కంటెంట్‌కు వెళ్లండి

Armies గురించి బైబిల్ వచనాలు: Who were exempt from service in

9 వచనాలు · 77 కోణాలు

Who were exempt from service in గురించి వచనాలు

  1. అయితే లేవీయుల పూర్వికుల గోత్రం ప్రకారం వీరితో పాటు లెక్కించబడలేదు.

  2. యెహోవా మోషేతో ఇలా అన్నారు:

  3. “లేవీయుల గోత్రాన్ని నీవు లెక్క పెట్టకూడదు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలో చేర్చకూడదు.

  4. దానికి బదులుగా సాక్షి గుడారం లేదా సాక్షి గుడారం మీద, దాని ఉపకరణాల మీద, దానికి సంబంధించిన అన్నిటి మీద లేవీయులను నియమించు. వారు సమావేశ గుడారాన్ని, దాని ఉపకరణాలన్నిటిని మోయాలి; వారు దాని చుట్టూ ఉంటూ దానిని చూసుకోవాలి.

  5. అధికారులు సైనికులతో చెప్పవలసిన మాటలు: “మీలో ఎవరైనా క్రొత్తగా ఇల్లు కట్టుకుని ఇంకా గృహప్రవేశం చేయనట్లైతే, వెంటనే ఇంటికి వెళ్లిపోవాలి, లేకపోతే ఒకవేళ అతడు యుద్ధంలో చనిపోతే మరొకరు ఆ ఇంట్లో నివసిస్తారు.

  6. ఎవడైనా ద్రాక్షతోట వేసి దాని ఫలసాయం అనుభవించకుండా ఉన్నాడా? అలాగైతే అతడు ఇంటికి తిరిగి వెళ్లవచ్చు, లేదా అతడు యుద్ధంలో చనిపోతే అతని తోట ఫలసాయం మరొకరు అనుభవిస్తారు.

  7. ప్రధానం చేసుకుని ఇంకా పెండ్లి చేసుకోకుండా ఉన్నవాడు మీలో ఉంటే అతడు ఇంటికి వెళ్లిపోవచ్చు, అతడు ఒకవేళ యుద్ధంలో చనిపోతే మరొకడు ఆమెను పెళ్ళి చేసుకోవచ్చు.”

  8. అధిపతులు చేయవలసిన హెచ్చరికలు, “ఎవనికైనా భయాందోళనలున్నాయా? అలాగైతే ఇంటికి వెళ్లిపోవచ్చు, లేకపోతే ఆ పిరికితనం మిగతా సైనికులకు కూడా వ్యాపిస్తుంది.”

  9. అధిపతులు ప్రజలకు ఈ సందేశమిచ్చిన తర్వాత సేనాధిపతులు తమ బాధ్యతలను స్వీకరిస్తారు.