కంటెంట్‌కు వెళ్లండి

Armies గురించి బైబిల్ వచనాలు

207 వచనాలు · 77 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు దావీదు ఇంటివారికి, “అరాము ఎఫ్రాయిముతో పొత్తు పెట్టుకుంది” అని తెలియజేయబడింది; కాబట్టి గాలికి అడవి చెట్లు కదిలినట్లు ఆహాజు, అతని ప్రజల హృదయాలు వణికాయి.

  2. అప్పుడు యెహోవా యెషయాతో ఇలా అన్నారు, “ఆహాజును కలుసుకోడానికి నీవు, నీ కుమారుడైన షెయార్యాషూబు చాకలి రేవుకు వెళ్లే దారిలో ఉన్న పై కోనేటి కాలువ చివరికి వెళ్లండి.

  3. అతనితో, ‘జాగ్రత్త, నెమ్మదిగా ఉండు, భయపడకు. పొగరాజుకుంటున్న ఈ రెండు కాగడాలకు అనగా రెజీను, అరాము, రెమల్యా కుమారుడైన పెకహు యొక్క తీవ్రమైన కోపానికి అధైర్యపడకు.

  4. అరాము, ఎఫ్రాయిం, రెమల్యా కుమారుడు నీకు కీడు చేయాలని కుట్రపన్ని,

  5. “మనం యూదాపై దాడి చేద్దాము; మనం దానిని చీల్చివేసి, మన మధ్యలో పంచుకుందాం, టాబెయేలు కుమారున్ని దానికి రాజుగా చేద్దాం” అని చెప్పుకున్నారు.’ ”

  6. అయితే ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “అది నిలబడదు, అలా జరుగదు.

  7. ఎందుకంటే అరాము రాజధాని దమస్కు. దమస్కు రాజు రెజీను మాత్రమే. అరవై అయిదు సంవత్సరాలు కాకముందే ఎఫ్రాయిం ఒక జాతిగా ఉండకుండా నాశనం అయిపోతుంది.

  8. ఎఫ్రాయిముకు సమరయ రాజధాని, సమరయకు రెమల్యా కుమారుడు రాజు. మీరు మీ విశ్వాసంలో స్థిరంగా ఉండకపోతే మీరు క్షేమంగా ఉండలేరు.”

  9. దేశాల్లారా, మీరు ముక్కలై నాశనమైపోతారు! దూర దేశాల్లారా! మీరందరూ వినండి. యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి! అవును, యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి!

  10. మీరు వ్యూహం రచించండి, అది విఫలమవుతుంది; మీ ప్రణాళికను ప్రతిపాదించండి, అది నిలబడదు, ఎందుకంటే దేవుడు మాతో ఉన్నారు.

  11. ఈ ప్రజల మార్గాన్ని అనుసరించకూడదని యెహోవా నన్ను హెచ్చరించి నాతో ఖచ్చితంగా చెప్పిన మాట ఇదే:

  12. “ఈ ప్రజలు కుట్ర అని చెప్పే ప్రతిదాన్ని కుట్ర అనకండి. వారు భయపడే దానికి భయపడకండి. దానికి బెదిరిపోకండి.

  13. సీయోనులో స్త్రీలు, యూదా పట్టణాల్లో కన్యలు హింసించబడ్డారు.

  14. అధిపతుల చేతులు కట్టబడి, వ్రేలాడదీయబడ్డారు; పెద్దలకు గౌరవం లేదు.

  15. యువకులు తిరుగటిరాళ్ల దగ్గర కష్టపడుతున్నారు; బాలురు కట్టెల బరువు మోయలేక తూలుతున్నారు.

  16. అయితే నీవు గాలి తుఫాను వచ్చినట్లుగా వస్తావు; నీవు, నీ సైన్యం, నీ పక్షాన ఉన్న అనేకమంది ప్రజలు కలిసి దేశం మీద మేఘంలా కమ్ముకుంటారు.

  17. “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ రోజు నీ మనస్సులో చెడు ఆలోచనలు పుడతాయి. నీవు చెడు పన్నాగం పన్ని,

  18. దురాలోచనతో నీవు ఇలా అంటావు, “నేను గోడలులేని గ్రామాలున్న దేశంపై దాడి చేస్తాను; గోడలు ద్వారాలు అడ్డగడియలు లేని దేశంలో ప్రశాంతంగా క్షేమంగా నివసిస్తున్న ప్రజల మీద దాడి చేస్తాను.

  19. వారిని దోచుకుని సొమ్ము కొల్లగొట్టడానికి, గతంలో పాడుబడి ఉన్నా మళ్ళీ నివాసం ఉంటున్న స్థలాల మీద దాడి చేయడానికి, ఇతర జనాల్లో నుండి సమకూర్చబడి సమృద్ధిగా పశువులు సరుకులు కలిగి భూమి మధ్యభాగంలో నివసించే ప్రజలమీదికి వెళ్తాను.”

  20. షేబ వారు, దేదాను వారు, తర్షీషు వర్తకులు, దాని కొదమ సింహాల్లాంటి వారందరు నిన్ను చూసి, “దోచుకోవడానికి వచ్చావా? వెండి బంగారాలను, పశువులను సరుకులను కొల్లగొట్టుకొని తీసుకెళ్లడానికి, దోచుకోవడానికి నీ సైన్యాన్ని సమకూర్చుకున్నావా?” అని అంటారు.’

  21. “మనుష్యకుమారుడా, గోగుకు వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నిర్భయంగా నివసించే రోజున నీవు ఇది గమనించలేదా?

  22. ఉత్తరాన దూరంగా ఉన్న నీ స్థలంలో నుండి నీవూ, నీతో పాటు అనేక జనాలు గుర్రాలపై స్వారీ చేస్తూ చాలా గొప్ప సైన్యంగా వస్తారు.

  23. దేశాన్ని మేఘం క్రమ్మినట్లు మీరంతా నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీదికి వస్తారు. రాబోయే రోజుల్లో అది జరుగుతుంది; నీ ద్వారా ఇతర ప్రజల ఎదుట నేను పరిశుద్ధుడను అని కనుపరిచినప్పుడు వారు నన్ను తెలుసుకునేలా గోగూ, నేను నిన్ను నా దేశం మీదికి రప్పిస్తాను.

  24. అది ఆకాశ సమూహాన్ని చేరేవరకు పెరిగి కొన్ని నక్షత్ర సమూహాలను భూమిపై పడేసి, వాటిని త్రొక్కింది.

  25. యెహోవా సైన్యం యొక్క అధిపతికి సమానంగా తనను తాను హెచ్చించుకుంది; యెహోవా నుండి అనుదిన అర్పణలను నిలిపివేసింది, ఆయన పరిశుద్ధాలయాన్ని పడద్రోసింది.