కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లేవీయకాండము 8:31సుమారు క్రీ.పూ. 1490

    అప్పుడు మోషే అహరోనుతో, అతని కుమారులతో, “సమావేశ గుడారపు ద్వారం దగ్గర మాంసాన్ని వండి ప్రతిష్ఠార్పణల గంపలోని రొట్టెలతో తినాలి, నాకు ఆజ్ఞాపించబడిన ప్రకారం, ‘అహరోను అతని కుమారులు దానిని తినాలి.’

  2. లేవీయకాండము 8:32సుమారు క్రీ.పూ. 1490

    తర్వాత మిగిలిన మాంసాన్ని, రొట్టెను కాల్చాలి.

  3. లేవీయకాండము 8:33సుమారు క్రీ.పూ. 1490

    మీ నియామక రోజులు పూర్తయ్యే వరకు ఏడు రోజులు సమావేశ గుడారపు ద్వారాన్ని విడిచివెళ్లవద్దు, ఎందుకంటే మీ నియామకం ఏడు రోజులు ఉంటుంది.

  4. లేవీయకాండము 8:34సుమారు క్రీ.పూ. 1490

    ఈ రోజు జరిగింది యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి జరిగింది.

  5. లేవీయకాండము 8:35సుమారు క్రీ.పూ. 1490

    మీరు సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర ఏడు రోజులు రాత్రింబగళ్ళు ఉండి యెహోవా ఏం చేయమంటారో అది చేయాలి, అప్పుడు మీరు చావరు; ఎందుకంటే నాకివ్వబడిన ఆజ్ఞ ఇదే” అని చెప్పాడు.

  6. లేవీయకాండము 8:36సుమారు క్రీ.పూ. 1490

    కాబట్టి అహరోను అతని కుమారులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రతిదీ చేశారు.

  7. లేవీయకాండము 9:1సుమారు క్రీ.పూ. 1490

    ఎనిమిదవ రోజు మోషే అహరోనును అతని కుమారులను, ఇశ్రాయేలు గోత్ర పెద్దలను పిలిపించాడు.

  8. లేవీయకాండము 9:2సుమారు క్రీ.పూ. 1490

    అతడు అహరోనుతో ఇలా అన్నాడు, “మీ పాపపరిహారబలి కోసం ఏ లోపం లేని ఒక మగ దూడను, మీ దహనబలికి ఒక లోపం లేని పొట్టేలును తీసుకువచ్చి వాటిని యెహోవా ఎదుట సమర్పించాలి.

  9. లేవీయకాండము 9:3సుమారు క్రీ.పూ. 1490

    అప్పుడు నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘పాపపరిహారబలి కోసం లోపం లేని ఒక మేకపోతును దహనబలి కోసం లోపం లేని ఒక దూడను, ఒక గొర్రెపిల్లను తీసుకురావాలి.

  10. లేవీయకాండము 9:4సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా ఎదుట బలి అర్పించడానికి సమాధానబలికి ఎద్దును, పొట్టేలును, ఒలీవనూనె కలిపిన భోజనార్పణతో పాటు తీసుకురండి. ఎందుకంటే యెహోవా ఈ రోజు మీకు ప్రత్యక్షమవుతారు.’ ”

  11. లేవీయకాండము 9:5సుమారు క్రీ.పూ. 1490

    వారు మోషే ఆజ్ఞాపించినట్లుగా సమావేశ గుడారం ఎదుటికి వాటన్నిటిని తీసుకువచ్చారు, అప్పుడు సమాజమంతా దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిలో నిలబడ్డారు.

  12. లేవీయకాండము 9:6సుమారు క్రీ.పూ. 1490

    అప్పుడు మోషే ఇలా అన్నాడు, “మీరు ఇలా చేయాలని యెహోవా ఆజ్ఞాపించారు, తద్వార యెహోవా మహిమ మీకు ప్రత్యక్షం అవుతుంది.”

