- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- లేవీయకాండము 14:37సుమారు క్రీ.పూ. 1490
అతడు గోడలపై ఉన్న మచ్చను పరీక్షించినప్పుడు ఆ గోడల మీద పచ్చని గీతలు గాని ఎర్రని గీతలు గోడ పగుళ్లలో ఉంటే,
- లేవీయకాండము 14:38సుమారు క్రీ.పూ. 1490
యాజకుడు ఆ ఇంటి ద్వారం నుండి బయటకు వెళ్లి ఏడు రోజులు దానిని మూసివేయాలి.
- లేవీయకాండము 14:39సుమారు క్రీ.పూ. 1490
ఏడవ రోజున యాజకుడు ఆ ఇంటిని పరిశీలించడానికి మరలా రావాలి. ఒకవేళ గోడలపై మరక వ్యాపించి ఉంటే,
- లేవీయకాండము 14:40సుమారు క్రీ.పూ. 1490
మచ్చలు ఉన్న ఆ రాళ్లను ఊడదీసి పట్టణానికి బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయమని యాజకుడు ఆదేశించాలి.
- లేవీయకాండము 14:41సుమారు క్రీ.పూ. 1490
అతడు ఇంటి లోపలి గోడలన్నింటిని గీయించి ఆ చెత్తను పట్టణం బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయాలి.
- లేవీయకాండము 14:42సుమారు క్రీ.పూ. 1490
తీసివేసిన వాటి స్థానంలో వేరే రాళ్లు పెట్టి క్రొత్త బంకమట్టిని తీసుకుని ఇంటికి అడుసు పూయాలి.
- లేవీయకాండము 14:43సుమారు క్రీ.పూ. 1490
“రాళ్లు ఊడదీసి ఇంటి గోడలను గీయించి కొత్త అడుసు పూసిన తర్వాత ఇంట్లో అపవిత్రమైన మరక తిరిగి కనిపిస్తే,
- లేవీయకాండము 14:44సుమారు క్రీ.పూ. 1490
యాజకుడు వెళ్లి దానిని పరీక్షించాలి, ఒకవేళ ఇంట్లో మరక వ్యాపించి ఉంటే అది అపవిత్రపరచే మరక; ఆ ఇల్లు అపవిత్రమైనది.
- లేవీయకాండము 14:45సుమారు క్రీ.పూ. 1490
ఆ ఇంటిని దాని రాళ్లను కలపను అడుసును కూలగొట్టి వాటిని పట్టణం బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయాలి.
- లేవీయకాండము 14:46సుమారు క్రీ.పూ. 1490
“ఒకవేళ ఇల్లు మూసివేసి ఉన్నప్పుడు ఎవరైనా ఇంట్లోకి వెళ్తే సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు.
- లేవీయకాండము 14:47సుమారు క్రీ.పూ. 1490
ఆ ఇంట్లో పడుకునేవారు తినేవారు ఎవరైనా సరే తమ బట్టలు ఉతుక్కోవాలి.
- లేవీయకాండము 14:48సుమారు క్రీ.పూ. 1490
“యాజకుడు వచ్చి దానిని పరీక్షించినప్పుడు ఆ ఇంటికి అడుసు పూసిన తర్వాత మరక వ్యాపించకపోతే, అపవిత్రం చేసే మరక పోయింది కాబట్టి ఆ ఇల్లు పవిత్రమని అతడు ప్రకటించాలి.
- లేవీయకాండము 14:49సుమారు క్రీ.పూ. 1490
ఇంటిని శుద్ధి చేయడానికి అతడు రెండు పక్షులను కొంచెం దేవదారు కర్రను, ఎర్రని నూలును, హిస్సోపును తీసుకోవాలి.
- లేవీయకాండము 14:50సుమారు క్రీ.పూ. 1490
అతడు ఆ పక్షుల్లో ఒకదాన్ని మట్టికుండలో ఉన్న మంచినీటిపై చంపాలి.
- లేవీయకాండము 14:51సుమారు క్రీ.పూ. 1490
అప్పుడు అతడు దేవదారు కర్రను హిస్సోపును ఎర్రని నూలును బ్రతికి ఉన్న పక్షిని తీసుకుని చనిపోయిన పక్షి రక్తంలోను మంచినీటిలోను ముంచి ఆ ఇంట్లో ఏడుసార్లు చల్లాలి.
- లేవీయకాండము 14:52సుమారు క్రీ.పూ. 1490
అతడు ఇంటిని పక్షి రక్తంతోను మంచినీటితోను బ్రతికి ఉన్న పక్షితో దేవదారు కర్రతో హిస్సోపుతో ఎర్రని నూలుతో శుద్ధి చేయాలి.
- లేవీయకాండము 14:53సుమారు క్రీ.పూ. 1490
అప్పుడు అతడు బ్రతికి ఉన్న పక్షిని పట్టణం బయట ఉన్న పొలాల్లో వదలివేయాలి. ఈ విధంగా అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేయాలి, అది శుద్ధి అవుతుంది.”
- లేవీయకాండము 14:54సుమారు క్రీ.పూ. 1490
ఏదైనా కుష్ఠువ్యాధికైనా గజ్జిపుండ్లకైనా నియమాలు ఇవి,
- లేవీయకాండము 14:55సుమారు క్రీ.పూ. 1490
వస్త్రాల్లో గాని ఇంట్లో గాని ఏర్పడే అపవిత్రపరచే మరకలకు,
- లేవీయకాండము 14:56సుమారు క్రీ.పూ. 1490
వాపుకైనా దద్దుర్లకైనా లేదా మెరిసే మచ్చలకైనా,
- లేవీయకాండము 14:57సుమారు క్రీ.పూ. 1490
అవి పవిత్రమైనవా అపవిత్రమైనవా అని ఈ నిబంధనలు తెలియజేస్తాయి. కుష్ఠువ్యాధులు, అపవిత్రపరచే మరకలకు సంబంధించిన నియమాలు ఇవే.
- లేవీయకాండము 15:1సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు,
- లేవీయకాండము 15:2సుమారు క్రీ.పూ. 1490
“మీరు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారితో ఇలా చెప్పండి: ‘ఎప్పుడైనా ఏ పురుషునికైనా శరీరంలో నుండి ఏదైనా ద్రవం కారుతుంటే అది అపవిత్రమైనది.
- లేవీయకాండము 15:3సుమారు క్రీ.పూ. 1490
అది అతని శరీరం నుండి కారుతూ ఉన్నా లేక ఆగిపోయినా అది అతన్ని అపవిత్రం చేస్తుంది. ఈ విధంగా కారడం వలన అతడు అపవిత్రుడు అవుతాడు.
- లేవీయకాండము 15:4సుమారు క్రీ.పూ. 1490
“ ‘స్రవిస్తున్న వ్యక్తి ఏ పడక మీద పడుకున్నా అది అపవిత్రమవుతుంది, అతడు దేనిపైనా కూర్చున్న అది అపవిత్రమవుతుంది.