కంటెంట్‌కు వెళ్లండి

Armies గురించి బైబిల్ వచనాలు: Enumeration of Israel's military forces

13 వచనాలు · 77 కోణాలు

Enumeration of Israel's military forces గురించి వచనాలు

  1. మొత్తం సమాజంలోని ఇశ్రాయేలీయుల వంశాలు కుటుంబాల ప్రకారం వారి జనాభా లెక్కలు నమోదు చేయి.

  2. నీవూ అహరోను కలిసి ఇశ్రాయేలీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు గలవారు, సైన్యంలో సేవ చేయగలవారిని వారి వారి సేనల ప్రకారం లెక్కించాలి.

  3. దావీదు తనతో ఉన్న సైన్యాన్ని సమకూర్చి, వారిలో ప్రతి వేయిమందికి సహస్రాధిపతులను, ప్రతి వందమందికి శతాధిపతులను నియమించాడు.

  4. దావీదు తన సైన్యాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని యోవాబు ఆధీనంలో, మరొక భాగాన్ని యోవాబు సోదరుడు, సెరూయా కుమారుడైన అబీషై ఆధీనంలో, ఇంకొక భాగాన్ని గిత్తీయుడైన ఇత్తయి ఆధీనంలో ఉంచాడు. రాజు తన సేనలను పంపుతూ వారితో, “నేనే స్వయంగా మీతో వస్తున్నా” అని చెప్పాడు.

  5. యెహోవాకు మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల మీద కోపం రాగా ఆయన, “వెళ్లి ఇశ్రాయేలువారి యూదావారి జనాభాను లెక్కించు” అని దావీదును వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టారు.

  6. కాబట్టి రాజు యోవాబును, అతనితో ఉన్న సైన్యాధిపతులను పిలిచి, “యుద్ధానికి వెళ్లగలిగిన వారి సంఖ్య నాకు తెలిసేలా దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలు గోత్రాలన్నిటి దగ్గరకు వెళ్లి జనాభా లెక్క తీసుకురండి” అని చెప్పాడు.

  7. కాని యోవాబు రాజుతో, “మీ దేవుడైన యెహోవా సైన్యాన్ని వందరెట్లు ఎక్కువ చేయడం నా ప్రభువైన రాజా మీరే చూస్తారు. కానీ నా ప్రభువు రాజు అలాంటి పని ఎందుకు చేయాలనుకుంటున్నాడు?” అని అన్నాడు.

  8. అయితే రాజు యోవాబుకు సైన్యాధిపతులకు ఇచ్చిన ఆజ్ఞకు తిరుగులేదు కాబట్టి వారు రాజు ఎదుట నుండి ఇశ్రాయేలీయుల జనాభా లెక్కించడానికి బయలుదేరి వెళ్లారు.

  9. యొర్దాను దాటి గాదు లోయ పట్టణానికి దక్షిణంగా అరోయేరులో శిబిరం ఏర్పరచుకున్నారు. అక్కడినుండి గాదు ప్రాంతం గుండా యాజెరుకు వెళ్లారు.

  10. అక్కడినుండి గిలాదు, తహ్తీము హొద్షీ ప్రాంతానికి వచ్చి దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు.

  11. అక్కడినుండి కోటలున్న తూరు పట్టణానికి హివ్వీయుల, కనానీయుల పట్టణాలన్నిటికి వచ్చారు. చివరిగా యూదా దేశానికి దక్షిణాన ఉన్న బెయేర్షేబ వరకు వచ్చారు.

  12. ఇలా వారు దేశమంతా తిరిగి తొమ్మిది నెలల ఇరవై రోజులకు యెరూషలేముకు చేరుకున్నారు.

  13. యోవాబు యుద్ధం చేయగలవారి సంఖ్య రాజుకు తెలియజేశాడు. ఇశ్రాయేలులో కత్తి తిప్పగలవారు ఎనిమిది లక్షలమంది ఉన్నారు, యూదా వారిలో అయిదు లక్షలమంది ఉన్నారు.