  13. లేవీయకాండము 9:7సుమారు క్రీ.పూ. 1490

    మోషే అహరోనుతో ఇలా అన్నాడు, “యెహోవా ఆజ్ఞాపించినట్లు బలిపీఠం దగ్గరకు వచ్చి, నీ పాపపరిహారబలిని, దహనబలిని అర్పించి, నీకోసం, ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి; ప్రజల కోసం అర్పణను అర్పించి వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.”

  14. లేవీయకాండము 9:8సుమారు క్రీ.పూ. 1490

    కాబట్టి అహరోను బలిపీఠం దగ్గరికి సమీపించి తన పాపపరిహారబలిగా కోడెను వధించాడు.

  15. లేవీయకాండము 9:9సుమారు క్రీ.పూ. 1490

    అహరోను కుమారులు దాని రక్తాన్ని అతనికి అందించారు, ఆ రక్తంలో తన వ్రేలు ముంచి బలిపీఠం కొమ్ములకు రాశాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోశాడు.

  16. లేవీయకాండము 9:10సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు బలిపీఠం మీద పాపపరిహారబలిగా దాని క్రొవ్వును, మూత్రపిండాలను, కాలేయం దగ్గర ఉన్న క్రొవ్వును దహించాడు.

  17. లేవీయకాండము 9:11సుమారు క్రీ.పూ. 1490

    దాని మాంసాన్ని, చర్మాన్ని, శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు.

  18. లేవీయకాండము 9:12సుమారు క్రీ.పూ. 1490

    తర్వాత అతడు దహనబలిని వధించాడు. అహరోను కుమారులు రక్తాన్ని అతనికి అందించగా, అతడు దానిని బలిపీఠం చుట్టూరా చల్లాడు.

  19. లేవీయకాండము 9:13సుమారు క్రీ.పూ. 1490

    వారు అతనికి దహనబలి తలను దాని ముక్కలను ఇవ్వగా, అతడు వాటిని బలిపీఠం మీద కాల్చాడు.

  20. లేవీయకాండము 9:14సుమారు క్రీ.పూ. 1490

    లోపలి అవయవాలను, కాళ్లను కడిగి బలిపీఠం మీద ఉన్న దహనబలిపైన వాటిని కాల్చాడు.

  21. లేవీయకాండము 9:15సుమారు క్రీ.పూ. 1490

    అప్పుడు అహరోను ప్రజల అర్పణను తీసుకువచ్చాడు. అతడు ప్రజల పాపపరిహారబలి కోసం మేకను తీసుకుని దానిని వధించి మొదటి దానిని చేసినట్లుగానే దీన్ని కూడా పాపపరిహారబలిగా అర్పించాడు.

  22. లేవీయకాండము 9:16సుమారు క్రీ.పూ. 1490

    అతడు దహనబలిని తెచ్చి సూచించబడినట్టే అర్పించాడు.

  23. లేవీయకాండము 9:17సుమారు క్రీ.పూ. 1490

    అతడు భోజనార్పణ కూడా తీసుకువచ్చి, దానిలో నుండి పిడికెడు తీసి బలిపీఠంపై దానిని ఉదయం చెల్లించాల్సిన దహనబలితో పాటు దహించాడు.

  24. లేవీయకాండము 9:18సుమారు క్రీ.పూ. 1490

    ప్రజల నిమిత్తం అహరోను సమాధానబలిగా ఎద్దును, పొట్టేలును వధించాడు. అతని కుమారులు అతనికి రక్తాన్ని అందించగా, అతడు బలిపీఠం చుట్టూరా దానిని చల్లాడు.

  25. లేవీయకాండము 9:19సుమారు క్రీ.పూ. 1490

    ఎద్దు క్రొవ్వును, పొట్టేలు క్రొవ్వును, క్రొవ్విన తోకను, లోపల అవయవాల మీద ఉన్న క్రొవ్వును, మూత్రపిండాలను, కాలేయం మీది క్రొవ్వును