కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 12:15సుమారు క్రీ.పూ. 1451

    అయితే మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆశీర్వాదం ప్రకారం, మీ ఇళ్ళలో ఉన్న పశువులను, జింకను లేదా దుప్పిని తిన్నట్లుగా మీకు ఇష్టం వచ్చినంత మాంసాన్ని తినవచ్చు. ఆచారరీత్య పవిత్రులైనవారు, అపవిత్రులైనవారు దానిని తినవచ్చు.

  2. ద్వితీయోపదేశకాండము 12:16సుమారు క్రీ.పూ. 1451

    అయితే మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి.

  3. ద్వితీయోపదేశకాండము 12:17సుమారు క్రీ.పూ. 1451

    మీ ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో దశమభాగాన్ని, లేదా మీ పశువుల్లో, మందలలో మొదట పుట్టిన దానిని, లేదా మీరు ఇస్తామన్న మ్రొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు ప్రత్యేక అర్పణలు వేటిని మీ పట్టణాల్లో తినకూడదు.

  4. ద్వితీయోపదేశకాండము 12:18సుమారు క్రీ.పూ. 1451

    అయితే మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలంలోనే మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో ఉండే లేవీయులు, అందరు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో తిని, మీ చేతి పనులన్నిటిని బట్టి మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి.

  5. ద్వితీయోపదేశకాండము 12:19సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ దేశంలో ఉన్నంతకాలం లేవీయులను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడండి.

  6. ద్వితీయోపదేశకాండము 12:20సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం ఆయన మీ సరిహద్దులు విశాలపరచినప్పుడు, మీకు మాంసం తినాలనే ఆశ కలిగి, “నేను కొంత మాంసాన్ని తింటాను” అని అనుకోవచ్చు. అప్పుడు మీకు కావలసినంత మాంసాన్ని తినవచ్చు.

  7. ద్వితీయోపదేశకాండము 12:21సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా తన నామం కోసం ఏర్పరచుకున్న స్థలం మీకు చాలా దూరంగా ఉంటే, యెహోవా మీకు ఇచ్చిన పశువుల్లో, మందలో నుండి పశువులను వధించి, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీ స్వస్థలాలలోనే మీకు కావలసినంత మాంసాన్ని మీరు తినవచ్చు.

  8. ద్వితీయోపదేశకాండము 12:22సుమారు క్రీ.పూ. 1451

    జింకను దుప్పిని తిన్నట్లుగా మీరు వాటిని తినవచ్చు. ఆచారరీత్య పవిత్రులైనవారు అపవిత్రులైనవారు తినవచ్చు.

  9. ద్వితీయోపదేశకాండము 12:23సుమారు క్రీ.పూ. 1451

    రక్తం తినకుండా చూసుకోండి, రక్తమంటే ప్రాణము కాబట్టి మాంసంతో పాటు ప్రాణాన్ని తినకూడదు.

  10. ద్వితీయోపదేశకాండము 12:24సుమారు క్రీ.పూ. 1451

    ఖచ్చితంగా మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి.

  11. ద్వితీయోపదేశకాండము 12:25సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా దృష్టిలో సరియైన దానిని మీరు చేస్తారు కాబట్టి దానిని తినకండి, అప్పుడు మీకు మీ తర్వాత మీ పిల్లలకు మేలు కలుగుతుంది.

  12. ద్వితీయోపదేశకాండము 12:26సుమారు క్రీ.పూ. 1451

    అయితే మీ పవిత్ర వస్తువులను, మీరు ఇస్తానని మ్రొక్కుబడి చేసినవన్నీ తీసుకుని, యెహోవా ఎన్నుకునే ప్రదేశానికి వెళ్లండి.

  13. ద్వితీయోపదేశకాండము 12:27సుమారు క్రీ.పూ. 1451

    మీ దహనబలులను, వాటి రక్తమాంసాలను మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పించాలి. మీ బలుల రక్తాన్ని మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయాలి, అయితే ఆ మాంసాన్ని మీరు తినవచ్చు.

  14. ద్వితీయోపదేశకాండము 12:28సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా దృష్టిలో సరియైన దానిని మీరు చేస్తారు కాబట్టి మీకు, మీ తర్వాత మీ పిల్లలకు మేలు కలిగేలా నేను మీకు ఇస్తున్న నిబంధనలన్నిటిని మీరు జాగ్రత్తగా విని పాటించాలి.

