The Jews గురించి బైబిల్ వచనాలు: Had an ecclesiastical establishment
Had an ecclesiastical establishment గురించి వచనాలు
నేను లేవీయులకు చేసిన ఒడంబడిక ఉండిపోయేలా నేనే మీకు ఈ ఆజ్ఞ ఇచ్చానని మీరు తెలుసుకుంటారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.
నేను లేవీయులతో చేసిన నిబంధన జీవానికి సమాధానానికి సంబంధించింది. వారు నా పట్ల భయభక్తులు చూపాలని అవి వారికి ఇచ్చాను. అప్పుడు వారు నన్ను గౌరవించి నా పేరు పట్ల భయభక్తులు కలిగివుంటారు.
సత్యమైన ఉపదేశం వారి నోటి నుండి వెలువడిందే తప్ప దుర్బోధ ఏమాత్రం కాదు. వారు సమాధానంతో నిజాయితీ కలిగి నా సహవాసంలో నడిచారు. వారు అనేకులను పాపం విడిచిపెట్టేలా చేశారు.
“యాజకులు సైన్యాలకు అధిపతియైన యెహోవా దూతలు. ఎందుకంటే మనుష్యులు వారి నోట ధర్మశాస్త్రం విని నేర్చుకుంటారు. కాబట్టి వారు జ్ఞానాన్ని కలిగి బోధించాలి.