కంటెంట్‌కు వెళ్లండి

Praise గురించి బైబిల్ వచనాలు

490 వచనాలు · 106 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా యొక్క మారని ప్రేమ కోసం మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,

  2. యెహోవా యొక్క మారని ప్రేమ కోసం మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,

  3. ప్రజా సమాజాలలో ఆయనకే మహిమ. పెద్దల సభలలో ఆయనకే ప్రఖ్యాతి!

  4. ఒక గీతము. దావీదు కీర్తన. ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది; నా ప్రాణమంతటితో నేను పాడతాను సంగీతం వాయిస్తాను.

  5. సితారా వీణా, మేలుకోండి! ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను.

  6. యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను; జనాంగాల మధ్య మీ గురించి నేను పాడతాను.

  7. నేను నోరార యెహోవాను కీర్తిస్తాను; ఆరాధికుల గొప్ప సమూహంలో నేను ఆయనను స్తుతిస్తాను.

  8. యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో సమాజంలో నేను హృదయమంతటితో యెహోవాను స్తుతిస్తాను.

  9. యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం; ఆయన కట్టడలను పాటించేవారు మంచి గ్రహింపు కలిగి ఉంటారు. స్తుతి నిత్యం ఆయనకే చెందును.

  10. యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి; యెహోవా నామాన్ని స్తుతించండి.

  11. ఇప్పుడు ఎల్లప్పుడు సదా యెహోవా నామం స్తుతింపబడును గాక.

  12. సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు, యెహోవా నామం స్తుతింపబడును గాక.

  13. మనమే యెహోవాను కీర్తించేవారం, ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము. యెహోవాను స్తుతించండి.

  14. యెహోవా నాకు చేసిన అంతటిని బట్టి నేను ఆయనకు తిరిగి ఏమివ్వగలను?

  15. నేను రక్షణ పాత్రను పైకెత్తి యెహోవా పేరట మొరపెడతాను.

  16. ఆయన ప్రజలందరి సమక్షంలో, నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు తీర్చుకుంటాను.

  17. నేను మీకు కృతజ్ఞతార్పణ అర్పిస్తాను యెహోవా నేను మీ పేరట మొరపెడతాను.

  18. ఆయన ప్రజలందరి సమక్షంలోను, యెహోవా మందిర ఆవరణాల్లోను, యెరూషలేమా, మీ మధ్యను, నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి.

  19. In the courts of the LORD'S house, in the midst of thee, O Jerusalem. Praise ye the LORD.

  20. సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి; సర్వజనులారా, ఆయనను కీర్తించండి.

  21. మన పట్ల ఆయన మారని ప్రేమ గొప్పది, ఆయన నమ్మకత్వం నిరంతరం నిలుస్తుంది. యెహోవాను స్తుతించండి.

  22. యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  23. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని ఇశ్రాయేలీయులు చెప్పుదురు గాక.

  24. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అహరోను వంశం చెప్పుదురు గాక.

  25. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని యెహోవాకు భయపడేవారు చెప్పుదురు గాక.