కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 10:19సుమారు క్రీ.పూ. 1491

    మీరు కూడ ఈజిప్టులో విదేశీయులుగా ఉన్నారు కాబట్టి మీరు విదేశీయులను ప్రేమించాలి.

  2. ద్వితీయోపదేశకాండము 10:20సుమారు క్రీ.పూ. 1491

    మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను సేవించండి. ఆయనను గట్టిగా పట్టుకుని ఆయన పేరిట ప్రమాణాలు చేయండి.

  3. ద్వితీయోపదేశకాండము 10:21సుమారు క్రీ.పూ. 1491

    మీరు స్తుతించవలసింది ఆయననే; మీ కళ్లారా మీరు చూసిన గొప్ప భయంకరమైన అద్భుతాలను మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.

  4. ద్వితీయోపదేశకాండము 10:22సుమారు క్రీ.పూ. 1491

    ఈజిప్టుకు వెళ్లినప్పుడు మీ పూర్వికులు మొత్తం డెబ్బైమంది, అయితే ఇప్పుడు మీ దేవుడైన యెహోవా ఆకాశంలోని నక్షత్రాలవలె మిమ్మల్ని అసంఖ్యాకంగా వృద్ధిచేశారు.

  5. ద్వితీయోపదేశకాండము 11:1సుమారు క్రీ.పూ. 1491

    మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మీకు చెప్పేవాటన్నిటిని, ఆయన శాసనాలను, ఆయన చట్టాలను, ఆయన ఆజ్ఞలను ఎల్లప్పుడు పాటించాలి.

  6. ద్వితీయోపదేశకాండము 11:2సుమారు క్రీ.పూ. 1491

    మీ దేవుడైన యెహోవా క్రమశిక్షణను చూసింది, అనుభవించింది మీ పిల్లలు కాదని ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి: ఆయన మహిమను, ఆయన బలమైన హస్తాన్ని, ఆయన చాచిన చేయిని;

  7. ద్వితీయోపదేశకాండము 11:3సుమారు క్రీ.పూ. 1491

    ఈజిప్టులో, ఈజిప్టు రాజైన ఫరోకు అతని దేశమంతటికి ఆయన చేసిన అసాధారణ గుర్తులు;

  8. ద్వితీయోపదేశకాండము 11:4సుమారు క్రీ.పూ. 1491

    ఈజిప్టు సైన్యానికి, దాని గుర్రాలకు రథాలకు ఆయన చేసింది, వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్ర సముద్రపు నీటితో వారిని కప్పివేయడం, యెహోవా వారిపై నిత్య నాశనం ఎలా తెచ్చారో మీరు చూశారు.

  9. ద్వితీయోపదేశకాండము 11:5సుమారు క్రీ.పూ. 1491

    మీరు ఈ చోటికి చేరుకునేవరకు అరణ్యంలో ఆయన మీ కోసం ఏమి చేశారో చూసింది మీ పిల్లలు కాదు.

  10. ద్వితీయోపదేశకాండము 11:6సుమారు క్రీ.పూ. 1491

    ఆయన రూబేనీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములకు చేసిన దానిని అనగా ఇశ్రాయేలీయులందరి మధ్యలో భూమి నోరు తెరిచి వారిని వారు కుటుంబాలను వారి గుడారాలను వారికి చెందిన ప్రతి జీవిని మ్రింగివేసిన విధానాన్ని మీరు చూశారు.

  11. ద్వితీయోపదేశకాండము 11:7సుమారు క్రీ.పూ. 1491

    యెహోవా చేసిన ఈ గొప్ప కార్యాలన్నిటిని చూసింది మీ సొంత కళ్లు.

  12. ద్వితీయోపదేశకాండము 11:8సుమారు క్రీ.పూ. 1491

    కాబట్టి ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలన్నిటిని పాటించండి, అప్పుడు మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటి వెళ్తున్న ఆ దేశంలోనికి వెళ్లడానికి బలం కలిగి ఉంటారు,

  13. ద్వితీయోపదేశకాండము 11:9సుమారు క్రీ.పూ. 1491

    తద్వార వారికి వారి సంతానానికి ఇస్తానని యెహోవా మీ పూర్వికులతో వాగ్దానం చేసిన దేశంలో అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు అధిక కాలం జీవిస్తారు.

  14. ద్వితీయోపదేశకాండము 11:10సుమారు క్రీ.పూ. 1491

    మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఈజిప్టు దేశం వంటిది కాదు; అక్కడ మీరు విత్తనాలు విత్తి కూరతోటలలో చేసినట్లు వాటికి కాళ్లతో నీరు పెట్టారు.

  15. ద్వితీయోపదేశకాండము 11:11సుమారు క్రీ.పూ. 1491

    మీరు యొర్దాను దాటి వెళ్లి స్వాధీనం చేసుకోబోయే దేశం ఆకాశపు వర్షాన్ని త్రాగే పర్వతాలు లోయలు ఉన్న దేశము.

  16. ద్వితీయోపదేశకాండము 11:12సుమారు క్రీ.పూ. 1491

    అది మీ దేవుడైన యెహోవా సంరక్షించే దేశము; సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దేవుడైన యెహోవా దృష్టి దాని మీద నిలిచి ఉంటుంది.

  17. ద్వితీయోపదేశకాండము 11:13సుమారు క్రీ.పూ. 1491

    కాబట్టి ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలకు నమ్మకంగా లోబడితే, మీరు మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించాలి.

  18. ద్వితీయోపదేశకాండము 11:14సుమారు క్రీ.పూ. 1491

    అప్పుడు మీ దేశంలో సకాలంలో తొలకరి కడవరి వర్షాలు కురిపిస్తాను. అప్పుడు మీరు ధాన్యాన్ని క్రొత్త ద్రాక్షరసాన్ని, ఒలీవ నూనెను సమకూర్చుకోవచ్చు.

  19. ద్వితీయోపదేశకాండము 11:15సుమారు క్రీ.పూ. 1491

    మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను; మీరు తిని తృప్తి చెందుతారు.

  20. ద్వితీయోపదేశకాండము 11:16సుమారు క్రీ.పూ. 1491

    జాగ్రత్తపడండి, లేదా మీరు మోసపోయి ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని పూజించి సేవిస్తారు.

  21. ద్వితీయోపదేశకాండము 11:17సుమారు క్రీ.పూ. 1491

    అప్పుడు యెహోవా కోపం మీమీద రగులుకొని ఆయన ఆకాశాన్ని మూసేస్తారు, అప్పుడు వాన కురవదు, భూమి పండదు, యెహోవా మీకు ఇవ్వబోయే ఆ మంచి దేశంలో ఉండకుండా మీరు త్వరలోనే నశించిపోతారు.

  22. ద్వితీయోపదేశకాండము 11:18సుమారు క్రీ.పూ. 1491

    ఈ నా మాటలు మీ మనస్సులో హృదయంలో ఉంచుకోండి; వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి.

  23. ద్వితీయోపదేశకాండము 11:19సుమారు క్రీ.పూ. 1491

    వాటిని మీ పిల్లలకు నేర్పించండి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు మీరు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి.

  24. ద్వితీయోపదేశకాండము 11:20సుమారు క్రీ.పూ. 1491

    మీ ఇంటి ద్వారబంధాల మీద ద్వారాల మీద వాటిని వ్రాయండి,

  25. ద్వితీయోపదేశకాండము 11:21సుమారు క్రీ.పూ. 1491

    తద్వార యెహోవా మీ పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో మీరు, మీ పిల్లలు ఎక్కువ రోజులు అనగా భూమిపై ఆకాశం ఉన్నంత కాలం మీరు జీవిస్తారు.