- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- లేవీయకాండము 8:6సుమారు క్రీ.పూ. 1490
అప్పుడు మోషే, అహరోనును, అతని కుమారులను ముందుకు తెచ్చి నీటితో వారిని కడిగాడు.
- లేవీయకాండము 8:7సుమారు క్రీ.పూ. 1490
అతడు అహరోను మీద పైవస్త్రం వేసి, నడికట్టు కట్టి, ఏఫోదు వస్త్రాన్ని, అలాగే ఏఫోదును అతనికి ధరింపజేశాడు. అతడు ఏఫోదును అల్లబడిన నడికట్టుతో అతనికి చుట్టూ కట్టాడు.
- లేవీయకాండము 8:8సుమారు క్రీ.పూ. 1490
అతడు రొమ్ము పతకాన్ని అతనిపై ఉంచాడు, రొమ్ము పతకం లోపల ఊరీము తుమ్మీములను అమర్చాడు.
- లేవీయకాండము 8:9సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు అహరోను తలమీద తలపాగాను పెట్టి, దానికి బంగారు పలకను అమర్చి దానికి పవిత్ర చిహ్నాన్ని తగిలించాడు.
- లేవీయకాండము 8:10సుమారు క్రీ.పూ. 1490
తర్వాత మోషే అభిషేక తైలాన్ని తీసుకుని సమావేశ గుడారాన్ని, దానిలోని ప్రతిదాన్ని అభిషేకించి, వాటిని పవిత్రం చేశాడు.
- లేవీయకాండము 8:11సుమారు క్రీ.పూ. 1490
అతడు బలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటిని, దాని గంగాళాన్ని దాని పీటను ప్రతిష్ఠించడానికి, బలిపీఠం మీద ఏడుసార్లు కొంచెం నూనె చిలకరించి వాటిని అభిషేకించాడు.
- లేవీయకాండము 8:12సుమారు క్రీ.పూ. 1490
అహరోనును ప్రతిష్ఠించడానికి అభిషేక తైలంలో కొంచెం అతని తలమీద పోశాడు.
- లేవీయకాండము 8:13సుమారు క్రీ.పూ. 1490
తర్వాత యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా అతడు అహరోను కుమారులను ముందుకు తీసుకువచ్చి, వారికి చొక్కాలు తొడిగించి నడికట్టు కట్టి, వారి తలల మీద టోపీలను పెట్టాడు.
- లేవీయకాండము 8:14సుమారు క్రీ.పూ. 1490
తర్వాత అతడు పాపపరిహారబలి కోసం ఎద్దును సమర్పించాడు, దాని తలపై అహరోను అతని కుమారులు తమ చేతులు ఉంచారు.
- లేవీయకాండము 8:15సుమారు క్రీ.పూ. 1490
మోషే ఎద్దును వధించి, కొంత రక్తాన్ని తీసుకుని, బలిపీఠం శుద్ధి చేయడానికి, తన వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద దానిని పూసాడు. మిగిలిన రక్తాన్ని అతడు బలిపీఠం అడుగున పోశాడు. కాబట్టి మోషే దానికి ప్రాయశ్చిత్తం చేసి దానిని ప్రతిష్ఠించాడు.
- లేవీయకాండము 8:16సుమారు క్రీ.పూ. 1490
మోషే లోపలి అవయవాల చుట్టూ ఉన్న క్రొవ్వునంతటిని, కాలేయం మీది క్రొవ్వు, రెండు మూత్రపిండాలు వాటి క్రొవ్వును తీసుకుని బలిపీఠం మీద కాల్చాడు.
- లేవీయకాండము 8:17సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, కోడెను, దాని చర్మాన్ని దాని మాంసాన్ని, దాని పేడను శిబిరం బయట కాల్చివేశాడు.
- లేవీయకాండము 8:18సుమారు క్రీ.పూ. 1490
తర్వాత అతడు దహనబలికి పొట్టేలును తీసుకువచ్చినప్పుడు, దాని తలపై అహరోను అతని కుమారులు చేతులుంచారు.
