కంటెంట్‌కు వెళ్లండి

Ephraim

160 వచనాలు · 9 కుటుంబ సభ్యులు

Ephraim ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “నేను చాలా ధనవంతుడను; నాకున్న ధనాన్ని బట్టి వారు నాలో ఏ తప్పును కాని పాపాన్ని కాని చూపించలేరు” అని ఎఫ్రాయిం అతిశయిస్తున్నాడు.

  2. కాని ఎఫ్రాయిం ఆయన మహా కోపాన్ని రేపాడు అతడు చేసిన రక్తపాతం బట్టి దేవుడు అతని మీద నేరం మోపుతారు అతని ధిక్కారం బట్టి ఆయన అతనికి ప్రతీకారం చేస్తారు.

  3. ఎఫ్రాయిం మాట్లాడినప్పుడు ప్రజలు వణికారు; అతడు ఇశ్రాయేలులో ఘనపరచబడ్డాడు. కాని అతడు బయలును పూజించి అపరాధిగా చనిపోయాడు.

  4. ఎఫ్రాయిం అపరాధం పోగుచేయబడింది, అతని పాపాలు వ్రాయబడ్డాయి.

  5. ఎఫ్రాయిమూ, ఇకనుండి విగ్రహాలతో నాకేం పని? నేనే అతనికి జవాబిస్తాను, అతన్ని సంరక్షిస్తాను. నేను పచ్చని సరళ వృక్షం వంటి వాన్ని; నా వలనే నీకు ఫలం కలుగుతుంది.”

  6. దక్షిణ ప్రాంత ప్రజలు ఏశావు పర్వతాలను స్వాధీనం చేసుకుంటారు, దిగువ కొండ ప్రాంత ప్రజలు, ఫిలిష్తీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. వారు ఎఫ్రాయిం, సమరయ భూములను స్వాధీనం చేసుకుంటారు, బెన్యామీను వారు గిలాదును స్వాధీనం చేసుకుంటారు.

  7. నేను ఎఫ్రాయింలో రథాలు లేకుండా చేస్తాను యెరూషలేములో యుద్ధ గుర్రాలు లేకుండా చేస్తాను యుద్ధపు విల్లు విరిగిపోతుంది. ఆయన దేశాలకు సమాధానాన్ని ప్రకటిస్తారు. ఆయన రాజ్యం సముద్రం నుండి సముద్రం వరకు నది నుండి భూమి అంచుల వరకు ఉంటుంది.

  8. నా విల్లును వంచినట్లు నేను యూదాను వంచుతాను ఎఫ్రాయిము అనే నా బాణంతో దానిని నింపుతాను. సీయోనూ, నీ కుమారులను పురికొల్పి నిన్ను యోధుని కత్తిలా మార్చుతాను; గ్రీసు దేశస్థులారా! సీయోను కుమారులను మీ మీదికి పురికొల్పుతాను.

  9. ఎఫ్రాయిమువారు వీరుల్లా అవుతారు, ద్రాక్షరసం త్రాగినట్లుగా వారి హృదయాలు సంతోషిస్తాయి. వారి పిల్లలు అది చూసి సంతోషిస్తారు; యెహోవాను బట్టి వారి హృదయాలు ఆనందిస్తాయి.

  10. కాబట్టి యేసు అప్పటినుండి యూదుల మధ్య బహిరంగంగా తిరగలేదు. కానీ అక్కడి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిం అనే గ్రామంలో తన శిష్యులతో ఉన్నారు.