Skip to content

God గురించి బైబిల్ వచనాలు

662 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “పరుగెత్తేవాని కంటే నా రోజులు వేగంగా పరుగెడుతున్నాయి; ఏ సంతోషం లేకుండానే అవి ఎగిరిపోతున్నాయి.

  2. రెల్లు పడవలు దాటిపోతున్నట్లు, గ్రద్ద తన ఎరను తన్నుకుపోయినట్లు అవి గడిచిపోతున్నాయి.

  3. నా ఫిర్యాదు మరచిపోయి, నా విచారం విడిచిపెట్టి సంతోషంగా ఉంటానని నేను అనుకుంటే,

  4. నా బాధలన్నిటికి భయపడతాను ఎందుకంటే మీరు నన్ను నిర్దోషిగా ప్రకటించరని నాకు తెలుసు.

  5. నేను దోషినని తేలినప్పుడు, నాకెందుకు ఈ వృధా ప్రయాస?

  6. సబ్బుతో నన్ను నేను కడుక్కున్నా, శుభ్రం చేసే పొడితో నా చేతులు కడుక్కున్నా,

  7. మీరు నన్ను బురద గుంటలో ముంచుతారు, అప్పుడు నా బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి.

  8. “నేను జవాబివ్వడానికి, ఒకరిపై ఒకరం న్యాయస్థానంలో పోరాడడానికి దేవుడు నాలాంటి మనిషి కాదు.

  9. మా మధ్య మధ్యవర్తిత్వం చేసేవారు, మమ్మల్ని కలపగల వారు మాకు లేరు,

  10. దేవుని దండాన్ని నా మీద నుండి తీసివేయగలిగిన వారు ఉంటే బాగుండేది, అప్పుడు ఆయన భయం నన్ను ఇక బెదిరించదు.

  11. అప్పుడు నిర్భయంగా నేను ఆయనతో మాట్లాడగలను, కాని ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను అలా చేయలేను.

  12. నేను దేవునితో ఇలా అంటాను: నన్ను దోషిగా భావించకండి, కాని నా మీద మీకున్న ఆరోపణలు నాకు చెప్పండి.

  13. నన్ను హింసించడం, మీ చేతిపనిని త్రోసివేయడం, దుర్మార్గుల ప్రణాళికలను చూసి సంతోషించడం మీకు ఇష్టమా?

  14. మీ కళ్లు మనుష్యుల కళ్లలాంటివా? మనుష్యులు చూసేటట్లు మీరు చూస్తారా?

  15. మీ రోజులు మానవుల రోజుల వంటివా మీ సంవత్సరాలు బలమైన మనుష్యుల సంవత్సరాల వంటివా?

  16. నేను దోషిని కానని మీ చేతిలో నుండి నన్ను ఎవరూ విడిపించలేరని మీకు తెలిసినప్పటికీ నా అపరాధాలను మీరు వెదకుతున్నారు? నా పాపాలను మీరు పరిశోధిస్తున్నారు?

  17. Thou knowest that I am not wicked; and there is none that can deliver out of thine hand.

  18. “మీ చేతులు నన్ను రూపొందించి తయారుచేశాయి. ఇప్పుడు మీరు నన్ను తిరిగి నాశనం చేస్తారా?

  19. బంకమట్టిలా నన్ను రూపొందించారని జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు నన్ను తిరిగి మట్టిలా మారుస్తారా?

  20. పాలు పోసినట్లు మీరు నన్ను పోయలేదా, జున్నుగడ్డ పేరబెట్టినట్లు నన్ను చేయలేదా,

  21. చర్మంతో మాంసంతో నన్ను కప్పి ఎముకలు నరాలతో కలిపి అల్లలేదా?

  22. మీరు నాకు జీవాన్ని ఇచ్చి దయ చూపించారు, మీ సంరక్షణతో నా ఆత్మను కాపాడారు.

  23. “అయితే ఇది మీ హృదయంలో దాచుకున్నారు, ఇది మీ మనస్సులో ఉన్నదని నాకు తెలుసు:

  24. నేను పాపం చేస్తే, మీరు నన్ను చూస్తుంటారు, నా నేరానికి శిక్ష వేయకుండ వదలరు.

  25. నేను దోషినైతే నాకు శ్రమ! నేను నిర్దోషినైనప్పటికి నా తల పైకెత్తలేను, ఎందుకంటే నేను అవమానంతో నిండుకొని నా బాధలో మునిగి ఉన్నాను.