Praise గురించి బైబిల్ వచనాలు: With gladness
With gladness గురించి వచనాలు
దావీదు, దీర్ఘదర్శియైన ఆసాపు వ్రాసిన కీర్తనలు పాడి యెహోవాను స్తుతించాలని లేవీయులకు హిజ్కియారాజు అధికారులు ఆదేశించారు. వారు ఆనందంతో స్తుతిగానం చేస్తూ తలలు వంచి ఆరాధించారు.
సంతోషకరమైన శబ్దాలు, ఆనంద ధ్వనులు, వధూవరుల స్వరాలు మరోసారి వినిపిస్తాయి. వారు యెహోవా ఆలయానికి కృతజ్ఞతార్పణలు తీసుకువస్తూ, “సైన్యాల యెహోవాకు స్తుతులు చెల్లించండి, యెహోవా మంచివాడు; ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది” అంటారు. ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను’ అని యెహోవా అంటున్నారు.