కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లేవీయకాండము 13:21సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు పరీక్షించినప్పుడు, అందులో తెల్లని వెంట్రుకలు లేకపోతే, చర్మంపై లోతుగా లేకుండ కొంచెం మాని ఉంటే, యాజకుడు పరీక్షించి వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

  2. లేవీయకాండము 13:22సుమారు క్రీ.పూ. 1490

    ఒకవేళ అది చర్మంపై వ్యాపిస్తూ ఉంటే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తీవ్రమైన కుష్ఠువ్యాధి లక్షణము.

  3. లేవీయకాండము 13:23సుమారు క్రీ.పూ. 1490

    అయితే ఒకవేళ ఆ మచ్చ వ్యాపించకుండ అలాగే ఉంటే, అది కేవలం ఒక బొబ్బను బట్టి ఏర్పడిన మచ్చ, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి.

  4. లేవీయకాండము 13:24సుమారు క్రీ.పూ. 1490

    “ఎవరికైనా వారి చర్మంపై కాలి గాయమై, కాలిన చోట ఎర్రగా గాని తెల్లగా గాని మచ్చ కనబడితే,

  5. లేవీయకాండము 13:25సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు ఆ చోటును పరీక్షించాలి, ఒకవేళ అక్కడ వెంట్రుకలు తెల్లగా మారి చర్మం కొంచెం లోపలికి ఉంటే, అది కాలిన చోట బయటపడిన తీవ్రమైన కుష్ఠువ్యాధి; యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తీవ్రమైన కుష్ఠువ్యాధి.

  6. లేవీయకాండము 13:26సుమారు క్రీ.పూ. 1490

    అయితే ఒకవేళ యాజకుడు దానిని పరీక్షిస్తే అక్కడ తెల్లని వెంట్రుకలు లేకుండ ఒకవేళ అది చర్మంపై లోతుగా లేకుండా కొంచెం మానినట్లు కనబడితే, యాజకుడు వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

  7. లేవీయకాండము 13:27సుమారు క్రీ.పూ. 1490

    ఏడవ రోజున యాజకుడు వారిని పరీక్షించినప్పుడు, ఒకవేళ అది చర్మంపై వ్యాపిస్తున్నట్లయితే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తీవ్రమైన కుష్ఠువ్యాధి.

  8. లేవీయకాండము 13:28సుమారు క్రీ.పూ. 1490

    అయితే అది వ్యాపించకుండ అలాగే ఉండి మానుతున్నట్లు కనిపిస్తే, అది కేవలం కాలడం వలన ఏర్పడిన వాపు, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి; ఎందుకంటే అది కేవలం కాలిన గాయం వలన ఏర్పడిన మచ్చ.

  9. లేవీయకాండము 13:29సుమారు క్రీ.పూ. 1490

    “స్త్రీకైనా పురుషునికైనా తలమీద గాని గడ్డం మీద గాని పుండు ఏర్పడితే,

  10. లేవీయకాండము 13:30సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు ఆ పుండును పరీక్షించాలి, ఒకవేళ అది చర్మంపై లోతుగా ఉండి అందులో పసుపు రంగులో సన్నని వెంట్రుకలుంటే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తలమీద గాని గడ్డం మీద గాని ఏర్పడిన గజ్జిపుండు.

  11. లేవీయకాండము 13:31సుమారు క్రీ.పూ. 1490

    కాని యాజకుడు ఆ పుండును పరీక్షించినప్పుడు, అది చర్మంపై లోతుగా లేకపోతే, యాజకుడు వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

  12. లేవీయకాండము 13:32సుమారు క్రీ.పూ. 1490

    ఏడవ రోజు యాజకుడు ఆ గజ్జిపుండును పరీక్షించాలి, ఒకవేళ అది వ్యాపించకపోతే, అందులో పసుపురంగు వెంట్రుకలు లేకపోతే, చర్మంపై లోతుగా లేకపోతే,

  13. లేవీయకాండము 13:33సుమారు క్రీ.పూ. 1490

    ఆ పురుషుడు గాని ఆ స్త్రీ గాని పుండు ఉన్న చోటు వదిలి క్షవరం చేసుకోవాలి క్షౌరం చేసుకోవచ్చు, యాజకుడు వారిని మరో ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

  14. లేవీయకాండము 13:34సుమారు క్రీ.పూ. 1490

    ఏడవ రోజు యాజకుడు ఆ గజ్జిపుండును పరీక్షించాలి, అది చర్మంపై వ్యాపించకుండ చర్మంపై లోతుగా లేకపోతే, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి. వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు.

