార ద్వారం దగ్గర ఉన్న యాజకుని దగ్గరకు తీసుకురావాలి.

  4. లేవీయకాండము 12:7సుమారు క్రీ.పూ. 1490

    ఆమె కోసం ప్రాయశ్చిత్తం చేయటానికి అతడు వాటిని యెహోవా ఎదుట అర్పించినప్పుడు ఆమె తన రక్తస్రావం నుండి ఆచారరీత్య శుద్ధి అవుతుంది. “ ‘మగశిశువుకు గాని ఆడపిల్లకు గాని జన్మనిచ్చే స్త్రీకి నియమాలు ఇవే.

  5. లేవీయకాండము 12:8సుమారు క్రీ.పూ. 1490

    ఆమె ఒకవేళ గొర్రెపిల్లను కొనలేకపోతే, ఆమె గువ్వల జతను లేదా రెండు చిన్న పావురాలను తీసుకురావాలి. వాటిలో ఒకటి దహనబలి కోసం మరొకటి పాపపరిహారబలి కోసము. ఈ విధంగా యాజకుడు ఆమెకు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు, ఆమె శుద్ధి అవుతుంది.’ ”

  6. లేవీయకాండము 13:1సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషే అహరోనులతో అన్నారు,

  7. లేవీయకాండము 13:2సుమారు క్రీ.పూ. 1490

    “మనుష్యులెవరికైనా వారి చర్మంపై వాపు లేదా దద్దుర్లు లేదా మెరిసే మచ్చ ఉన్నట్లయితే, అది అపవిత్రమైన కుష్ఠువ్యాధి కావచ్చు, వారు యాజకుడైన అహరోను దగ్గరకు లేదా యాజకుడుగా ఉన్న అతని కుమారులలో ఒకరి దగ్గరకు తీసుకురాబడాలి.

  8. లేవీయకాండము 13:3సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు వారి చర్మం మీద ఉన్న పుండును పరీక్షించాలి. ఆ పుండులో వెంట్రుకలు తెల్లబారి ఆ పుండు చర్మంలో లోతుగా ఉంటే అది కుష్ఠువ్యాధి యొక్క లక్షణము. యాజకుడు ఆ వారిని పరీక్షించి వారు ఆచారరీత్య అపవిత్రులని ప్రకటించాలి.

  9. లేవీయకాండము 13:4సుమారు క్రీ.పూ. 1490

    చర్మంలో మచ్చ మెరుస్తూ తెల్లగా ఉండి, చర్మం లోతుకంటే ఎక్కువ లేకపోతే అందులోని వెంట్రుకలు తెల్లగా మారకపోతే యాజకుడు వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

  10. లేవీయకాండము 13:5సుమారు క్రీ.పూ. 1490

    ఏడవ రోజు యాజకుడు వారిని పరీక్షించాలి. చర్మం పుండు అలాగే ఉండి వ్యాపించకుండ ఉంటే యాజకుడు మరో ఏడు రోజులు వారిని వేరుగా ఉంచాలి.

  11. లేవీయకాండము 13:6సుమారు క్రీ.పూ. 1490

    ఏడవ రోజు యాజకుడు వారిని మళ్ళీ పరీక్షించాలి, పుండు క్షీణించి, చర్మంలో వ్యాపించకపోతే, యాజకుడు వారిని శుభ్రంగా ప్రకటించాలి; ఇది దద్దుర్లు మాత్రమే. వారు బట్టలు ఉతుక్కోవాలి, వారు శుభ్రంగా అవుతారు.

  12. లేవీయకాండము 13:7సుమారు క్రీ.పూ. 1490

    కాని వారు శుద్ధులని ప్రకటించబడడానికి యాజకునికి కనుపరచుకున్న తర్వాత దద్దుర్లు చర్మంలో వ్యాపిస్తే వారిని తిరిగి యాజకుని దగ్గరకు రావాలి.

  13. లేవీయకాండము 13:8సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు ఆ వ్యక్తిని పరీక్షించాలి, ఒకవేళ దద్దుర్లు చర్మంలో వ్యాపించి ఉంటే, అతన్ని అపవిత్రునిగా ప్రకటించాలి; అది కుష్ఠువ్యాధి.

  14. లేవీయకాండము 13:9సుమారు క్రీ.పూ. 1490

    “మనుష్యులెవరికైనా తీవ్రమైన కుష్ఠువ్యాధి ఉంటే, వారిని యాజకుని దగ్గరకు తీసుకురావాలి.

  15. లేవీయకాండము 13:10సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు వారిని పరీక్షించాలి, ఒకవేళ చర్మంలో తెల్లని వాపు ఉండి వెంట్రుకలు తెల్లగా మార్చి ఆ వాపులో ఒకవేళ పచ్చి మాంసం ఉంటే,

  16. లేవీయకాండము 13:11సుమారు క్రీ.పూ. 1490

    ఇది దీర్ఘకాలిక కుష్ఠువ్యాధి, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి. అతడు వారిని ఒంటరి చేయకూడదు, ఎందుకంటే వారు అప్పటికే అపవిత్రమైనవారు.

  17. లేవీయకాండము 13:12సుమారు క్రీ.పూ. 1490

    “యాజకుడు చూడగలిగినంతవరకు ఆ వ్యాధి వారి చర్మం అంతా వ్యాపించి ఉంటే, అది తల నుండి పాదం వరకు బాధిత వ్యక్తి యొక్క చర్మమంతా వ్యాపించి ఉంటే,

  18. లేవీయకాండము 13:13సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు వారిని పరీక్షించాలి, ఒకవేళ వ్యాధి వారి శరీరమంతా వ్యాపించి ఉంటే, అతడు వారిని పవిత్రులని ప్రకటించాలి. అదంతా తెల్లగా మారినందుకు, వారు పవిత్రులు.

  19. లేవీయకాండము 13:14సుమారు క్రీ.పూ. 1490

    కాని శరీరంలో పచ్చిపుండు కనిపిస్తే, వారు అపవిత్రులు.

  20. లేవీయకాండము 13:15సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు పచ్చిపుండును చూసినప్పుడు, అతడు వారిని అపవిత్రులని ప్రకటించాలి. పచ్చిపుండు అపవిత్రం; వారు తీవ్రమైన కుష్ఠువ్యాధి కలవారు.

  21. లేవీయకాండము 13:16సుమారు క్రీ.పూ. 1490

    పచ్చిపుండు మారి తెల్లబారితే వారు యాజకుని దగ్గరకు వెళ్లాలి.

  22. లేవీయకాండము 13:17సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు వారిని పరీక్షించి, ఒకవేళ పుండ్లు తెల్లబారి ఉంటే, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి; అప్పుడు వారు పవిత్రులవుతారు.

  23. లేవీయకాండము 13:18సుమారు క్రీ.పూ. 1490

    “ఎవరికైనా వారి చర్మం మీద బొబ్బ వచ్చి మానిపోతే,

  24. లేవీయకాండము 13:19సుమారు క్రీ.పూ. 1490

    అది ఉండిన చోట, తెల్లని వాపు గాని లేదా గులాబి రంగు మచ్చ గాని కనిపిస్తే, వారు దానిని యాజకునికి చూపించాలి.

  25. లేవీయకాండము 13:20సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు దానిని పరీక్షించాలి, ఒకవేళ అది చర్మంపై లోతుగా ఉండి దానిలోని వెంట్రుకలు తెల్లబారినట్లు కనిపిస్తే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి. అది బొబ్బ ఉన్నచోట బయటపడిన తీవ్రమైన కుష్ఠువ్యాధి.