Skip to content

God గురించి బైబిల్ వచనాలు

662 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నా తలను పైకెత్తితే సింహం వలె మీరు నన్ను వేటాడతారు, నాకు వ్యతిరేకంగా మీ మహాబలాన్ని మరలా ప్రదర్శిస్తారు.

  2. మీరు నాకు వ్యతిరేకంగా మరలా సాక్షులను తీసుకువస్తారు నా మీద మీకు కోపం పెరిగిపోతుంది; ఒకదాని తర్వాత ఒకటిగా మీ సైన్యాలు నామీదికి వస్తాయి.

  3. “అసలు గర్భం నుండి నన్నెందుకు బయటకు తీసుకువచ్చారు? ఎవరు నన్ను చూడకముందే నేను చనిపోయి ఉంటే బాగుండేది.

  4. కాని జంతువులను అడగండి అవి మీకు బోధిస్తాయి, ఆకాశంలోని పక్షులను అడగండి అవి మీకు చెప్తాయి.

  5. భూమితో మాట్లాడండి అది మీకు బోధిస్తుంది, సముద్రంలోని చేపలు మీకు తెలియచేస్తాయి.

  6. వీటన్నిటిని యెహోవా హస్తం చేసిందని తెలుసుకోలేనివారు ఎవరు?

  7. ఆయన చేతిలో జీవులన్నిటి ప్రాణం మానవులందరి ఊపిరి ఉంది.

  8. నాలుక ఆహారం రుచిని చూసినట్లు చెవి మాటలను పరిశీలించదా?

  9. వృద్ధుల దగ్గర జ్ఞానం దొరకదా? దీర్ఘాయువు గ్రహింపును తీసుకురాదా?

  10. జ్ఞానం శక్తి దేవునికి చెందినవి; ఆలోచన గ్రహింపు ఆయనవే.

  11. దేవుడు పడగొట్టిన దానిని తిరిగి కట్టలేరు; ఆయన బంధించిన వారిని ఎవరూ విడిపించలేరు.

  12. ఆయన జలాలను ఆపేస్తే అవి ఎండిపోతాయి; ఆయన వాటిని వదిలేస్తే అవి భూమిని వరదలతో నాశనం చేస్తాయి.

  13. బలం వివేకం ఆయనకు చెందినవే; మోసపోయేవారు మోసగించేవారు ఆయన వారే.

  14. ఆయన ఆలోచనకర్తలను దిగంబరులుగా నడిపిస్తారు, న్యాయాధిపతులను బుద్ధిహీనులుగా చేస్తారు.

  15. ఆయన రాజులు వేసిన సంకెళ్ళు తీసివేస్తారు వారి నడుము చుట్టూ తాడు కడతాడు.

  16. యాజకులను దిగంబరులుగా చేసి నడిపిస్తారు, స్థిరంగా పాతుకుపోయిన అధికారులను పడగొడతారు.

  17. నమ్మకమైన సలహాదారుల మాటలను నిరర్థకం చేస్తారు, పెద్దల వివేచనను తీసివేస్తారు.

  18. శూన్యమండలంపైన ఉత్తరాన ఆకాశాలను ఆయన విశాలపరిచారు; శూన్యంలో భూమిని వేలాడదీసారు.

  19. ఆయన తన మేఘాలలో నీళ్లను బంధించారు అయినా వాటి బరువుకు మేఘాలు చినిగిపోవు.

  20. దాని మీద మేఘాలను వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచారు.

  21. వెలుగు చీకట్ల సరిహద్దు వరకు జలాలకు ఆయన హద్దును నియమించారు.

  22. ఆయన గద్దింపుకు ఆకాశాల స్తంభాలు కంపిస్తాయి.

  23. ఆయన బలం చేత సముద్రం ఉప్పొంగుతుంది; తన జ్ఞానం చేత రాహాబును ముక్కలుగా చేస్తారు.

  24. ఆయన ఊపిరిచే ఆకాశాలు అలంకరించబడతాయి; ఆయన చేయి పారిపోతున్న సర్పాన్ని పొడిచింది.

  25. ఇవన్నీ ఆయన చేసినపనులలో కొంతవరకు మాత్రమే; మనం ఆయన గురించి విన్నది కేవలం గుసగుస ధ్వని వంటిది మాత్రమే! అలాంటప్పుడు ఆయన శక్తి యొక్క ఉరుమును గ్రహించగలిగిన వారెవరు?”