కంటెంట్‌కు వెళ్లండి

Praise గురించి బైబిల్ వచనాలు: In heaven

40 వచనాలు · 106 కోణాలు

"Praise" కోసం వెతకండి

In heaven గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీరు మాత్రమే యెహోవా. మీరే మహాకాశాలను, ఆకాశాలను, వాటి నక్షత్ర సమూహాలన్నిటిని, భూమిని, దానిలో ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించారు. వాటన్నిటికి జీవాన్ని ఇచ్చారు. పరలోక సమూహాలన్ని మిమ్మల్ని ఆరాధిస్తున్నాయి.

  2. When the morning stars sang together, and all the sons of God shouted for joy?

  3. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలను ఆలకించి, ఆయన మాటలను నెరవేర్చే బలశూరులైన దూతలారా, ఆయనను స్తుతించండి.

  4. యెహోవా సైన్యమా, ఆయన చిత్తం నెరవేర్చే సేవకులారా, మీరంతా యెహోవాను స్తుతించండి.

  5. యెహోవా యొక్క సమస్త దేవదూతలారా, ఆయనను స్తుతించండి; పరలోక సైన్యములారా, ఆయనను స్తుతించండి.

  6. ఉన్నత ఆకాశాల్లారా, అంతరిక్షానికి పైన ఉన్న జలాల్లారా ఆయనను స్తుతించండి.

  7. వారు ఒకరితో ఒకరు, “సైన్యాల యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు; సమస్త భూమి ఆయన మహిమతో నిండి ఉంది” అని పాడుతున్నారు.

  8. ఆత్మ నన్ను పైకెత్తగా నా వెనుక ఆయన ఉన్న స్థలం నుండి యెహోవా మహిమకు స్తోత్రం కలుగుతుంది అనే గొప్ప గర్జన లాంటి శబ్దం వినిపించింది.

  9. అప్పుడు అకస్మాత్తుగా ఆ దూతతో పాటు ఆకాశంలో దూతల గొప్ప సమూహం కనబడి, ఈ విధంగా దేవుని స్తుతించారు,

  10. “అత్యున్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైనవారికి భూమి మీద సమాధానం కలుగును గాక.”

  11. అదే విధంగా, పశ్చాత్తాపం అవసరంలేని తొంభై తొమ్మిది నీతిమంతుల కంటే, పశ్చాత్తాపపడిన ఒక పాపిని బట్టి పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది అని నేను మీతో చెప్తున్నాను” అన్నారు.

  12. అలాగే పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగిన ఒక పాపిని గురించి దేవుని దూతల మధ్య సంతోషం కలుగుతుంది అని మీతో చెప్తున్నాను” అన్నారు.

  13. తన తండ్రియైన దేవునికి పరిచర్య చేసే యాజకుల రాజ్యంగా మనల్ని చేసిన ఆయనకే మహిమా ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.

  14. ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ ఆ రెక్కల క్రింద కళ్లతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు ఆపకుండా నిరంతరం ఇలా అంటున్నాయి:

  15. ఆ ప్రాణులు సింహాసనం మీద ఆసీనుడై ఎల్లకాలం జీవిస్తున్న దేవాది దేవునికి మహిమ, ఘనత కృతజ్ఞతలు అర్పిస్తుండగా,

  16. ఇరవైనలుగురు పెద్దలు లేచి సింహాసనం మీద ఆసీనుడై ఎల్లకాలం జీవిస్తున్నవాని ముందు సాగిలపడి ఆరాధిస్తూ, గౌరవంతో తమ కిరీటాలు తీసి ఆ సింహాసనం ముందు వేసి ఇలా చెప్పారు:

  17. “ఓ ప్రభువా, మా దేవా! నీవు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్త ప్రకారమే అవి సృష్టించబడ్డాయి, కాబట్టి మహిమ, ఘనత, ప్రభావాలు పొందడానికి నీవే యోగ్యుడవు.”

  18. వారు ఒక క్రొత్త పాటను పాడారు, “చుట్టబడి ఉన్న ఆ గ్రంథపుచుట్టను తీసుకుని, దాని ముద్రలను తెరవడానికి నీవే యోగ్యుడవు! ఎందుకంటే ప్రతి గోత్రం నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి దేశంలోని ప్రజలను, దేవుని కోసం విడిపించడానికి నీవు వధించబడి నీ రక్తంతో కొన్నావు.

  19. నీవు వారిని దేవుని సేవించే రాజ్యంగా యాజకులుగా చేశావు, భూమిని పరిపాలించడానికి వారిని నియమించావు.”

  20. అప్పుడు నేను చూస్తూ ఉండగా, సింహాసనం చుట్టూ ఉన్న నాలుగు ప్రాణుల పెద్దల చుట్టూ ఉన్న వేలాదివేల కోటానుకోట్ల దేవదూతల స్వరం నాకు వినబడింది.

  21. వారు పెద్ద స్వరంతో ఇలా అంటున్నారు: “శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, గౌరవం, మహిమ, స్తుతులను పొందడానికి యోగ్యుడు వధించబడిన గొర్రెపిల్లయే!”

  22. అప్పుడు పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద, సముద్రంలో ఉన్న సృష్టించబడిన ప్రతి ప్రాణి, అనగా వాటిలో ఉన్న సమస్తం ఇలా చెప్తుండగా నేను విన్నాను: “సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవానికి, వధించబడిన గొర్రెపిల్లకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం,

  23. ఆ నాలుగు ప్రాణులు, “ఆమేన్” అని చెప్పాయి, అప్పుడు ఆ పెద్దలందరు సాగిలపడి ఆరాధించారు.

  24. ఈ సంగతుల తర్వాత ఒక గొప్ప జనసమూహం లెక్కపెట్టడానికి అసాధ్యమైనంత మంది ప్రజలు ప్రతి దేశం నుండి, ప్రతి గోత్రం నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి వచ్చారు. వారు తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూర మట్టలు చేతపట్టుకుని సింహాసనం ముందు వధించబడిన గొర్రెపిల్ల ముందు నిలబడి ఉండడం నేను చూశాను.

  25. వారు తమ స్వరాలను ఎత్తి బిగ్గరగా ఇలా అన్నారు: “సింహాసనం మీద ఆసీనుడైన మా దేవునికి, వధించబడిన గొర్రెపిల్లకే, రక్షణ చెందుతుంది.”