Skip to content

God గురించి బైబిల్ వచనాలు

662 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దేవుడు ఎన్నడూ దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు.

  2. భూమి మీద ఆయనను నియమించింది ఎవరు? సర్వలోకానికి ఆయనను అధిపతిగా చేసింది ఎవరు?

  3. దేవుడే కాబట్టి స్వార్థపరుడై ఉండి తన ఆత్మను ఊపిరిని తొలగించి వేస్తే,

  4. మనుష్యులంతా ఒకేసారి నశించిపోతారు, మానవులు తిరిగి దుమ్ములో కలిసిపోతారు.

  5. “నీవు జ్ఞానం కలిగి ఉంటే, ఇది విను; నేను చెప్పేది ఆలకించు.

  6. న్యాయాన్ని ద్వేషించేవాడు పరిపాలించగలడా? బలాఢ్యుడైన న్యాయవంతుడైన దేవుని మీద నీవు నేరం మోపుతావా?

  7. ‘మీరు పనికిమాలినవారు’ అని రాజులతో, ‘మీరు దుష్టులు’ అని సంస్థానాధిపతులతో చెప్పేవాడు ఈయన కాడా,

  8. ఆయన అధికారులంటే పక్షపాతం లేదు ఆయన బీదలను కాదని ధనవంతులకు దయచూపించడు, అందరు ఆయన చేతుల్లో సృష్టించబడినవారే కదా.

  9. వారు నిమిషంలోనే మధ్యరాత్రిలోనే చనిపోతారు; వారు కదిలించబడి మరణిస్తారు; మానవ ప్రమేయం లేకుండానే బలవంతులు తీసుకెళ్తారు.

  10. “మానవుల మార్గాలన్నిటిని ఆయన చూస్తున్నారు. వారి ప్రతి అడుగును ఆయన గమనిస్తున్నారు.

  11. చెడు చేసేవారు దాక్కోవడానికి చీకటియైనా మరణాంధకారమైనా లేదు.

  12. ఒకరు దేవుని ఎదుట న్యాయవిచారణలోకి రాకముందే, వానిని ఎక్కువగా విచారణ చేయనవసరం ఆయనకు లేదు.

  13. విచారణలేకుండానే ఆయన బలవంతులను ముక్కలుగా చేస్తారు వారి స్థానంలో ఇతరులను నియమిస్తారు.

  14. ఎందుకంటే వారి పనులెలాంటివో ఆయనకు తెలుసు, రాత్రివేళలో ఆయన వారిని పడద్రోయగా వారు నలుగగొట్టబడతారు.

  15. అందరు చూస్తూ ఉండగానే వారి దుర్మార్గాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తారు.

  16. ఎందుకంటే, వారు ఆయనను అనుసరించుట మానుకున్నారు, ఆయన మార్గాల్లో దేన్ని వారు గ్రహించలేదు.

  17. బీదలు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టేలా వారు చేశారు; అవసరతలో ఉన్న వారి మొరను ఆయన ఆలకిస్తారు.

  18. ఆయన మౌనంగా ఉంటే ఆయనకు శిక్ష విధించగలవారెవరు? ఆయన తన ముఖం దాచుకొంటే ఆయనను చూడగలవారెవరు? ఒక్క వ్యక్తికైనా దేశమంతటికైనా ఆయన విధానం ఒక్కటే,

  19. భక్తిహీనులు పరిపాలించకుండ చేయడం, మనుష్యులకు ఉచ్చులు బిగించకుండా వారిని అడ్డుకోవడము.

  20. “వీటన్నిబట్టి నా హృదయం వణికిపోతుంది, దాని స్థలం నుండి దూకుతుంది.

  21. ఆయన స్వరం గర్జించడం వినండి, ఆయన నోటి నుండి వచ్చే ఉరుమును వినండి.

  22. ఆయన తన మెరుపును ఆకాశమంతటి క్రింద విప్పుతారు దానిని భూమి చివర్లకు పంపుతారు.

  23. దాని తర్వాత ఆయన గర్జన శబ్దం వినిపిస్తుంది; ఆయన తన గంభీరమైన స్వరంతో ఉరుముతారు. ఆయన స్వరం ప్రతిధ్వనిస్తున్నప్పుడు, ఆయన ఏది వెనుకకు తీసుకోరు.

  24. దేవుని స్వరం అద్భుతమైన విధానాల్లో ఉరుముతుంది; మనం గ్రహించలేని గొప్ప వాటిని ఆయన చేస్తారు.

  25. ఆయన మంచుతో, ‘భూమిపై పడు’ వాన జల్లుతో, ‘కుండపోత వర్షంగా కురువు’ అని ఆజ్ఞాపిస్తారు.