Skip to content

Malice గురించి బైబిల్ వచనాలు

135 వచనాలు · 29 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. బాధితులు నలిగి కుప్పకూలిపోతారు; వారు వారి బలత్కారం వల్ల పతనమవుతారు.

  2. నన్ను చూసినవారందరు నన్ను ఎగతాళి చేస్తారు; వారు వెక్కిరిస్తూ, తలలు ఊపుతూ ఎగతాళి చేస్తారు.

  3. “వాడు యెహోవాను నమ్మాడు, యెహోవా వాన్ని విడిపించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తాడు కాబట్టి, ఆయనే వాన్ని విడిపించనివ్వండి” అని వారంటున్నారు.

  4. మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తారు, నేను ఒంటరి వాడినయ్యాను.

  5. అయినాసరే వారికి జబ్బు చేసినప్పుడు, నేను గోనెపట్ట చుట్టుకున్నాను, ఉపవాసముండి నన్ను నేను తగ్గించుకున్నాను. నా ప్రార్థనలకు జవాబు రానప్పుడు,

  6. వారు నా స్నేహితులో సోదరులో అన్నట్లు నేను దుఃఖించాను. నా తల్లి కోసం ఏడుస్తున్నట్లు నేను దుఃఖంతో క్రుంగిపోయాను.

  7. నేను తడబడినప్పుడు వారు సంతోషంతో సమకూడారు; నాకు తెలియకుండానే దుండగులు నా మీదికి వచ్చారు. ఆపకుండ వారు నా మీద అపవాదు వేశారు.

  8. భక్తిహీనుల్లా వారు ద్వేషం వెళ్లగ్రక్కుతూ ఎగతాళి చేశారు; వారు నన్ను చూసి పళ్ళు కొరికారు.

  9. కారణం లేకుండా నాకు శత్రువులైనవారిని నన్ను చూసి సంతోషించనివ్వకండి. కారణం లేకుండా నన్ను ద్వేషించేవారు దురుద్దేశంతో కన్నుగీట నివ్వకండి.

  10. వారు సమాధానంగా మాట్లాడరు, దేశంలో ప్రశాంతంగా నివసించే వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తారు.

  11. వారు నన్ను వెక్కిరిస్తూ “ఆహా! ఆహా! మా కళ్లతో మేము చూశాం” అని అంటారు.

  12. నా శత్రువులు, “వీడెప్పుడు చస్తాడు, వీని పేరు ఎప్పుడు చెరిగిపోతుంది?” అని నా గురించి చెప్పుకుంటున్నారు.

  13. నన్ను చూడటానికి వచ్చి అబద్ధాలాడతారు, వారు తమ హృదయంలో దుష్టత్వం నింపుకొని వస్తారు; వారు బయటకు వెళ్లినప్పుడు దానిని చెప్తారు.

  14. నా శత్రువులంతా ఏకమై నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతున్నారు; నాకు కీడును తలపెడుతున్నారు.

  15. “దుష్టమైన వ్యాధి అతనికి కలిగింది; కాబట్టి వాడు పడక నుండి మళ్ళీ లేవడు” అంటున్నారు.

  16. రాత్రింబగళ్ళు పట్టణ గోడల మీద శత్రువులు తిరుగుతున్నారు; అయితే అక్కడ దుష్టత్వం విధ్వంసం ఉన్నాయి.

  17. పట్టణంలో విధ్వంసక శక్తులు పని చేస్తున్నాయి; బెదిరింపులు మోసాలు దాని వీధుల్లో నిత్యం ఉంటాయి.

  18. రోజంతా వారు నా మాటలను వక్రీకరిస్తారు; వారి పథకాలన్నీ నా పతనం కొరకే.

  19. నా ప్రాణం తీయాలనే ఆశతో వారు కుట్ర చేస్తారు, పొంచి ఉంటారు, నా కదలికలు గమనిస్తారు.

  20. నా కోసం వారు ఎలా పొంచి ఉన్నారో చూడండి! యెహోవా, చేయని నేరం గాని పాపం గాని లేకుండానే భయంకరమైన పురుషులు నాపై కుట్ర చేస్తున్నారు.

  21. నేను ఏ తప్పు చేయలేదు, అయినా నా మీద దాడి చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నాకు సహాయం చేయడానికి లేవండి; నా దుస్థితిని చూడండి!

  22. వారు సాయంకాలం మళ్ళీ వస్తారు, కుక్కల్లా మొరుగుతూ, వేట కోసం పట్టణం చుట్టూ తిరుగుతారు.

  23. వారు వారి నోటి నుండి ఏమి చిమ్ముతారో చూడండి; వారి పెదవుల నుండి వచ్చే మాటలు పదునైన ఖడ్గాల్లాంటివి, “మా మాటలు ఎవరు వింటారు?” అని వారనుకుంటారు.

  24. ఎంతకాలం మీరు ఒక్కడి మీద దాడి చేస్తారు? వాలుతున్న గోడను, పడిపోతున్న కంచెను పడద్రోసినట్లు మీరంతా నన్ను పడద్రోస్తారు?

  25. ఖచ్చితంగా వారు నన్ను నా ఉన్నత స్థానం నుండి పడగొట్టాలని నిర్ణయించారు; వారు అబద్ధాలు చెప్పడంలో ఆనందిస్తారు. వారు నోటితో దీవిస్తారు, కాని వారి హృదయాల్లో శపిస్తారు. సెలా