Skip to content

Malice గురించి బైబిల్ వచనాలు

135 వచనాలు · 29 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ ‘మీ తోటి ఇశ్రాయేలీయున్ని మీ హృదయంలో ద్వేషించకూడదు. మీ పొరుగువారి దోషం మీరు భరించకూడదు అంటే మీరు మీ పొరుగువారిని ఉన్నది ఉన్నట్లుగా గద్దించాలి.

  2. “ ‘ప్రతీకారం ప్రయత్నించవద్దు లేదా మీ ప్రజల్లో ఎవరి మీదా పగ పెట్టుకోవద్దు, కానీ మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి. నేను యెహోవానై ఉన్నాను.

  3. “తన పొరుగువాడి సరిహద్దు రాయిని తీసివేసేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

  4. “గ్రుడ్డివాన్ని త్రోవ తప్పించేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

  5. వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్షచెట్టు నుండి వచ్చింది అది గొమొర్రా పొలాల్లో నుండి వచ్చింది. వాటి ద్రాక్షపండ్లు విషంతో నిండి ఉన్నాయి, వాటి గెలలు చేదుగా ఉన్నాయి.

  6. వాటి ద్రాక్షరసం సర్ప విషం, నాగుపాముల మరణకరమైన విషము.

  7. అప్పటినుండి సౌలు దావీదును అసూయతో చూడడం మొదలుపెట్టాడు.

  8. తర్వాత రోజు దేవుని దగ్గర నుండి దురాత్మ ఒకటి సౌలు మీదికి బలంగా వచ్చి అతడు ఇంట్లో ప్రవచిస్తున్నప్పుడు దావీదు ఎప్పటిలాగానే వీణ పట్టుకుని వాయించాడు. సౌలు చేతిలో ఒక ఈటె ఉంది.

  9. సౌలు, “దీనితో నేను దావీదును గోడకు వ్రేలాడదీస్తాను” అని తనలో తాను అనుకుని దావీదు మీదికి ఈటె విసిరాడు కాని దావీదు రెండు సార్లు తప్పించుకున్నాడు.

  10. గతంలో అబ్షాలోముతో కాకపోయినా అదోనియాతో కలిసి కుట్రపన్నిన యోవాబుకు ఈ వార్త చేరగానే అతడు యెహోవా గుడారానికి పారిపోయి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు.

  11. యోవాబు పారిపోయి యెహోవా గుడారంలో బలిపీఠం దగ్గర ఉన్నాడని రాజైన సొలొమోనుకు తెలిసింది. అప్పుడు సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను, “వెళ్లు, అతన్ని చంపు!” అని ఆదేశించాడు.

  12. కాబట్టి బెనాయా యెహోవా గుడారంలోకి ప్రవేశించి యోవాబుతో, “రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు” అని చెప్పాడు. అయితే అతడు, “లేదు, నేను ఇక్కడే చస్తాను” అన్నాడు. బెనాయా యోవాబు తనతో చెప్పిన మాటను రాజుకు తెలియజేశాడు.

  13. అప్పుడు రాజు బెనాయాతో, “అతడు చెప్పినట్లే కానివ్వు. అతన్ని కొట్టి చంపి పాతిపెట్టు. అలా యోవాబు చిందించిన నిరపరాధ రక్తం గురించి నా మీద నా కుటుంబమంతటి మీద ఆ దోషం ఉండదు.

  14. అతడు చిందించిన రక్తానికి యెహోవా అతనికి ప్రతిఫలమిస్తారు. ఎందుకంటే అతనికంటే మంచివారు, ఉత్తములు అయిన నేరు కుమారుడు ఇశ్రాయేలు సేనాధిపతియైన అబ్నేరు, యెతెరు కుమారుడు యూదా సేనాధిపతియైన అమాశా అనే ఇద్దరిపై అతడు నా తండ్రియైన దావీదుకు తెలియకుండా దాడి చేసి వారిని ఖడ్గంతో చంపాడు.

  15. వారి రక్తం యొక్క అపరాధం యోవాబు మీద అతని సంతతివారి మీద ఎల్లప్పుడు ఉండును గాక. కాని దావీదు, అతని సంతతివారు, అతని ఇల్లు, అతని సింహాసనం మీద యెహోవా సమాధానం ఎల్లప్పుడు ఉండును గాక” అని చెప్పాడు.

  16. ఇశ్రాయేలు రాజు వారిని చూసి, “వీరిని చంపనా, నా తండ్రి? వీరిని చంపనా?” అని ఎలీషాను అడిగాడు.

  17. అందుకు అతడు, “నీవు వారిని చంపకూడదు, నీ ఖడ్గంతో, వింటితో బందీలుగా తెచ్చిన వారిని చంపుతావా? వారికి భోజనం పెట్టి వారు తిని త్రాగి తమ యజమాని దగ్గరికి వెళ్లేలా వారికి భోజనం పెట్టి, నీళ్ళు ఇవ్వు” అని చెప్పాడు.

  18. “ఒకవేళ నా శత్రువు నాశనాన్ని బట్టి నేను సంతోషిస్తే వారికి ఏర్పడిన ఇబ్బందిని బట్టి నేను ఆనందిస్తే,

  19. వారి జీవితానికి వ్యతిరేకంగా శాపం పెట్టడం ద్వారా నా నోటిని పాపానికి అనుమతించలేదు

  20. దుష్టులు చెడును గర్భం దాలుస్తారు, కీడును గర్భంలో మోసి అబద్ధాలకు జన్మనిస్తారు.

  21. ఇతరుల కోసం గుంటను త్రవ్వుతారు తాము త్రవ్విన గుంటలో వారే పడతారు.

  22. వారు చేసిన కీడు వారికే చుట్టుకుంటుంది; వారు చేసిన హింస వారి తల మీదికే వస్తుంది.

  23. వారి నోటి నిండా శాపాలు, మోసాలు, బెదిరింపులు ఉన్నాయి; ఇబ్బంది, కీడు వారి నాలుక క్రింద ఉంటాయి.

  24. వారు గ్రామాల సమీపంలో పొంచి ఉంటారు; చాటైన స్థలాల్లో వారు నిర్దోషులను చంపుతారు. నిస్సహాయులైన వారి కోసం వారి కళ్లు వెదకుతాయి;

  25. గుహలో సింహంలా వారు వేచి ఉంటారు. నిస్సహాయులను పట్టుకోడానికి వారు ఎదురుచూస్తూ ఉంటారు; వారు నిస్సహాయులను తమ వలలోనికి లాగి పట్టుకుంటారు.