కంటెంట్‌కు వెళ్లండి

Praise గురించి బైబిల్ వచనాలు

490 వచనాలు · 106 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నీతిమంతుల గుడారాల్లో రక్షణానంద కేకలు ప్రతిధ్వనిస్తాయి: “యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది!

  2. నా కొరకు నీతిమంతుల గుమ్మాలను తెరవండి; నేను లోపలికి ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తాను.

  3. ఇది యెహోవా గుమ్మం నీతిమంతులు దీని గుండా ప్రవేశిస్తారు.

  4. మీరు నాకు జవాబిచ్చారు, కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; మీరు నాకు రక్షణ అయ్యారు.

  5. మీరు నా దేవుడు, నేను మిమ్మల్ని స్తుతిస్తాను; మీరు నా దేవుడు, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను.

  6. యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  7. నేను మీ నీతి న్యాయవిధులను తెలుసుకున్న కొలది యథార్థ హృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను.

  8. మీ నీతిగల న్యాయవిధులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి నేను మధ్యరాత్రి లేస్తున్నాను.

  9. యెహోవా, నా నోటి యొక్క ఇష్టపూర్వకమైన స్తుతిని స్వీకరించండి, మీ న్యాయవిధులు నాకు బోధించండి.

  10. రోజుకు ఏడుసార్లు మిమ్మల్ని స్తుతిస్తాను ఎందుకంటే మీ న్యాయవిధులు నీతియుక్తమైనవి.

  11. నా పెదవులు స్తుతితో పొంగిపారును గాక, ఎందుకంటే మీరు మీ శాసనాలను నాకు బోధిస్తారు.

  12. నా నాలుక మీ మాటను పాడును గాక, ఎందుకంటే మీ ఆజ్ఞలన్నియు నీతియుక్తమైనవి.

  13. నేను మిమ్మల్ని స్తుతించేలా నన్ను బ్రతకనివ్వండి, మీ న్యాయవిధులు నన్ను సంరక్షిస్తాయి.

  14. వారి పళ్లు మనల్ని చీల్చివేయటానికి అనుమతించని యెహోవాకు స్తుతి చెల్లును గాక.

  15. యాత్రకీర్తన. యెహోవా మందిరంలో రాత్రంతా సేవించే యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి.

  16. పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించండి.

  17. యెహోవాను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి; యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి,

  18. యెహోవా మందిరంలో, మన దేవుని మందిర ఆవరణాల్లో సేవ చేసేవారలారా, ఆయనను స్తుతించండి.

  19. యెహోవా మంచివాడు కాబట్టి యెహోవాను స్తుతించండి; ఆయన నామానికి స్తుతులు పాడండి, అది మనోహరమైనది.

  20. ఓ ఇశ్రాయేలు గృహమా, యెహోవాను స్తుతించు; ఓ అహరోను గృహమా, యెహోవాను స్తుతించు;

  21. ఓ లేవీ గృహమా, యెహోవాను స్తుతించు; యెహోవాకు పట్ల భయము కలవారలారా, యెహోవాను స్తుతించండి.

  22. సీయోనులో నుండి యెహోవా స్తుతించబడును గాక, ఆయన యెరూషలేములో నివసిస్తారు. యెహోవాను స్తుతించండి.

  23. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  24. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  25. ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞత చెల్లించండి: ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.