కంటెంట్‌కు వెళ్లండి

Ephraim

160 వచనాలు · 9 కుటుంబ సభ్యులు

Ephraim ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఎఫ్రాయిమీయుల వంశాల ప్రకారం వారి సరిహద్దు ఈ విధంగా: వారి వారసత్వపు సరిహద్దు తూర్పున అతారోత్-అద్దారు నుండి ఎగువ బేత్-హోరోను వరకు వెళ్లి,

  2. తప్పూయ నుండి ఆ సరిహద్దు కానా కనుమ వరకు పడమటి వైపుగా వెళ్లి సముద్రం దగ్గర అంతమయ్యింది. ఇది ఎఫ్రాయిం గోత్రం వారికి వారి వంశాల ప్రకారం లభించిన వారసత్వము.

  3. మనష్షే వారి వారసత్వంలో ఎఫ్రాయిమీయుల కోసం కేటాయించబడిన అన్ని పట్టణాలు, వాటి గ్రామాలు కూడా ఉన్నాయి.

  4. (తప్పూయ భూభాగం మనష్షేకు చెందుతుంది, కానీ మనష్షే సరిహద్దులో ఉన్న తప్పూయ ఎఫ్రాయిమీయులకు చెందినదే.)

  5. ఆ సరిహద్దు దక్షిణాన కానా కనుమ వరకు కొనసాగింది. మనష్షే పట్టణాల మధ్య ఎఫ్రాయిముకు చెందిన పట్టణాలు ఉన్నాయి, కానీ మనష్షే సరిహద్దు కనుమకు ఉత్తరం వైపుగా మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది.

  6. దక్షిణాన ఉన్న భూమి ఎఫ్రాయిముకు, ఉత్తరాన మనష్షేకు చెందినది. మనష్షే భూభాగం మధ్యధరా సముద్రం వరకు ఉంది. ఉత్తరాన ఆషేరు, తూర్పున ఇశ్శాఖారు సరిహద్దులుగా ఉంది.

  7. యెహోషువ యోసేపు గోత్రాలతో అనగా ఎఫ్రాయిం మనష్షేలతో, “మీరు చాలామంది ఉన్నారు, మీరు చాలా బలవంతులు. మీకు ఒక్క భాగమే కాదు,

  8. కాబట్టి వారు నఫ్తాలి కొండ సీమలోని గలిలయలో ఉన్న కెదెషును, ఎఫ్రాయిం కొండ సీమలోని షెకెమును, యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) ప్రత్యేకపరిచారు.

  9. మిగిలిన కహాతు సంతతివారికి ఎఫ్రాయిం, దాను, మనష్షే అర్థ గోత్రాల నుండి చీట్ల ద్వారా పది పట్టణాలు ఇచ్చారు.

  10. లేవీయులైన కహాతీయుల వంశాలలో మిగిలిన వారికి ఎఫ్రాయిం గోత్రం నుండి కేటాయించిన పట్టణాలు:

  11. ఎఫ్రాయిం కొండ సీమలో వారికి ఇచ్చినవి: షెకెము (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), గెజెరు,

  12. ఎఫ్రాయిం కొండ ప్రాంతంలోని గాయషు పర్వతానికి ఉత్తరాన ఉన్న తిమ్నాత్ సెరహులో అతనికి వారసత్వంగా వచ్చిన దేశంలో వారు అతన్ని పాతిపెట్టారు.

  13. అహరోను కుమారుడైన ఎలియాజరు చనిపోయినప్పుడు ఎఫ్రాయిం కొండసీమల్లో అతని కుమారుడైన ఫీనెహాసుకు ఇచ్చిన గిబియాలో వారతన్ని పాతిపెట్టారు.

  14. ఎఫ్రాయిం గోత్రం వారు కూడా గెజెరులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు, కనానీయులు వారి మధ్యలోనే నివసించారు.

  15. వారు అతన్ని గాయషు పర్వతానికి ఉత్తర దిక్కున ఉన్న ఎఫ్రాయిం కొండ సీమలో ఉన్న తిమ్నత్ హెరెసు అనే తన వారసత్వ భూమిలో పాతిపెట్టారు.

  16. అక్కడికి చేరినప్పుడు, అతడు వచ్చి ఎఫ్రాయిం కొండ సీమలో బూరను ఊదాడు, అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితో కొండల దిగువకు వెళ్లారు, అతడు వారి నాయకుడయ్యాడు.

  17. ఆమె ఎఫ్రాయిం కొండ సీమలో రామాకు బేతేలుకు మధ్యనున్న దెబోరా ఖర్జూర చెట్టు క్రింద తీర్పులు తీర్చడానికి కూర్చుండేది, ఇశ్రాయేలీయులు వారి వివాదాలు పరిష్కరించుకోడానికి ఆమె దగ్గరకు వచ్చేవారు.

  18. కొందరు అమాలేకులో స్థిరపడినవారు ఎఫ్రాయిం నుండి వచ్చారు; నీ వెంట వచ్చిన వారిలో బెన్యామీను వారు ఉన్నారు. మాకీరు నుండి అధిపతులు వచ్చారు, జెబూలూను నుండి అధికారుల దండం మోసేవారు వచ్చారు.

  19. గిద్యోను ఎఫ్రాయిం కొండసీమ దేశమంతటికి దూతలను పంపి, “క్రిందికి రండి, మిద్యానీయులను జయించడానికి వచ్చి బేత్-బారా వరకు యొర్దాను నీళ్లను వారికి ముందున్న స్వాధీనపరచుకోండి” అని చెప్పాడు. కాబట్టి ఎఫ్రాయిం గోత్రికులందరు వచ్చి యొర్దాను నీళ్లను బేత్-బారా వరకు స్వాధీనపరచుకున్నారు.

  20. అయితే ఎఫ్రాయిమీయులు, “నీవు మా పట్ల ఇలా ఎందుకు చేశావు? మిద్యానీయులతో యుద్ధం చెయ్యడానికి నీవు వెళ్లినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలువలేదు?” అని గిద్యోనుతో తీవ్రంగా వాదించారు.

  21. అయితే అతడు, “మీతో పోల్చుకుంటే నేను సాధించింది ఏంటి? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోతకంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా?

  22. అబీమెలెకు చనిపోయిన తర్వాత ఇశ్శాఖారు గోత్రం నుండి దోదో మనుమడు, పువా కుమారుడైన తోలా ఇశ్రాయేలును రక్షించడానికి లేచాడు. అతడు ఎఫ్రాయిం కొండసీమలో, షామీరులో నివసించాడు.

  23. అమ్మోనీయులు కూడా యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం ప్రజలతో యుద్ధం చేయడానికి యొర్దానును దాటారు; ఇశ్రాయేలీయులు ఎంతో శ్రమ అనుభవించారు.

  24. ఎఫ్రాయిం ప్రజలు సమకూడి సఫోనును దాటి వెళ్లి యెఫ్తాతో, “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మమ్మల్ని పిలువకుండా నీవెందుకు వెళ్లావు? ఇప్పుడు నీవుంటున్న నీ ఇంటిని నీతో పాటు కాల్చివేస్తాము.”

  25. యెఫ్తా గిలాదు మనుష్యులను కూర్చుకుని ఎఫ్రాయిం వారితో యుద్ధం చేశాడు. ఎఫ్రాయిమీయులను, “గిలాదీయులైన మీరు ఎఫ్రాయిం మనష్షేల ఎదుట నిలబడలేక పారిపోయారు” అని అన్నారు.