కంటెంట్‌కు వెళ్లండి

The Tribe Of Reuben గురించి బైబిల్ వచనాలు

119 వచనాలు · 24 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కానీ వారు ఒకవేళ ఆయుధాలు ధరించి మీతో దాటకపోతే, వారు కనానులో మీ దగ్గర తమ స్వాస్థ్యాన్ని అంగీకరించాలి.”

  2. గాదీయులు, రూబేనీయులు జవాబిస్తూ ఇలా అన్నారు, “యెహోవా చెప్పినది మీ సేవకులమైన మేము చేస్తాము.

  3. ఆయుధాలు ధరించి యెహోవా ఎదుట కనాను లోనికి వెళ్తాము, కానీ మేము వారసత్వంగా సంపాదించుకునే స్వాస్థ్యం యొర్దానుకు ఇటువైపు ఉంటుంది.”

  4. అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడైన మనష్షే అర్థగోత్రానికి అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని దాని పట్టణాలు, వాటి సరిహద్దులతో సహా ఆ స్థలాన్నంతటిని ఇచ్చాడు.

  5. రూబేనీయులు నిర్మించిన పట్టణాలు హెష్బోను, ఎల్యాలెహు, కిర్యతాయిము,

  6. అలాగే నెబో, బయల్-మెయోను (ఈ పేర్లు మార్చబడ్డాయి) షిబ్మా అనే పట్టణాలను నిర్మించుకున్నారు. వారు తిరిగి కట్టుకున్న పట్టణాలకు వారు పేర్లు పెట్టుకున్నారు.

  7. అయితే రూబేనీయులకు, గాదీయులకు గిలాదు నుండి అర్నోను వాగు లోయ మధ్య వరకు, యబ్బోకు నది వరకు, అమ్మోనీయుల సరిహద్దు వరకు నేను ఇచ్చాను.

  8. దాని పశ్చిమ సరిహద్దు కిన్నెరెతు నుండి పిస్గా కొండచరియల తూర్పున, మృత సముద్రమనే అరాబా సముద్రం వరకు వ్యాపించి ఉన్న అరాబాలోని యొర్దాను నది.

  9. ఆ సమయంలో నేను యొర్దాను తూర్పున నివసిస్తున్న గోత్రాలకు మీకు ఇలా ఆజ్ఞాపించాను: “మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోవడానికి మీకు ఈ దేశాన్ని ఇచ్చారు. అయితే మీలో ధృడమైనవారు, యుద్ధానికి సిద్ధపడినవారు ఇతర ఇశ్రాయేలీయులకు ముందుగా నది దాటాలి.

  10. అయితే యెహోవా మీకు విశ్రాంతి ఇచ్చినట్టు మీ సోదరులకును విశ్రాంతి ఇచ్చేవరకు, అంటే యొర్దాను అవతల మీ దేవుడైన యెహోవా వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునేవరకు మీ భార్యలు, మీ పిల్లలు మీ పశువులు నేను మీకిచ్చిన పట్టణాల్లోనే ఉండాలి. ఆ తర్వాత నేను మీకు ఇచ్చిన స్వాస్థ్యాలకు ప్రతి ఒక్కరు తిరిగి వెళ్లవచ్చు.”

  11. Until the LORD have given rest unto your brethren, as well as unto you, and until they also possess the land which the LORD your God hath given them beyond Jordan: and then shall ye return every man unto his possession, which I have given you.

  12. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వారు ఏబాలు పర్వతం మీద నిలబడి, శాపాలు పలకాలి.

  13. “రూబేను చనిపోకుండ బ్రతికి ఉండును గాక, అతని ప్రజల సంఖ్య తగ్గకుండును గాక.”

  14. రూబేను గోత్రం వారికి వారి వంశాల ప్రకారం మోషే వారికిచ్చింది:

  15. అర్నోను నది లోయ ప్రక్కన ఉన్న అరోయేరు లోయ మొదలుకొని ఆ లోయలో ఉన్న పట్టణం నుండి మెదెబా దగ్గరి పూర్తి మైదానం,

  16. ఇదీగాక హెష్బోను దాని మైదానంలోని పట్టణాలన్ని, దీబోను, బామోత్ బయలు బేత్-బయల్-మెయోను,

  17. యహజు, కెదేమోతు, మెఫాతు,

  18. కిర్యతాయిము, షిబ్మా లోయలో ఉన్న కొండ మీది శెరెత్ షహరు,

  19. బేత్-పెయోరు, పిస్గా కొండచరియలు, బేత్-యెషిమోతు,

  20. మైదానంలోని పట్టణాలన్ని, హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను రాజ్యం మొత్తం వారసత్వంగా ఇచ్చాడు. మోషే అతన్ని, ఆ దేశంలో నివసించిన సీహోనుతో జతకట్టిన మిద్యానీయుల ప్రధానులైన ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ అనే వారిని ఓడించాడు.

  21. ఇశ్రాయేలీయులు యుద్ధంలో చంపినవారితో పాటు, బెయోరు కుమారుడైన భవిష్యవాణి చెప్పే బిలామును కత్తితో చంపారు.

  22. రూబేనీయుల సరిహద్దు యొర్దాను నది తీరము. ఈ పట్టణాలు, వాటి గ్రామాలు రూబేనీయులకు వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఇవ్వబడ్డాయి.

  23. అప్పుడు యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రం వారిని పిలిపించి,

  24. వారితో, “యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు చేశారు, నేనిచ్చిన ప్రతి ఆజ్ఞకు లోబడ్డారు.

  25. చాలా కాలం క్రితం నుండి నేటి వరకు మీరు మీ తోటి ఇశ్రాయేలీయులను విడిచిపెట్టకుండా మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించారు.