- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- ద్వితీయోపదేశకాండము 9:23సుమారు క్రీ.పూ. 1451
యెహోవా మిమ్మల్ని కాదేషు బర్నియాలో నుండి పంపిస్తున్నప్పుడు ఆయన మీతో, “మీరు వెళ్లి నేను మీకు ఇచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి” అని చెప్పారు. కాని మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు తిరుగుబాటు చేశారు. మీరు ఆయనను నమ్మలేదు, లోబడలేదు.
- ద్వితీయోపదేశకాండము 9:24సుమారు క్రీ.పూ. 1451
మీరు నాకు తెలిసినప్పటినుండి మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.
- ద్వితీయోపదేశకాండము 9:25సుమారు క్రీ.పూ. 1451
యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తానని చెప్పిన కారణంగా నేను ఆ నలభై పగళ్లు నలభై రాత్రులు యెహోవా ఎదుట సాష్టాంగపడ్డాను.
- ద్వితీయోపదేశకాండము 9:26సుమారు క్రీ.పూ. 1451
నేను యెహోవాకు ఇలా ప్రార్థన చేశాను, “ప్రభువైన యెహోవా! మీ గొప్ప బలంతో విడిపించి, మీ బలమైన హస్తంతో ఈజిప్టులో నుండి బయటకు తీసుకువచ్చిన మీ స్వాస్థ్యమైన మీ ప్రజలను నాశనం చేయవద్దు.
- ద్వితీయోపదేశకాండము 9:27సుమారు క్రీ.పూ. 1451
మీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజల మొండితనాన్ని చెడుతనాన్ని పాపాన్ని పట్టించుకోకండి.
- ద్వితీయోపదేశకాండము 9:28సుమారు క్రీ.పూ. 1451
లేకపోతే మీరు మమ్మల్ని ఏ దేశం నుండి బయటకు తీసుకువచ్చారో ఆ ప్రజలు, ‘యెహోవా వారికి వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని తీసుకెళ్లలేక పోయారు, వారిని ద్వేషించారు కాబట్టి అరణ్యంలో చంపడానికి వారిని బయటకు తీసుకెళ్లారు’ అని చెప్పుకుంటారు.
- ద్వితీయోపదేశకాండము 9:29సుమారు క్రీ.పూ. 1451
అయితే వారు మీ ప్రజలు, మీ అధిక బలం చేత, మీ చాచిన చేతి చేత మీరు బయటకు తీసుకువచ్చిన మీ స్వాస్థ్యము.”
- ద్వితీయోపదేశకాండము 10:1సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు యెహోవా నాతో అన్నారు, “నీవు మొదటి పలకలవంటి మరో రెండు రాతిపలకలను చెక్కి పర్వతమెక్కి నా దగ్గరకు రా. అలాగే ఒక కర్ర మందసాన్ని తయారుచేయు.
- ద్వితీయోపదేశకాండము 10:2సుమారు క్రీ.పూ. 1491
నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే నేను వాటిపై వ్రాస్తాను. తర్వాత నీవు వాటిని ఆ మందసంలో ఉంచాలి.”
- ద్వితీయోపదేశకాండము 10:3సుమారు క్రీ.పూ. 1491
కాబట్టి నేను తుమ్మకర్రతో మందసం చేసి, మొదటి వాటిలా రెండు రాతిపలకలను చెక్కి, నా చేతులతో ఆ రెండు రాతిపలకలు పట్టుకుని నేను పైకి వెళ్లాను.
- ద్వితీయోపదేశకాండము 10:4సుమారు క్రీ.పూ. 1491
సమావేశమైన రోజున, పర్వతం మీద, అగ్ని మధ్యలో నుండి మీకు ప్రకటించిన పది ఆజ్ఞలను మొదట వ్రాసినట్లుగానే, యెహోవా ఆ పలకల మీద వ్రాశారు. యెహోవా వాటిని నాకు ఇచ్చారు.
- ద్వితీయోపదేశకాండము 10:5సుమారు క్రీ.పూ. 1491
తర్వాత నేను పర్వతం దిగివచ్చి, యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారం, నేను చేసిన మందసంలో ఆ పలకలను ఉంచాను. ఇప్పుడవి దానిలో ఉన్నాయి.