  15. లేవీయకాండము 13:35సుమారు క్రీ.పూ. 1490

    కానీ వారు పవిత్రులని ప్రకటించిన తర్వాత ఒకవేళ గజ్జిపుండు వ్యాపిస్తే,

  16. లేవీయకాండము 13:36సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు వారిని పరీక్షించి ఒకవేళ ఆ గజ్జిపుండు చర్మంపై వ్యాపించినట్లు కనబడితే, అతడు పసుపురంగు వెంట్రుకల కోసం చూడాల్సిన అవసరం లేదు; వారు అపవిత్రులు.

  17. లేవీయకాండము 13:37సుమారు క్రీ.పూ. 1490

    ఒకవేళ, యాజకుడు చూసే వరకు ఆ పుండు అలాగే ఉండి, ఒకవేళ దానిపై నల్ల జుట్టు పెరిగితే, వారు బాగయ్యారని అర్థము. వారు శుభ్రంగా ఉన్నారు, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి.

  18. లేవీయకాండము 13:38సుమారు క్రీ.పూ. 1490

    “పురుషునికి గాని స్త్రీకి గాని చర్మంపై తెల్ల మచ్చలు ఉంటే,

  19. లేవీయకాండము 13:39సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు వాటిని పరీక్షించాలి, ఒకవేళ ఆ మచ్చలు స్పష్టంగా కనబడక మామూలుగా ఉంటే, అవి చర్మం మీద వచ్చిన సాధారణ పొక్కులు, అవి హానికరం కావు; వారు ఆచారరీత్య పవిత్రులు.

  20. లేవీయకాండము 13:40సుమారు క్రీ.పూ. 1490

    “తలవెంట్రుకలు రాలిపోయి బట్టతల ఉన్న పురుషుడు పవిత్రుడు.

  21. లేవీయకాండము 13:41సుమారు క్రీ.పూ. 1490

    ఒకవేళ తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోయి, నుదురు బోడిగా ఉంటే, అతడు పవిత్రుడు.

  22. లేవీయకాండము 13:42సుమారు క్రీ.పూ. 1490

    అయితే అతని బట్టతలపై గాని లేదా నుదిటిపై గాని గులాబి రంగు పుండు ఉంటే, అది అతని తలమీద గాని నుదుటి మీద గాని ఏర్పడుతున్న తీవ్రమైన కుష్ఠువ్యాధి.

  23. లేవీయకాండము 13:43సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు అతన్ని పరీక్షించాలి, ఒకవేళ అతని తలపై గాని నుదిటిపై వాచిన పుండు గులాబి రంగులో తీవ్రమైన కుష్ఠువ్యాధిలా ఉంటే,

  24. లేవీయకాండము 13:44సుమారు క్రీ.పూ. 1490

    ఆ పురుషుడు వ్యాధిగ్రస్తుడు, అపవిత్రుడు. యాజకుడు అతని తలపై ఉన్న కుష్ఠువ్యాధిని బట్టి అతన్ని అపవిత్రునిగా ప్రకటించాలి.

  25. లేవీయకాండము 13:45సుమారు క్రీ.పూ. 1490

    “అలాంటి కుష్ఠువ్యాధి ఉన్నవారెవరైనా తప్పనిసరిగా చిరిగిన బట్టలు ధరించాలి, చింపిరి జుట్టుతో ఉండాలి, వారు తమ నోటిని కప్పుకుని, ‘అపవిత్రులం! అపవిత్రులం!’ అని బిగ్గరగా అరవాలి.