Skip to content

Murmuring గురించి బైబిల్ వచనాలు

170 వచనాలు · 31 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు సమాధిని చేరినప్పుడు ఆనందంతో నింపబడి సంతోషిస్తారు.

  2. మరుగుచేయబడిన మార్గంగలవానికి దేవుడు చుట్టూ కంచెవేసినవానికి జీవం ఎందుకు ఇవ్వబడింది?

  3. నిట్టూర్పే నా అనుదిన భోజనంగా మారింది. నా మూలుగులు నీళ్లలా పారుతున్నాయి.

  4. దేనికి భయపడ్డానో అదే నా మీదికి వచ్చింది; దేని గురించి దిగులుపడ్డానో అదే నాకు కలిగింది.

  5. నాకు నెమ్మది లేదు సుఖం లేదు; విశ్రాంతి లేదు, ఉన్నది ఆందోళన మాత్రమే.”

  6. దేవుని ఓదార్పులు నీకు సరిపోవడం లేదా? ఆయన మృదువైన మాటలు సరిపోవడం లేదా?

  7. దేవుని మీద కోప్పడి, ఇలాంటి మాటలు నీ నోటి నుండి వచ్చేలా, నీ హృదయం ఎందుకు క్రుంగిపోయింది నీ కళ్లు ఎందుకు ఎర్రబడ్డాయి?

  8. That thou turnest thy spirit against God, and lettest such words go out of thy mouth?

  9. “కాని ఈ విషయంలో నీవు తప్పు, ఎందుకంటే దేవుడు మానవుల కంటే గొప్పవాడు.

  10. ఒకని మాటలకు ఆయన స్పందించరని ఎందుకు నీవు ఆయనకు ఫిర్యాదు చేస్తావు?

  11. అతడు తన పాపానికి తిరుగుబాటును జతచేశాడు; అతడు మన మధ్య తిరస్కారంతో చప్పట్లు కొట్టి దేవునికి విరుద్ధంగా ఎన్నో మాటలు మాట్లాడాడు.”

  12. దావీదు కీర్తన. దుష్టులను బట్టి బాధపడకు తప్పు చేసేవారిని చూసి అసూయపడకు;

  13. కాని ఇప్పుడైతే మీరు మమ్మల్ని త్రోసివేసి అవమానపరిచారు; మా సైన్యంతో మీరు రావడం లేదు.

  14. శత్రువుల ముందు పారిపోవలసి వచ్చింది, పగవారు మమ్మల్ని దోచుకున్నారు.

  15. గొర్రెలను ఆహారంగా ఇచ్చినట్లు మమ్మల్ని వారికిచ్చారు దేశాల మధ్యకు మమ్మల్ని చెదరగొట్టారు.

  16. లాభం చూసుకోకుండా నీ ప్రజలను, తక్కువ వెలకు అమ్మేశారు.

  17. పొరుగువారు మమ్మల్ని నిందించేలా చేశారు; మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని ఎగతాళి చేసేలా చేశారు.

  18. మమ్మల్ని జనాల నోట సామెతలా చేశారు; జనాంగాలు తలలూపుతూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు.

  19. నిందిస్తూ హేళన చేసేవారి కారణంగా పగ తీర్చుకోవాలనుకునే శత్రువుల కారణంగా శత్రువులు మా ఎదుటకు వస్తే, దినమంతా మాకు అవమానమే; సిగ్గు మా ముఖాన్ని కమ్మివేసింది.

  20. For the voice of him that reproacheth and blasphemeth; by reason of the enemy and avenger.

  21. ఇదంతా మా మీదికి వచ్చిపడినా, మేము మిమ్మల్ని మరవలేదు; మీ నిబంధన విషయం నమ్మకద్రోహులం కాలేదు.

  22. మా హృదయం వెనుదీయలేదు; మా పాదాలు మీ మార్గం నుండి తొలగిపోలేదు.

  23. నక్కలు తిరిగే చోట మీరు మమ్మల్ని నలగ్గొట్టి పడేశారు; చావు నీడ మమ్మల్ని ఆవరించి ఉన్నది.

  24. ఒకవేళ మేము మా దేవుని పేరు మరచినా, పరదేశి దేవుని వైపు చేతులు చాపినా,

  25. హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఆ విషయాన్ని తెలుసుకోకుండ ఉంటారా?