కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లేవీయకాండము 7:19సుమారు క్రీ.పూ. 1490

    “ ‘మాంసానికి ఏదైనా ఆచారరీత్య అపవిత్ర పదార్థం తగిలితే అది తినకూడదు. అది కాల్చివేయాలి. ఇతర మాంసం అయితే ఆచార ప్రకారం శుభ్రంగా ఉన్నవారు తినవచ్చు.

  2. లేవీయకాండము 7:20సుమారు క్రీ.పూ. 1490

    కాని అపవిత్రంగా ఉన్న ఎవరైనా యెహోవాకు చెందిన సమాధానబలి మాంసం తింటే, వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.

  3. లేవీయకాండము 7:21సుమారు క్రీ.పూ. 1490

    ఎవరైనా అపవిత్రమైన దాన్ని అది మానవ అపవిత్రత గాని అపవిత్రమైన జంతువునే గాని నేలపై ప్రాకే జీవులనే గాని తాకి, యెహోవాకు చెందిన సమాధానబలి మాంసం తింటే, వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.’ ”

  4. లేవీయకాండము 7:22సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  5. లేవీయకాండము 7:23సుమారు క్రీ.పూ. 1490

    “నీవు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘పశువులదే గాని గొర్రెలదే గాని లేదా మేకలదే గాని క్రొవ్వును మీరు తినకూడదు.

  6. లేవీయకాండము 7:24సుమారు క్రీ.పూ. 1490

    చచ్చిన జంతువు క్రొవ్వును లేదా అడవి మృగాలు చీల్చిన జంతువు క్రొవ్వును దేనికైనా ఉపయోగించవచ్చు కాని దానిని తినకూడదు.

  7. లేవీయకాండము 7:25సుమారు క్రీ.పూ. 1490

    ఎవరైనా యెహోవాకు హోమబలిగా అర్పించే జంతువు యొక్క క్రొవ్వును తింటే వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.

  8. లేవీయకాండము 7:26సుమారు క్రీ.పూ. 1490

    మీరు నివసించే చోట పక్షి రక్తం గాని, జంతు రక్తం గాని తినకూడదు.

  9. లేవీయకాండము 7:27సుమారు క్రీ.పూ. 1490

    ఎవరైనా రక్తాన్ని తింటే వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.’ ”

  10. లేవీయకాండము 7:28సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  11. లేవీయకాండము 7:29సుమారు క్రీ.పూ. 1490

    “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా యెహోవాకు సమాధానబలిని తెస్తే, దానిలో ఒక భాగాన్ని ప్రత్యేకంగా యెహోవాకు అర్పించాలి.

  12. లేవీయకాండము 7:30సుమారు క్రీ.పూ. 1490

    వారు తమ స్వహస్తాలతో హోమబలిని యెహోవాకు అర్పించాలి; వారు రొమ్ము భాగాన్ని దాని మీద ఉన్న క్రొవ్వుతో పాటు తెచ్చి, ఆ రొమ్ము భాగాన్ని యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి.

  13. లేవీయకాండము 7:31సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు ఆ క్రొవ్వును బలిపీఠం మీద దహించాలి, కాని రొమ్ము భాగం అహరోను, అతని కుమారులకు చెందుతుంది.

  14. లేవీయకాండము 7:32సుమారు క్రీ.పూ. 1490

    సమాధానబలులలో నుండి తీసిన కుడి తొడను యాజకునికి కానుకగా ఇవ్వాలి.

  15. లేవీయకాండము 7:33సుమారు క్రీ.పూ. 1490

    అహరోను కుమారులలో ఎవరైతే సమాధానబలి రక్తాన్ని, క్రొవ్వును అర్పిస్తాడో అతడు ఆ కుడి తొడను తన వాటాగా తీసుకోవచ్చు.

  16. లేవీయకాండము 7:34సుమారు క్రీ.పూ. 1490

    ఇశ్రాయేలీయుల సమాధానబలులలో నుండి నేను పైకెత్తిన రొమ్ము భాగాన్ని, అర్పించిన తొడను తీసుకుని యాజకుడైన అహరోనుకు అతని కుమారులకు ఇశ్రాయేలీయుల నుండి శాశ్వత వాటాగా ఇచ్చాను.’ ”

  17. లేవీయకాండము 7:35సుమారు క్రీ.పూ. 1490

    ఇది యెహోవాకు అర్పించిన హోమబలులలో అహరోను, అతని కుమారులు యెహోవాకు యాజకులుగా సేవ చేయడానికి సమర్పించబడిన రోజున వారికి కేటాయించబడిన వాటా.

  18. లేవీయకాండము 7:36సుమారు క్రీ.పూ. 1490

    వారు అభిషేకించబడిన రోజున, ఇశ్రాయేలీయులు రాబోయే తరాలకు తమ శాశ్వత వాటాగా ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించారు.

  19. లేవీయకాండము 7:37సుమారు క్రీ.పూ. 1490

    దహనబలికి, భోజనార్పణకు, పాపపరిహారబలికి, అపరాధపరిహారబలికి, ప్రతిష్ఠార్పణకు, సమాధానబలికి ఇవి నియమాలు,

  20. లేవీయకాండము 7:38సుమారు క్రీ.పూ. 1490

    వీటిని ఇశ్రాయేలీయులు తమ అర్పణలను యెహోవా దగ్గరకు తీసుకురావాలని ఆజ్ఞాపించిన రోజున యెహోవా సీనాయి అరణ్యంలోని సీనాయి పర్వతం దగ్గర మోషేకు ఇచ్చారు.

  21. లేవీయకాండము 8:1సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషేతో చెప్పారు,

  22. లేవీయకాండము 8:2సుమారు క్రీ.పూ. 1490

    “నీవు అహరోనును అతని కుమారులను, వారి వస్త్రాలను, అభిషేక తైలాన్ని, పాపపరిహారబలికి ఒక కోడెను, రెండు పొట్టేళ్లను గంపెడు పులియని రొట్టెలు తీసుకువచ్చి,

  23. లేవీయకాండము 8:3సుమారు క్రీ.పూ. 1490

    సమాజమంతటిని సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర సమకూర్చాలి.”

  24. లేవీయకాండము 8:4సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేశాడు, అలాగే సమాజం సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర సమావేశమయ్యింది.

  25. లేవీయకాండము 8:5సుమారు క్రీ.పూ. 1490

    “యెహోవా ఇలా చేయాలని ఆజ్ఞాపించారు” అని మోషే సమాజానికి చెప్పాడు.