- ద్వితీయోపదేశకాండము 10:6సుమారు క్రీ.పూ. 1491
ఇశ్రాయేలీయులు బెనె యహకాను బావులనుండి మొసేరాకు ప్రయాణించారు. అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడ్డాడు, అతని కుమారుడైన ఎలియాజరు అతనికి బదులుగా యాజకుడయ్యాడు.
- ద్వితీయోపదేశకాండము 10:7సుమారు క్రీ.పూ. 1491
అక్కడినుండి వారు గుద్గోదకు, తర్వాత నీటిప్రవాహాలు ఉన్న దేశమైన యొత్బాతాకు ప్రయాణించారు.
- ద్వితీయోపదేశకాండము 10:8సుమారు క్రీ.పూ. 1491
నేటి వరకు చేస్తున్నట్లుగా, యెహోవా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవా సన్నిధిలో నిలబడి సేవ చేయడానికి, ఆయన పేరిట ఆశీర్వచనం పలకడానికి లేవీ గోత్రికులను ఆ సమయంలో యెహోవా ప్రత్యేకించుకున్నారు.
- ద్వితీయోపదేశకాండము 10:9సుమారు క్రీ.పూ. 1491
అందుకే లేవీయులకు వారి తోటి ఇశ్రాయేలీయులతో పాటు వాటా గాని స్వాస్థ్యం గాని లేదు; మీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారి స్వాస్థ్యము.
- ద్వితీయోపదేశకాండము 10:10సుమారు క్రీ.పూ. 1491
మొదట ఉన్నట్లే నేను ఆ పర్వతం మీద నలభై పగళ్లు నలభై రాత్రులు ఉన్నాను, ఈసారి కూడా యెహోవా నా మనవి ఆలకించారు. మిమ్మల్ని నాశనం చేయడం ఆయన చిత్తం కాదు.
- ద్వితీయోపదేశకాండము 10:11సుమారు క్రీ.పూ. 1491
యెహోవా నాతో అన్నారు, “నీవు లేచి వెళ్లు, వారికి ఇస్తానని వారి పూర్వికులతో నేను ప్రమాణం చేసిన దేశంలోనికి వారు వెళ్లి, దానిని స్వాధీనం చేసుకునేటట్లు నీవు వారిని నడిపించు.”
- ద్వితీయోపదేశకాండము 10:12సుమారు క్రీ.పూ. 1491
ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏమి అడుగుతున్నారు? మీ దేవుడైన యెహోవాయందు మీరు భయం కలిగి ఉండాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయనను ప్రేమించాలని, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడనైన యెహోవాను సేవించాలని,
- ద్వితీయోపదేశకాండము 10:13సుమారు క్రీ.పూ. 1491
మీ మేలుకోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న యెహోవా ఆజ్ఞలు శాసనాలు పాటించమనే కదా?
- ద్వితీయోపదేశకాండము 10:14సుమారు క్రీ.పూ. 1491
ఆకాశాలు, మహాకాశాలు, భూమి, భూమిపై ఉన్నవన్నీ మీ దేవుడైన యెహోవాకు చెందినవి.
- ద్వితీయోపదేశకాండము 10:15సుమారు క్రీ.పూ. 1491
అయితే యెహోవా మీ పూర్వికులపై తన దయ చూపించి, వారిని ప్రేమించి, జనాంగాలందరిలో వారి సంతానమైన మిమ్మల్ని ఈ రోజు వలె ఏర్పరచుకున్నారు.
- ద్వితీయోపదేశకాండము 10:16సుమారు క్రీ.పూ. 1491
కాబట్టి మీ హృదయాలను సున్నతి చేసుకుని ఇకపై మొండిగా ఉండకండి.
- ద్వితీయోపదేశకాండము 10:17సుమారు క్రీ.పూ. 1491
ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా దేవుళ్ళకు దేవుడు ప్రభువులకు ప్రభువు, గొప్ప దేవుడు, బలవంతుడు, అద్భుత దేవుడు, పక్షపాతం లేనివారు, లంచం పుచ్చుకోని దేవుడు.
- ద్వితీయోపదేశకాండము 10:18సుమారు క్రీ.పూ. 1491
తండ్రిలేనివారికి, విధవరాండ్రకు న్యాయం తీరుస్తారు, మీ మధ్యన ఉన్న విదేశీయులను ప్రేమించి వారికి అన్నవస్త్రాలు ఇస్తారు.