  15. ద్వితీయోపదేశకాండము 12:29సుమారు క్రీ.పూ. 1451

    మీరు దాడి చేసి వెళ్లగొట్టబోతున్న జనాంగాలను మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి తొలగిస్తారు. అయితే మీరు వారిని వెళ్లగొట్టి వారి దేశంలో స్థిరపడిన తర్వాత,

  16. ద్వితీయోపదేశకాండము 12:30సుమారు క్రీ.పూ. 1451

    వారు మీ ఎదుట నుండి నిర్మూలమైనప్పుడు, మీరు వారి పద్ధతులను అనుసరించి, “ఈ ప్రజలు తమ దేవుళ్ళను ఎలా సేవిస్తున్నారు? మేము కూడా అలాగే చేస్తాము” అని అంటూ చిక్కుల్లో పడిపోకుండా జాగ్రత్తపడండి.

  17. ద్వితీయోపదేశకాండము 12:31సుమారు క్రీ.పూ. 1451

    వారి విధానాల్లో మీ దేవుడనైన యెహోవాను మీరు ఆరాధించకూడదు, ఎందుకంటే వారు తమ దేవుళ్ళను పూజిస్తూ యెహోవా ద్వేషించే అసహ్యమైన సమస్తాన్ని చేస్తారు. వారు తమ కుమారులను కుమార్తెలను తమ దేవుళ్ళకు బలిగా అగ్నిలో కాల్చివేస్తారు.

  18. ద్వితీయోపదేశకాండము 12:32సుమారు క్రీ.పూ. 1451

    నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు పాటించేలా చూడండి; దానికి ఏది కలపవద్దు, దానిలో నుండి ఏది తీసివేయవద్దు.

  19. ద్వితీయోపదేశకాండము 13:1సుమారు క్రీ.పూ. 1451

    ప్రవక్త గాని కలల ద్వారా భవిష్యత్తును చెప్పగలవారు గాని మీ మధ్యకు వచ్చి, మీ ఎదుట ఒక గుర్తును లేదా అద్భుతాన్ని ప్రకటిస్తే,

  20. ద్వితీయోపదేశకాండము 13:2సుమారు క్రీ.పూ. 1451

    ఒకవేళ చెప్పిన గుర్తు లేదా అద్భుతం జరిగి, ఆ ప్రవక్త, “మనం ఇతర దేవుళ్ళను అనుసరిద్దాం” (మీకు తెలియని దేవుళ్ళు) “వాటిని సేవిద్దాం” అని ప్రలోభపెడితే,

  21. ద్వితీయోపదేశకాండము 13:3సుమారు క్రీ.పూ. 1451

    ఆ ప్రవక్త మాటలు లేదా కలలు కనేవారి మాటలు గాని మీరు వినకూడదు. మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నారు.

  22. ద్వితీయోపదేశకాండము 13:4సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ దేవుడైన యెహోవాను వెంబడించి ఆయనకు భయపడాలి; ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనకు లోబడాలి; ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండాలి.

  23. ద్వితీయోపదేశకాండము 13:5సుమారు క్రీ.పూ. 1451

    ఈజిప్టు దేశంలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి, బానిస దేశం నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద మీరు తిరుగుబాటు చేయడానికి వారు మిమ్మల్ని ప్రేరేపించారు కాబట్టి వారు చంపబడాలి. ప్రవక్త లేదా కలలు కనేవారు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అనుసరించమని ఆజ్ఞాపించిన మార్గం నుండి మిమ్మల్ని త్రిప్పివేయడానికి ప్రయత్నించారు. ఈ విధంగా మీ మధ్యలో నుండి చెడుతనాన్ని తొలగించాలి.

  24. ద్వితీయోపదేశకాండము 13:6సుమారు క్రీ.పూ. 1451

    మీ సొంత సోదరుడు లేదా మీ కుమారుడు గాని కుమార్తె గాని, లేదా మీరు ప్రేమిస్తున్న భార్య లేదా మీ ప్రాణస్నేహితుడు గాని రహస్యంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి, “మనం వెళ్లి ఇతర దేవుళ్ళను (మీకు గాని మీ పూర్వికులకు తెలియని దేవుళ్ళు, మీ చుట్టూ ఉన్న, మీకు దగ్గరగా ఉన్న, దూరంగా ఉన్న ప్రజల దేవుళ్ళు, భూమి ఒక చివరి నుండి ఇంకొక చివరి వరకు ఉన్న దేవుళ్ళు) సేవిద్దాం” అని చెప్తే,

  25. ద్వితీయోపదేశకాండము 13:7సుమారు క్రీ.పూ. 1451

    Namely, of the gods of the people which are round about you, nigh unto thee, or far off from thee, from the one end of the earth even unto the other end of the earth;