- లేవీయకాండము 8:19సుమారు క్రీ.పూ. 1490
అప్పుడు మోషే పొట్టేలును వధించి దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు.
- లేవీయకాండము 8:20సుమారు క్రీ.పూ. 1490
అతడు పొట్టేలును ముక్కలు చేసి తలను, ముక్కలను, క్రొవ్వును కాల్చాడు.
- లేవీయకాండము 8:21సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దాని లోపలి అవయవాలను కాళ్లను నీళ్లతో కడిగి పొట్టేలంతటిని బలిపీఠం మీద కాల్చాడు. అది దహనబలి, యెహోవాకు సమర్పించబడిన ఇష్టమైన సువాసనగల హోమబలి.
- లేవీయకాండము 8:22సుమారు క్రీ.పూ. 1490
తర్వాత మోషే మరొక పొట్టేలును అనగా యాజకుని నియామకం కోసం కావలసిన పొట్టేలును తీసుకువచ్చినప్పుడు, అహరోను అతని కుమారులు దాని తలమీద వారి చేతులుంచారు.
- లేవీయకాండము 8:23సుమారు క్రీ.పూ. 1490
మోషే పొట్టేలును వధించి, దాని రక్తం కొంత తీసుకుని అహరోను కుడిచెవి అంచుకు, కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలి బొటన వ్రేలి మీద పూసాడు.
- లేవీయకాండము 8:24సుమారు క్రీ.పూ. 1490
మోషే అహరోను కుమారులను కూడా ముందుకు పిలిచి వారి కుడిచెవి అంచుకు, కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలు బొటన వ్రేలి మీద పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు.
- లేవీయకాండము 8:25సుమారు క్రీ.పూ. 1490
తర్వాత దాని క్రొవ్వును, తోకకు ఉన్న క్రొవ్వును, లోపలి అవయవాలపై ఉన్న క్రొవ్వునంతటిని, కాలేయం మీది క్రొవ్వును, రెండు మూత్రపిండాలను వాటి క్రొవ్వును, వాటి కుడి తొడను తీసుకున్నాడు.
- లేవీయకాండము 8:26సుమారు క్రీ.పూ. 1490
యెహోవా ఎదుట ఉన్న పులియని రొట్టెల గంపలో నుండి ఒక మందమైన రొట్టెను, ఒలీవనూనె కలిపి చేసిన ఒక మందమైన రొట్టెను, ఒక పల్చని రొట్టెను తీసుకుని, ఆ క్రొవ్వు మీద, కుడి తొడ మీద ఉంచాడు.
- లేవీయకాండము 8:27సుమారు క్రీ.పూ. 1490
అవన్నీ అహరోను, అతని కుమారుల చేతుల్లో పెట్టగా, వారు యెహోవా ఎదుట వాటిని పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించారు.
- లేవీయకాండము 8:28సుమారు క్రీ.పూ. 1490
తర్వాత మోషే వారి చేతుల్లో నుండి వాటిని తీసుకుని బలిపీఠం మీద ఉన్న దహనబలి మీదుగా ప్రతిష్ఠార్పణగా వాటిని కాల్చి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా అర్పించాడు.
- లేవీయకాండము 8:29సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ప్రతిష్ఠార్పణకు చెందిన పొట్టేలులో మోషే వాటాయైన రొమ్ము భాగాన్ని కూడా తీసి పైకెత్తి దానిని యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాడు.
- లేవీయకాండము 8:30సుమారు క్రీ.పూ. 1490
అప్పుడు మోషే కొంత అభిషేక తైలాన్ని, బలిపీఠం మీద నుండి కొంచెం రక్తాన్ని తీసుకుని అహరోను మీద అతని వస్త్రాల మీద, అతని కుమారుల మీద వారి వస్త్రాల మీద చిలకరించాడు. ఇలా అతడు అహరోనును అతని వస్త్రాలను, అతని కుమారులను వారి వస్త్రాలను ప్రతిష్ఠించాడు.