కంటెంట్‌కు వెళ్లండి

The Jews గురించి బైబిల్ వచనాలు: Obliged to unite against enemies

51 వచనాలు · 158 కోణాలు

Obliged to unite against enemies గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు మోషే వారితో, “మీరు ఇలా చేస్తే అంటే మీరు యుద్ధం కోసం యెహోవా ఎదుట సిద్ధంగా ఉంటే,

  2. ఆయుధాలు ధరించిన మీరందరూ యొర్దాను దాటి యెహోవా తన శత్రువులను తన ఎదుట నుండి తరిమికొట్టే వరకు యొర్దానును దాటితే,

  3. దేశం యెహోవా ఎదుట వశపరచబడినప్పుడు, మీరు తిరిగివచ్చి యెహోవాకు, ఇశ్రాయేలుకు మీ బాధ్యత నుండి విముక్తి పొందవచ్చు. ఈ దేశం యెహోవా ఎదుట మీకు స్వాస్థ్యంగా ఉంటుంది.

  4. అప్పుడు ఇశ్రాయేలీయులందరు, దాను నుండి బెయేర్షేబ వరకు ఉన్నవారు, గిలాదు ప్రదేశంలో ఉన్నవారు, అంతా ఏకమై మిస్పా దగ్గర యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు.

  5. ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నాయకులు, నాలుగు లక్షలమంది ఆయుధాలు కలిగి దేవుని ప్రజల సమావేశానికి హాజరయ్యారు.

  6. ఇశ్రాయేలీయులు మిస్పాకు వెళ్లారని బెన్యామీనీయులు విన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఈ నీచమైన పని ఎలా జరిగిందో మాకు చెప్పండి” అన్నారు.

  7. చంపబడిన స్త్రీ భర్తయైన లేవీయుడు మాట్లాడుతూ అన్నాడు, “నేను, నా ఉంపుడుగత్తె రాత్రి గడుపుదామని బెన్యామీనులోని గిబియాకు వచ్చాము.

  8. రాత్రివేళ గిబియా నాయకులు నా వెంటపడి నన్ను చంపాలనుకొని ఇంటిని చుట్టుముట్టారు. వారు నా ఉంపుడుగత్తెను మానభంగం చేయగా ఆమె చనిపోయింది.

  9. ఇశ్రాయేలులో ఇలాంటి దుర్మార్గం, అవమానకరమైన పనివారు చేశారు కాబట్టి నా ఉంపుడుగత్తెను తీసుకెళ్లి ఆమెను ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్కను ఇశ్రాయేలీయుల వారసత్వ ప్రాంతాలకు పంపాను.

  10. ఇప్పుడు, ఇశ్రాయేలీయులైన మీరంతా మాట్లాడి ఏమి చేయాలని నిర్ణయించారో చెప్పండి” అన్నాడు.

  11. అప్పుడు ప్రజలంతా ఏకమై లేచి, “మనలో ఎవ్వరూ తమ గుడారానికి గాని ఇళ్ళకు గాని తిరిగి వెళ్లరు.

  12. అయితే గిబియాకు మనం చేసేది ఇది: చీట్లు వేసి దాని ప్రకారం మనం గిబియా మీద దాడి చేద్దాము.

  13. ఆహారం తీసుకురావడానికి ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నుండి వందమందికి పదిమందిని, వెయ్యిమందికి వందమందిని, పదివేలమందికి వెయ్యిమందిని ఎన్నుకుందాము. అప్పుడు సైన్యం బెన్యామీనులోని గెబాకు చేరుకుంటారు, ఇశ్రాయేలులో వారు చేసిన అవమానకరమైన పనిని బట్టి వారిని శిక్షిస్తారు” అని అన్నారు.

  14. కాబట్టి ఇశ్రాయేలీయులందరు ఏకమై లేచి పట్టణానికి వ్యతిరేకంగా కూడుకున్నారు.

  15. ఇశ్రాయేలు గోత్రాల వారు బెన్యామీను గోత్రమంతటికి దూతలను పంపి అన్నారు, “మీ మధ్య జరిగిన ఈ నీచమైన నేరం సంగతి ఏమిటి?

  16. ఇప్పుడు గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించండి, మేము వారిని చంపి ఇశ్రాయేలులో ఈ దుష్టత్వం లేకుండా చేస్తాము.” కాని బెన్యామీనీయులు తమ తోటి ఇశ్రాయేలీయుల మాట వినలేదు.

  17. ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి, బెన్యామీనీయులు తమ పట్టణాల నుండి గిబియా దగ్గరకు కలిసి వచ్చారు.

  18. ఆ రోజు గిబియాలో నివసిస్తున్న ఏడువందలమంది శూరులకు అధనంగా బెన్యామీనీయులు తమ పట్టణాల నుండి కత్తియుద్ధం చేయగలిగే ఇరవై ఆరు వేలమందిని పోగుచేసుకున్నారు.

  19. వీరందరిలో ఎడమచేతి వాటంగల వారు ఏడువందలమంది ప్రత్యేకమైన వారున్నారు, ఒక్కొక్కరు వడిసెలలో రాయి పెట్టి, తల వెంట్రుకలనైనా గురి తప్పకుండా కొట్టగలరు.

  20. బెన్యామీను వారు కాకుండా, ఇశ్రాయేలు వారు కత్తియుద్ధం చేయగలిగే, అనుభవజ్ఞులైన నాలుగు లక్షల మందిని పోగుచేసుకున్నారు.

  21. ఇశ్రాయేలీయులు బేతేలుకు వెళ్లి దేవుని దగ్గర విచారణ చేస్తూ, “బెన్యామీనీయుల మీద యుద్ధానికి మాలో ఎవరు ముందు వెళ్లాలి?” అని అడిగారు. యెహోవా జవాబిస్తూ, “యూదా వారే ముందు వెళ్లాలి” అన్నారు.

  22. మరుసటిరోజు ఉదయం ఇశ్రాయేలీయులు లేచి గిబియా దగ్గర మకాం వేశారు.

  23. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి గిబియా దగ్గర వారికి ఎదురుగా బారులు తీరారు.

  24. ఆ రోజు బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి, యుద్ధభూమిలో ఇరవైరెండువేలమంది ఇశ్రాయేలీయులను హతం చేశారు.

  25. అయితే ఇశ్రాయేలీయులు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని మొదట రోజున ఉన్న చోటనే మళ్ళీ యుద్ధానికి బారులు తీరారు.