- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- లేవీయకాండము 13:46సుమారు క్రీ.పూ. 1490
వారికి వ్యాధి ఉన్నంత వరకు వారు అపవిత్రులే. వారు ఒంటరిగా జీవించాలి; వారు శిబిరం బయట నివసించాలి.
- లేవీయకాండము 13:47సుమారు క్రీ.పూ. 1490
“అపవిత్రమైన మరకతో పాడైన వస్త్రానికి సంబంధించి, అవి ఉన్నివైనా లేదా నార వస్త్రాలైనా,
- లేవీయకాండము 13:48సుమారు క్రీ.పూ. 1490
నారతో నేసిన వస్త్రాలైనా లేదా ఉన్నితో అల్లిన వస్త్రాలైనా, చర్మమైనా, చర్మంతో చేసినవైనా,
- లేవీయకాండము 13:49సుమారు క్రీ.పూ. 1490
ఒకవేళ వస్త్రాల్లో గాని, చర్మంలో గాని, నేసిన దుస్తుల్లో గాని లేదా అల్లిన దుస్తుల్లో గాని, లేదా ఏదైనా చర్మంతో చేయబడిన వస్తువు మీద గాని పాడైన చోట పచ్చగా లేదా ఎరుపుగా ఉంటే, అది కుష్ఠు మరక యొక్క లక్షణం కాబట్టి తప్పక యాజకునికి చూపించాలి.
- లేవీయకాండము 13:50సుమారు క్రీ.పూ. 1490
యాజకుడు ఆ పాడైన చోటును పరీక్షించి ఏడు రోజులు ఆ వస్తువును వేరుగా ఉంచాలి.
- లేవీయకాండము 13:51సుమారు క్రీ.పూ. 1490
ఏడవ రోజు అతడు దానిని పరీక్షించాలి, ఒకవేళ వస్త్రంలో గాని, నేసిన దానిలో గాని లేదా అల్లిన దానిలో గాని, లేదా చర్మంలో గాని, చర్మంతో చేసినవైనా దానిలో గాని వ్యాపిస్తే, దాని ఉపయోగం ఏదైనా, అది తీవ్రమైన కుష్ఠు మరక; ఆ వస్తువు అపవిత్రము.
- లేవీయకాండము 13:52సుమారు క్రీ.పూ. 1490
పాడైన వస్త్రమైనా, నారతో గాని ఉన్నితో గాని నేసిన లేదా అల్లిన వస్త్రాలైనా, లేదా చర్మంలో గాని, చర్మంతో చేసిన వస్తువైనా అతడు తప్పక కాల్చివేయాలి, ఎందుకంటే అది తీవ్రమైన మరక, ఆ వస్తువు తప్పనిసరిగా కాల్చివేయబడాలి.
- లేవీయకాండము 13:53సుమారు క్రీ.పూ. 1490
“కానీ ఒకవేళ యాజకుడు దానిని పరీక్షించినప్పుడు, మరక వస్త్రంపై గాని, నేసిన దుస్తులపై గాని లేదా అల్లిన దుస్తులపై గాని, చర్మంపై గాని లేదా చర్మంతో చేసిన వస్తువుపై గాని వ్యాపించి ఉండకపోతే,
- లేవీయకాండము 13:54సుమారు క్రీ.పూ. 1490
దానిని ఉతకమని అతడు ఆదేశించి దానిని మరో ఏడు రోజులు వేరుగా ఉంచాలి.
- లేవీయకాండము 13:55సుమారు క్రీ.పూ. 1490
దానిని ఉతికిన తర్వాత, యాజకుడు దానిని మళ్ళీ పరీక్షించాలి, ఒకవేళ ఆ మరక మారకుండా వ్యాపించకుండ అలాగే ఉంటే, అది అపవిత్రమే. వస్త్రం ఎటువైపు పాడైనా, దానిని కాల్చివేయాలి.
- లేవీయకాండము 13:56సుమారు క్రీ.పూ. 1490
ఒకవేళ యాజకుడు దానిని పరీక్షించినప్పుడు, ఆ వస్త్రం ఉతికిన తర్వాత మరక పోయినట్లైతే, అతడు ఆ పాడైన భాగాన్ని వస్త్రమైనా, చర్మమైనా నేసిన వస్త్రమైనా అల్లిన వస్త్రమైనా సరే కత్తిరించివేయాలి.
- లేవీయకాండము 13:57సుమారు క్రీ.పూ. 1490
అయితే ఒకవేళ అది దుస్తుల్లో గాని నేసిన, అల్లిన వస్త్రాల్లో గాని లేదా చర్మంతో చేసిన వాటిలో గాని మళ్ళీ కనిపిస్తే, అది వ్యాపించే మరక అని గుర్తించి అది ఎలాంటి మరకైనా సరే దానిని కాల్చివేయాలి.
- లేవీయకాండము 13:58సుమారు క్రీ.పూ. 1490
వస్త్రమైనా, నేసినదైనా అల్లినదైనా, చర్మంతో చేసిన వస్తువైనా సరే ఉతికిన తర్వాత మరక తొలగిపోతే దానిని మళ్ళీ ఉతకాలి. అప్పుడు అది పవిత్రమవుతుంది.”
- లేవీయకాండము 13:59సుమారు క్రీ.పూ. 1490
ఉన్ని లేదా నార దుస్తుల్లో గాని నేసిన లేదా అల్లిన వస్త్రాల్లో గాని చర్మంతో చేసిన వస్తువులలో గాని కుష్ఠు మరకలు ఉంటే, వాటిని పవిత్రమైనవిగా గాని అపవిత్రమైనవిగా గాని ప్రకటించడానికి ఈ నియమాలు వర్తిస్తాయి.
- లేవీయకాండము 14:1సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేతో ఇలా అన్నారు,
- లేవీయకాండము 14:2సుమారు క్రీ.పూ. 1490
“ఎవరైనా అనారోగ్య వ్యక్తిని వారి ఆచారరీత్య శుద్ధీకరణ పాటిస్తున్న సమయంలో, యాజకుని దగ్గరకు తీసుకువచ్చినప్పుడు పాటించవలసిన నియమాలు ఇవి:
- లేవీయకాండము 14:3సుమారు క్రీ.పూ. 1490
యాజకుడు శిబిరం బయటకు వెళ్లి వారిని పరీక్షించాలి. ఒకవేళ వారు వారి అపవిత్ర చర్మ వ్యాధి నుండి స్వస్థత పొందివుంటే,
- లేవీయకాండము 14:4సుమారు క్రీ.పూ. 1490
వారిని శుద్ధీకరించడానికి రెండు బ్రతికి ఉన్న పవిత్రమైన పక్షులు, కొంత దేవదారు కలప, ఎరుపురంగు నూలు, హిస్సోపును తీసుకురావాలని యాజకుడు ఆదేశించాలి.
- లేవీయకాండము 14:5సుమారు క్రీ.పూ. 1490
తర్వాత ఆ పక్షుల్లో ఒకదాన్ని మట్టికుండలో ఉన్న మంచినీటిపై చంపుమని యాజకుడు ఆదేశించాలి.
- లేవీయకాండము 14:6సుమారు క్రీ.పూ. 1490
అప్పుడు యాజకుడు బ్రతికి ఉన్న పక్షిని పట్టుకుని, దేవదారు కర్రను, ఎర్రని నూలును, హిస్సోపును తీసుకుని మంచినీటిపై చంపబడిన పక్షి రక్తంలో ముంచాలి.
- లేవీయకాండము 14:7సుమారు క్రీ.పూ. 1490
కుష్ఠువ్యాధి నుండి శుద్ధీకరణ పొందే వారిపై ఆ నీటిని ఏడుసార్లు చల్లి, అతడు ఏడుసార్లు చల్లి, వారిని పవిత్రులుగా ప్రకటించాలి. ఆ తర్వాత, యాజకుడు బ్రతికి ఉన్న మరొక పక్షిని బయట పొలాల్లోకి వదిలేయాలి.
- లేవీయకాండము 14:8సుమారు క్రీ.పూ. 1490
“శుద్ధి చేయబడిన వ్యక్తులు తమ బట్టలు ఉతుక్కోవాలి, వారు తమ వెంట్రుకలన్నీ క్షవరం చేయించుకుని నీటితో స్నానం చేయాలి; అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు. దీని తర్వాత వారు శిబిరంలోకి రావచ్చు, కాని వారు తమ గుడారం బయట ఏడు రోజులు ఉండాలి.
- లేవీయకాండము 14:9సుమారు క్రీ.పూ. 1490
ఏడవ రోజున వారు తమ వెంట్రుకలంతా క్షవరం చేయించుకోవాలి; గడ్డం, కనుబొమ్మలు ఇంకా మిగతా వెంట్రుకలు పూర్తిగా క్షవరం చేసుకోవాలి. అలాగే వారు తమ బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు.
- లేవీయకాండము 14:10సుమారు క్రీ.పూ. 1490
“ఎనిమిదవ రోజు ఏ లోపం లేని రెండు మగ గొర్రెపిల్లలను, ఏ లోపం లేని ఏడాది ఆడ గొర్రెపిల్లను, రెండు కూడా ఏ లోపం లేనివాటిని తీసుకురావాలి. భోజనార్పణ కోసం నూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి, ఒక సేరు నూనె యాజకుని దగ్గరకు తీసుకురావాలి.
- లేవీయకాండము 14:11సుమారు క్రీ.పూ. 1490
వారిని శుద్ధులుగా ప్రకటించే యాజకుడు శుద్ధీకరించబడిన వారిని, వారి అర్పణలతో పాటు సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర యెహోవా ఎదుట కనుపరచాలి.