Skip to content

The Jews గురించి బైబిల్ వచనాలు: Abraham

7 వచనాలు · 158 కోణాలు

Abraham గురించి వచనాలు

  1. యెహోవా అబ్రాముతో ఇలా అన్నారు, “నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు.

  2. “నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను; నీ పేరును గొప్పగా చేస్తాను, నీవు దీవెనగా ఉంటావు.

  3. నిన్ను దీవించే వారిని దీవిస్తాను, శపించే వారిని శపిస్తాను; నిన్ను బట్టి భూమి మీద ఉన్న సర్వ జనాంగాలు దీవించబడతారు.”

  4. లోతు అబ్రాము నుండి విడిపోయిన తర్వాత యెహోవా అబ్రాముతో, “నీవున్న చోట నుండి ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిశలు చూడు.

  5. నీవు చూస్తున్న భూమంతా నీకు, నీ సంతానానికి శాశ్వతంగా ఇస్తాను.

  6. నీ సంతానాన్ని భూమి మీద ఉన్న ఇసుక రేణువుల్లా అంటే ఒకవేళ ఎవరైనా లెక్కించాలనుకున్నా లెక్కించలేనంత విస్తారంగా చేస్తాను.

  7. నీవు లేచి దేశం యొక్క అన్ని దిక్కులకు వెళ్లు, అదంతా నేను నీకు ఇస్తున్నాను” అని అన్నారు.