Skip to content

Malice గురించి బైబిల్ వచనాలు

135 వచనాలు · 29 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దుష్టుల కుట్ర నుండి, కీడుచేసేవారి పన్నాగాల నుండి నన్ను దాచండి.

  2. వారు తమ నాలుకలను ఖడ్గాల్లా పదునుపెడతారు మరణకరమైన బాణాల వంటి క్రూరమైన పదాలను లక్ష్యంగా చేసుకుంటారు.

  3. చాటున ఉండి నిర్దోషుల మీదికి బాణాలు విసురుతారు. వారు భయం లేకుండా, అకస్మాత్తుగా బాణాలు విసురుతారు.

  4. కీడు తలపెట్టడంలో వారు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు. వారు తమ వలలను దాచడం గురించి మాట్లాడతారు; వారంటారు, “దీన్ని ఎవరు చూస్తారు?”

  5. వారు అన్యాయాలను రూపొందించి అంటారు, “మేము ఒక సంపూర్ణ ప్రణాళికను రూపొందించాము!” నిశ్చయంగా మానవుల మనస్సు హృదయం మోసపూరితమైనవి.

  6. నేను ఉపవాసముండి ఏడ్చినప్పుడు అది నా నిందకు కారణమైంది.

  7. నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు నన్ను హేళనకు సామెతగా చేశారు.

  8. గుమ్మం దగ్గర కూర్చునేవారు నన్ను ఎగతాళి చేస్తారు, త్రాగుబోతులు నా గురించి పాటలు పాడుతున్నారు.

  9. నా ప్రాణం తీయాలని కోరేవారు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.

  10. నన్ను చూసి, “ఆహా! ఆహా!” అని నాతో అనేవారు సిగ్గుపడి ఆశాభంగం పొందాలి.

  11. నా శత్రువులు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు; నన్ను చంపాలని చూసేవారంతా కలిసి కుట్ర చేస్తున్నారు.

  12. “దేవుడు అతన్ని విడిచిపెట్టారు; అతన్ని విడిపించడానికి ఒక్కరు లేరు, అతన్ని వెంటాడి పట్టుకోండి” అని వారంటారు.

  13. ఎందుకంటే దుష్టులు మోసగాళ్ళు నాకు వ్యతిరేకంగా తమ నోళ్ళు తెరిచి; అబద్ధాలాడే నాలుకలతో వారు నాకు వ్యతిరేకంగా మాట్లాడారు.

  14. ద్వేషపూరిత మాటలతో వారు నన్ను చుట్టుముడతారు; వారు కారణం లేకుండా నా మీద దాడి చేస్తారు.

  15. వారు నా ప్రేమకు ప్రతిగా నా మీద ఆరోపణలు చేస్తారు, కాని నేనైతే ప్రార్థిస్తూ ఉంటాను.

  16. నేను చేసిన మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తారు. నా ప్రేమకు ప్రతిగా ద్వేషం చూపుతారు.

  17. దయ చూపించాలని అతడు ఎప్పుడూ అనుకోలేదు; కాని అతడు నలిగినవారిని పేదవారిని వేధించాడు ధైర్యము కోల్పోయిన వారిని హతమార్చాడు.

  18. శపించటం అతనికి ఇష్టం కాబట్టి అది అతని మీదికే వచ్చింది. అతడు ఎవరినీ ఆశీర్వదించాలని కోరలేదు కాబట్టి అతడు ఆశీర్వాదాన్ని అనుభవించలేదు.

  19. అతడు శాపాన్ని వస్త్రంగా ధరించాడు; అది నీరులా అతని కడుపులోకి, నూనెలా అతని ఎముకల్లోకి చొచ్చుకు పోయింది.

  20. ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. యెహోవా, కీడుచేసే మనుష్యుల నుండి నన్ను రక్షించండి; హింసించేవారి నుండి నన్ను కాపాడండి,

  21. వారు హృదయాల్లో చెడు విషయాలే కల్పించుకుంటారు రోజు యుద్ధము రేపుతారు.

  22. వారు పాము నాలుకలా వారి నాలుకను పదును చేసుకుంటారు; వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది. సెలా

  23. యెహోవా, దుష్టుల చేతుల నుండి నన్ను కాపాడండి; దౌర్జన్యపరుల నుండి నన్ను కాపాడండి, నా కాళ్లను పట్టుకోవాలని పన్నాగాలు చేస్తున్నారు.

  24. కీడు చేయనిదే వారు నిద్రపోలేరు; ఎదుటివారిని పడవేయనిదే వారికి నిద్రరాదు.

  25. వారు దుర్మార్గమనే ఆహారం తింటారు హింస అనే ద్రాక్షరసాన్ని త్రాగుతారు.