కంటెంట్‌కు వెళ్లండి

The Jews గురించి బైబిల్ వచనాలు: Under God's special protection

9 వచనాలు · 158 కోణాలు

"The Jews" కోసం వెతకండి

Under God's special protection గురించి వచనాలు

  1. శాశ్వతమైన దేవుడు నీకు ఆశ్రయం, నిత్యమైన హస్తాలు నీ క్రింద ఉన్నాయి. ‘వారిని నాశనం చెయ్యండి!’ అంటూ ఆయన నీ శత్రువులను నీ ఎదుట నుండి తరిమివేస్తారు.

  2. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా నివసిస్తారు; ధాన్యం క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశంలో యాకోబు ఊట క్షేమంగా ఉంటుంది, అక్కడ ఆకాశం మంచు కురిపిస్తుంది.

  3. ఇశ్రాయేలూ, మీరు ధన్యులు! యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారు ఎవరు? ఆయన మీకు డాలు, సహాయకుడు మీ మహిమగల ఖడ్గము. మీ శత్రువులు మీ ఎదుట భయపడతారు; మీరు వారి వీపుపై త్రొక్కుతారు.”

  4. వారు దేశం నుండి దేశానికి, ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి తిరిగారు.

  5. ఆయన ఎవరినీ వారికి హాని చేయనివ్వలేదు; వారి కోసం ఆయన రాజులను మందలించారు:

  6. “నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు; నా ప్రవక్తలకు హాని చేయకూడదు.”

  7. ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు, నిన్ను కాపాడేవాడు కునుకడు.

  8. నిజానికి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కునుకడు న్రిదపోడు.

  9. యెహోవా నిన్ను కాపాడతారు, యెహోవా మీ కుడి వైపున మీకు నీడగా ఉంటారు.