కంటెంట్‌కు వెళ్లండి

Ephraim

160 వచనాలు · 9 కుటుంబ సభ్యులు

Ephraim ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇశ్రాయేలీయుల అహంకారం వారికి విరోధంగా సాక్ష్యమిస్తుంది; ఇశ్రాయేలీయులు, ఎఫ్రాయిమువారు కూడా తమ పాపంలో తడబడతారు; యూదా కూడా వారితో తడబడుతుంది.

  2. దండన రోజున ఎఫ్రాయిం పాడైపోతుంది. తప్పనిసరిగా జరగబోయే దానిని నేను ఇశ్రాయేలు గోత్రాలకు ప్రకటిస్తున్నాను.

  3. ఎఫ్రాయిమీయులు విగ్రహాల వెంట వెళ్తున్నారు కాబట్టి వారు హింసించబడతారు, తీర్పులో త్రొక్కబడతారు.

  4. నేను ఎఫ్రాయిం వారికి చిమ్మెట పురుగులా ఉన్నాను, యూదా ప్రజలకు కుళ్లు పట్టించే తెగులుగా ఉంటాను.

  5. “ఎఫ్రాయిం తన రోగాన్ని, యూదా తన పుండ్లను చూసుకున్నప్పుడు, ఎఫ్రాయిం అష్షూరు వైపు తిరిగి గొప్ప రాజును సహాయం కోరాడు. అయితే అతడు నిన్ను బాగుచేయలేదు, నీ పుండ్లను స్వస్థపరచలేదు.

  6. ఎందుకంటే నేను ఎఫ్రాయిముకు సింహంలా యూదాకు కొదమసింహంలా ఉంటాను. నేను వారిని ముక్కలుగా చీల్చి వెళ్లిపోతాను; వారిని మోసుకెళ్తాను, వారిని కాపాడేవారెవరూ ఉండరు.

  7. “ఎఫ్రాయిమూ, నిన్ను నేనేం చేయాలి? యూదా, నిన్ను నేనేం చేయాలి? మీ ప్రేమ ప్రొద్దున వచ్చే పొగమంచులా, ఉదయకాలపు మంచులా అదృశ్యమవుతుంది.

  8. నేను ఇశ్రాయేలులో ఘోరమైన విషయాన్ని చూశాను: అక్కడ ఎఫ్రాయిం వ్యభిచారానికి అప్పగించుకుంది, ఇశ్రాయేలు అపవిత్రపరచబడింది.

  9. నేను ఇశ్రాయేలును స్వస్థపరిచేటప్పుడు, ఎఫ్రాయిం పాపాలు బహిర్గతం అవుతున్నాయి, సమరయ నేరాలు బయటపడుతున్నాయి. వారు మోసం చేస్తూనే ఉంటారు, దొంగలు ఇళ్ళలో చొరబడతారు, బందిపోటు దొంగలు వీధుల్లో దోచుకుంటారు;

  10. “ఎఫ్రాయిం దేశాలతో కలిసిపోతుంది; ఎఫ్రాయిం తిరిగేయని అప్పం లాంటిది.

  11. “ఎఫ్రాయిం గువ్వ లాంటిది, బుద్ధిలేక సులభంగా మోసపోతుంది, అది ఈజిప్టును పిలుస్తుంది, అది అష్షూరు వైపు తిరుగుతుంది.

  12. వారు ఒంటరిగా తిరిగే అడవి గాడిదలా, అష్షూరుకు వెళ్లారు, ఎఫ్రాయిం తనను తాను విటులకు అమ్ముకుంది.

  13. “పాపపరిహార బలులు అర్పించడానికి ఎఫ్రాయిం అనేక బలిపీఠాలు నిర్మించింది, కాని అవే పాపం చేయడానికి కారణమయ్యాయి.

  14. వారు యెహోవా దేశంలో నిలిచి ఉండరు, ఎఫ్రాయిం ఈజిప్టుకు తిరిగి వెళ్తుంది, అష్షూరులో అపవిత్ర ఆహారాన్ని తింటుంది.

  15. నా దేవునితో పాటు ఉండే ప్రవక్త ఎఫ్రాయిం ప్రజలకు కావలివాడు, అయినప్పటికీ అతని త్రోవలన్నిట్లో ఉచ్చులు పొంచి ఉన్నాయి. తన దేవుని ఆలయంలో కూడా శత్రువులు ఉన్నారు.

  16. ఎఫ్రాయిం యొక్క ఘనత పక్షిలా ఎగిరిపోతుంది, పుట్టుక, గర్భధారణ, పిల్లలను కనడం వారిలో ఉండవు.

  17. నేను ఎఫ్రాయిమును, అందమైన స్థలంలో నాటబడిన తూరులా చూశాను. కాని ఎఫ్రాయిం తన పిల్లలను, వధించే వాని దగ్గరకు తెస్తుంది.”

  18. ఎఫ్రాయిమువారు మొత్తబడ్డారు, వారి వేరు ఎండిపోయింది, వారు ఇక ఫలించరు. ఒకవేళ వారు పిల్లలు కన్నా, వారి ప్రియమైన సంతతిని నేను నాశనం చేస్తాను.”

  19. అది అష్షూరుకు కొనిపోబడి, మహారాజుకు కానుకగా ఇవ్వబడుతుంది. ఎఫ్రాయిం అవమానించబడుతుంది; ఇశ్రాయేలు తాను చేసిన తప్పుడు ఆలోచనలను బట్టి సిగ్గుపడుతుంది.

  20. ఎఫ్రాయిం శిక్షణ పొందిన పెయ్యలా ఉంది, నూర్పిడి అంటే దానికి ఇష్టం; కాబట్టి దాని నున్నటి మెడ మీద నేను కాడి పెడతాను, నేను ఎఫ్రాయిం మీద స్వారీ చేస్తాను, యూదా భూమిని దున్నాలి, యాకోబు భూమిని చదును చేయాలి.

  21. ఎఫ్రాయిం ప్రజలను చేయి పట్టుకుని, నడవడం నేర్పింది నేనే; అయితే వారిని స్వస్థపరచింది నేనని వారు గ్రహించలేదు.

  22. “ఎఫ్రాయిమూ, నిన్ను ఎలా వదిలేయగలను? ఇశ్రాయేలూ, నిన్ను ఎలా అప్పగించగలను? నిన్ను ఎలా అద్మాలా పరిగణించగలను? సెబోయిములా నిన్ను ఎలా చేయగలను? నా హృదయం నాలో మారింది; నా జాలి అంతా ఉప్పొంగుతుంది.

  23. నేను నా కోపాగ్నిని చూపించను, ఎఫ్రాయిమును మరలా నాశనం చేయను. నేను దేవుడను, మనిషిని కాను, మీ మధ్య ఉన్న పరిశుద్ధ దేవుడను. నేను వారి పట్టణాలకు విరుద్ధంగా రాను.

  24. ఎఫ్రాయిం అబద్ధాలతో నన్ను చుట్టుముట్టింది, ఇశ్రాయేలు మోసంతో నన్ను ఆవరించింది. యూదా దేవునికి విరుద్ధంగా ఉంది, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు.

  25. ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు; అతడు రోజంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు, విస్తారంగా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడు. అతడు అష్షూరుతో ఒప్పందం చేస్తున్నాడు ఈజిప్టుకు ఒలీవనూనె పంపిస్తున్నాడు.